TSLPRB Constable Appointments Stopped: తెలంగాణ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక ప్రకటన

రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. తాజాగా కానిస్టేబుల్ అభ్యర్ధుల నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని సూచిస్తూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) (TSLPRB) పోలీస్‌ కమిషనర్లకు, ఎస్పీలకు..

TSLPRB Constable Appointments Stopped: తెలంగాణ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక ప్రకటన
TSLPRB Constable Appointments on Hold
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 20, 2023 | 3:19 PM

హైదరాబాద్‌, అక్టోబర్ 20: రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. తాజాగా కానిస్టేబుల్ అభ్యర్ధుల నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని సూచిస్తూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) (TSLPRB) పోలీస్‌ కమిషనర్లకు, ఎస్పీలకు సూచించింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

కాగా కానిస్టేబుల్‌ కొలువులకు ఎంపికైన అభ్యర్ధులు ఇప్పటికే శారీరక సామర్థ్య, రాత పరీక్షల్లో అర్హత సాధించారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన వీరందరికీ పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షలను నిర్వహించి శిక్షణకు పంపించేందుకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే తుది ఎంపిక సరిగా లేదని, హడావిడిగా అభ్యర్ధులను ఎంపిక చేశారంటూ పలువురు అభ్యర్థులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పైగా క్వశ్చన్‌ పేపర్‌లో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ పలువురు అభ్యర్ధులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. తప్పుగా ఇచ్చిన ఆ నాలుగు మార్కులను కలిపిన తర్వాత మరోసారి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెలువరించాలని వారు కోర్టును కోరారు.

ఆ మేరకు నాలుగు మార్కులు కలిపి.. మరోమారు తుది ఎంపిక జాబితా ప్రకటించాలని కోర్టు అక్టోబ‌రు మొదటి వారంలో ఉత్తర్వులిచ్చింది. అయితే మార్కుల్ని కలిపే ప్రక్రియపై కసరత్తు పూర్తి చేయకుండానే రిక్రూట్‌మెంట్‌ బోర్డు అభ్యర్ధుల పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలనూ నిర్వహిస్తోందంటూ పిటిషనర్లు మరోమారు న్యాయస్థానం తలుపుతు తట్టారు. దీంతో అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం అక్టోబ‌రు 19న‌ ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

కేంద్రీయ విద్యాలయ పీఆర్‌టీ రాత పరీక్ష ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీఎస్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను కేవీ సంగఠన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను తాజా విడుదల చేసింది. మొత్తం 6414 టీచర్‌ కొలువులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కేవీఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.