AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రూ.3.09 కోట్ల విలువైన 5.4 కిలోల బంగారం సీజ్‌.. కొనసాగుతోన్న తనిఖీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రంలోని పలు చెక్‌పోస్ట్‌లలో విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లెక్కాపత్రంలేకుండా తరలిస్తోన్న నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో దాదాపు రూ.3.09 కోట్ల విలువైన 5.4 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఏడాది..

Telangana: రూ.3.09 కోట్ల విలువైన 5.4 కిలోల బంగారం సీజ్‌.. కొనసాగుతోన్న తనిఖీలు
Gold Seized In flight's lavatory
Srilakshmi C
|

Updated on: Oct 24, 2023 | 6:57 AM

Share

జనగామ, అక్టోబర్‌ 24: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రంలోని పలు చెక్‌పోస్ట్‌లలో విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లెక్కాపత్రంలేకుండా తరలిస్తోన్న నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో దాదాపు రూ.3.09 కోట్ల విలువైన 5.4 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఏడాది నవంబర్‌ 20న తెలంగాణ పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. పోలింగ్‌ అనంతరం డిసెంబర్​ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో దాదాపు 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఇప్పటికే ఈసీ వెల్లడించింది. కాగా తెలంగాణతోపాటు మొత్తం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మరో ఘటన.. వరకట్నం వేధింపులు వివాహిత బలి

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. మంచిర్యాలలోని శ్రావణ్‌పల్లికి చెందిన సరిత (25), జెండావెంకటా పూర్‌కు చెందిన గొడిసెల స్వామి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరి కాపురం సజావుగానే సాగింది. భార్యపై అనుమానం పెంచుకున్న స్వామి నిత్యం ఆమెను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. అనుమానించడంతో పాటు పుట్టింటి నుంచి వరకట్నం తేవాలని హింసించసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య మరొకమారు గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సరిత ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే గమనించిన భర్త స్వామి మంచిర్యాలలోని ఎ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ సరిత శనివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై శ్యాంపటేల్‌ తెలిపారు.

ఏపీలో నలుగురు పోలీసులపై వేటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా పర్చూరులో సీఐ, ముగ్గురు ఎస్సైలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటరు జాబితా సవరణలో జోక్యం చేసుకున్నారన్న కారణంతో వీరిని వేకెన్సీ రిజర్వ్‌కు పంపారు. మార్టూరు సీఐతోపాటు పర్చూరు, యద్దనపూడి, మార్టూరు ఎస్సైలుగా పేర్కొన్నారు. ఎన్నికల అధికారుల నుంచి ఫాం-7 సమాచారం తీసుకున్నారన్న కారణంతో వారిపై ఉన్నత అధికారులు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.