Ghee: ఈ నెయ్యి కిలో ధర అక్షరాల రూ.2 లక్షలు.. వందకు పైగా దేశాల్లో యమ డిమాండ్!
పండగల సీజన్‌లో ఆవు నెయ్యికి గిరాకీ బాగానే ఉంటుంది. పూజలో ఆవు నెయ్యి వినియోగించడం మన పూర్వికుల కాలం నుంచి సంప్రదాయంగా వస్తుంది. అంతేకాకుండా ఆవు నెయ్యిలో ఔషధ గుణాలు కారణంగా అనేక మంది ఆహారంలో దీనిని తినేందుకు ఇష్టపడతారు. నేటి కాలంలో మార్కెట్లో దొరికే అన్ని పాల ఉత్పత్తులు కల్తీమయం అయ్యాయి. దీనితో ఏది కొనాలన్నా జనాలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంటారు. సాధారణంగా మార్కెట్లో దొరికే నెయ్యి కిలో రూ. వెయ్యి లోపు ఉంటుంది. అయితే..
గాంధీనగర్, అక్టోబర్ 22: పండగల సీజన్‌లో ఆవు నెయ్యికి గిరాకీ బాగానే ఉంటుంది. పూజలో ఆవు నెయ్యి వినియోగించడం మన పూర్వికుల కాలం నుంచి సంప్రదాయంగా వస్తుంది. అంతేకాకుండా ఆవు నెయ్యిలో ఔషధ గుణాలు కారణంగా అనేక మంది ఆహారంలో దీనిని తినేందుకు ఇష్టపడతారు. నేటి కాలంలో మార్కెట్లో దొరికే అన్ని పాల ఉత్పత్తులు కల్తీమయం అయ్యాయి. దీనితో ఏది కొనాలన్నా జనాలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంటారు. సాధారణంగా మార్కెట్లో దొరికే నెయ్యి కిలో రూ. వెయ్యి లోపు ఉంటుంది. అయితే గుజరాత్‌లోని ఈ నెయ్యి కొనాలంటే మాత్రం లక్షల రూపాయాలు ధారపోయాల్సిందే. కిలో నెయ్యి అక్షరాలా రూ. 2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇంత ధర ఉన్నా కొనేందుకు మాత్రం జనాలు క్యూలు కడుతున్నారు. ఎందుకంత స్పెషల్ అని అనుకుంటున్నారా? ఆ విశేషాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం రండి..
రాజ్‌కోట్ (గుజరాత్)లోని గోండాల్‌లోని గిర్ గౌ జత్నా సంస్థాన్ నిర్వహకుడు రమేష్ భాయ్ రూపరేలియా తన గోశాలలో 200లకు పైగా ఆవులను పెంచుతున్నాడు. ఈ గోశాలలోని ఆవుల మూత్రం, పాలు, పేడ, మజ్జిగ, నెయ్యి వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తుంటాడు. ఎలాంటి కల్తీకి తావులేకుండా స్వచ్ఛమైనవే విక్రయిస్తుంటాడు. అతను తయారు చేసే నెయ్యికి యమ డిమాండ్ ఉంది. ఎందుకుంటే పురాతన గ్రంధాలను అనుసరించి కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, మందారాలు.. వంటి వివిధ మూలికలు, ఔషధ మొక్కలను నెయ్యిలో వేసి బాగా మరిగించి ప్రత్యేకంగా తయారు చేస్తాడు. ఇలా తయారు చేసిన నెయ్యి కిలో రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయిస్తుంటాడు. వామ్మో.. అంత రేటు పెట్టి నెయ్యి ఎవరు కొనుక్కుంటారు అనే సందేహం మీకు ఇపాటికి వచ్చే ఉంటుంది. ఈ ఖరీదైన నెయ్యికి స్థానికంగా మాత్రమేకాకుండా దేశ విదేశాల్లో యమ డిమాండ్ ఉంది.
అయితే ఇలా తయారు చేసిన నెయ్యిని తినడానికి మాత్రం వాడరు. కేవలం చర్మానికే దీనిని వినియోగిస్తుంటారు. ఈ నెయ్యి కాస్త రాసుకుంటే తలనొప్పి, చర్మవ్యాధులూ తగ్గుతాయని, కాస్త వాసన చూస్తే దగ్గు అదుపులో ఉంటుందని వినియోగదారులు చెబుతుంటారు. అంతేకాకుండా ఈ వనమూలికల నెయ్యి రాసుకుంటే చర్మంపై మొటిమల్నీ, నల్లమచ్చల్నీ అదుపుచేస్తుందట. కిలో నెయ్యి తయారీకి 31 లీటర్ల పాలు అవసరం అవుతాయి. నెయ్యి తయారీ నుంచి డోర్ డెలివరీ వరకు మొత్తం 140 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రమేష్ భాయ్ గత 17 ఏళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. 26 దేశాలకు చెందిన14 వేల మంది యువకులు ఈ గోశాలలో శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ తయారు చేసిన నెయ్యికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, సౌదీ అరేబియా వంటి దాదాపు 100కుపైగా దేశాల్లో రమేష్‌భాయ్ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. ఈ వనమూలికల నెయ్యి ద్వారా నెలకు రూ.10 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.