AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ఎంత గొప్ప మనసన్నా నీది? మతి స్థిమితం లేని వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించిన మంచు మనోజ్.. వీడియో

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. రోడ్డుపై మతిస్థిమితం లేకుండా తిరుగుతోన్న ఓ మానసిక వికలాంగుడికి స్వయంగా హెయిర్ కట్ చేశాడీ టాలీవుడ్ హీరో. అతనితో పాటు అనాథ ఆశ్రమానికి అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Manchu Manoj: ఎంత గొప్ప మనసన్నా నీది? మతి స్థిమితం లేని వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించిన మంచు మనోజ్.. వీడియో
Manchu Manoj
Basha Shek
|

Updated on: May 26, 2026 | 4:18 PM

Share

రాకింగ్ స్టార్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రీల్ లైఫ్ లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. సినిమాల పరంగా అతని కెరీర్ ఎలా ఉన్నా సామాజిక సేవా కార్యక్రమాలతో మాత్రం అందరి మన్ననలు అందుకుంటున్నాడీ మంచు వారబ్బాయి. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఐక్య ధైర్య సేన సమితిని మంచు మనోజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన భార్య మౌనికతో కలిసి అయిదుగురు పిల్లలను దత్తత తీసుకున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు మనోజ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీ రీ బర్త్ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వెరైటీ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ మతి స్థిమితం లేకుండా బాధపడుతోన్న వ్యక్తికి నూతన జీవితాన్ని అందించాడు. అతనికి స్వయంగా హెయిర్ కట్ చేసి స్నానం చేయించాడు. అనంతరం నూతన వస్త్రాలు బహూకరించాడు. మతిస్థిమితం లేని వ్యక్తితో పాటు ఆశ్రమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని నిర్వాహకుడు గిరికి మనోజ్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.

కాగా మతి స్థిమితం లేని వ్యక్తికి మంచు మనోజ్ హెయిర్ కట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు మంచు వారబ్బాయిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ మిరాయ్ మూవీలో విలన్ గా అదరగొట్టాడు. ఇప్పుడు అతని చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. డేవిడ్ రెడ్డి, వడ్డీ కాసులవాడ సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు మంచు మనోజ్.

ఇవి కూడా చదవండి

మతిస్థిమితం లేని వ్యక్తికి స్వయంగా హెయిర్ కట్ చేస్తోన్న మంచు మనోజ్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో