AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Gautami Resigns to BJP: ‘..అదే నన్ను బాధించింది’ 25 ఏళ్ల తర్వాత బీజేపీకి సినీనటి గౌతమి రాజీనామా

ప్రముఖ సినీ నటి, రాజకీయవేత్త గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. గత పాతికేళ్లుగా యాక్టివ్‌గా ఉన్న గౌతమి ఈ రోజు (అక్టోబర్ 23) తన రాజీనామా లేఖను ట్వీట్‌ చేశారు. ఈ మేరకు బీజేపీతో తన అనుబంధానికి నేటితో ముగింపు పలికారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన ఓ వ్యక్తికి పార్టీ సీనియర్‌ నేతలు అండగా నిలిచారని, తనకు ఎలాంటి సపోర్ట్‌ ఇవ్వలేదని లేఖలో గౌతమి ఆరోపించారు..

Actor Gautami Resigns to BJP: '..అదే నన్ను బాధించింది' 25 ఏళ్ల తర్వాత బీజేపీకి సినీనటి గౌతమి రాజీనామా
Actor Gautami Resigned BJP
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 23, 2023 | 11:41 AM

చెన్నై, అక్టోబర్ 23: ప్రముఖ సినీ నటి, రాజకీయవేత్త గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. గత పాతికేళ్లుగా యాక్టివ్‌గా ఉన్న గౌతమి ఈ రోజు (అక్టోబర్ 23) తన రాజీనామా లేఖను ట్వీట్‌ చేశారు. ఈ మేరకు బీజేపీతో తన అనుబంధానికి నేటితో ముగింపు పలికారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన ఓ వ్యక్తికి పార్టీ సీనియర్‌ నేతలు అండగా నిలిచారని, తనకు ఎలాంటి సపోర్ట్‌ ఇవ్వలేదని లేఖలో గౌతమి ఆరోపించారు.

‘ఈ రోజు నా జీవితంలో ఊహించని సంక్షోభంలో ఉన్నాను. పార్టీ నాయకుల నుంచి నాకు మద్ధతు కరువయ్యింది. సి అళగప్పన్‌కు పార్టీ సీనియర్‌ నేతలు అండగా నిలిచారు. నా ఆస్తి పత్రాలు, డబ్బు మోసగించిన అతనికి సపోర్ట్ చేయడం బాధగా ఉంది. చాలా బాధతో ఉన్నాను. అళగప్పన్‌ 20 ఏళ్ల క్రితం నా ఒంటరితనం, నా బలహీనత చూసి నన్ను సంప్రదించారు. ఆ సమయంలో నేను నా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథను మాత్రమేకాదు.. ఒంటరి తల్లిని కూడా. ఈ సమయంలో నేను నా భూములకు సంబంధించిన పత్రాలను ఆయన చేతిలో పెట్టాను. కానీ అతను నన్ను మోసం చేశాడనే విషయం ఈ మధ్యనే తెలుసుకున్నాను. అతని కుటుంబంలోకి నన్ను, నా కుమార్తెను స్వాగతిస్తున్నట్లు నటిస్తూ నమ్మకద్రోహం చేశాడు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చి.. చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపించారు. అయినప్పటికీ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నాను. పాతికేళ్లుగా పార్టీలో యాక్టివ్‌గా ఉన్న నాకు మద్దతు కరువైంది. చాలా బాధలో నా రాజీనామా లెటర్‌ ఇస్తున్నాను. కానీ ధృత నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అనే క్యాప్షన్‌తో జేపీ నడ్డా, పార్టీ తమిళనాడు చీఫ్ కె అన్నామలైని ట్యాగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా నటి గౌతమికి సంబంధించిన స్థిరాస్తుల విషయంలో బీజేపీకి చెందిన సీనియర్‌ నేత అళగప్పన్‌ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పోలీసు, న్యాయవ్యవస్థ తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలోని శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన గౌతమి విశాఖపట్నంలో తన చదువు పూర్తి చేశారు. విశాఖలో చదువుకుంటున్న సమయంలోనే సినీ అవకాశాలు రావడంతో నటనలోకి ప్రవేశించింది. ఆమె తన కెరీర్‌లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా