Watch Video: అయ్యో ఎంత ఘోరం.. కుక్కను గేటుకు వేలాడదీసి దారుణంగా చంపిన డాగ్ ట్రైనర్! వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ షాజాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట పాకిస్తానీ బుల్లీ జాతి కుక్కను కొనుగోలు చేశాడు. ఈ ఏడాది మే నెలలో భోపాల్‌లోని ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ అండ్ బోర్డింగ్ సెంటర్‌లో శిక్షణ నిమిత్తం ఆ కుక్కను అక్కడ విదిలి వెళ్లాడు. నాలుగు నెలల ట్రైనింగ్ కోసం నెలకు రూ.13 వేల చొప్పున ఫీజు కూడా చెల్లించాడు. సెప్టెంబర్‌లో ఆ డాగ్‌కు ట్రైనింగ్ పూర్తికావాల్సి ఉంది. ఇంతలో ఆ డాగ్ యజమాని నిఖిల్ జైస్వాల్ అక్టోబర్ 9న ట్రైనింగ్ సెంటర్ ట్రైనర్ రవి కుష్వాహాకు ఫోన్ చేశాడు. తన కుక్కను..
ముంబయి, అక్టోబర్ 19: పెంపుడు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చే డాగ్ ట్రైనర్స్ ఓ శునకాన్ని దారుణంగా హతమార్చారు. ట్రైనింగ్ సెంటర్ గేట్‌కు శునకాన్ని వేలాడదీసి చంపారు. ఇదంతా అక్కడి కెమెరాలో రికార్డయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మరడంతో డాగ్ ట్రైనర్స్ బండారం బయటపడింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ షాజాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట పాకిస్తానీ బుల్లీ జాతి కుక్కను కొనుగోలు చేశాడు. ఈ ఏడాది మే నెలలో భోపాల్‌లోని ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ అండ్ బోర్డింగ్ సెంటర్‌లో శిక్షణ నిమిత్తం ఆ కుక్కను అక్కడ విదిలి వెళ్లాడు. నాలుగు నెలల ట్రైనింగ్ కోసం నెలకు రూ.13 వేల చొప్పున ఫీజు కూడా చెల్లించాడు. సెప్టెంబర్‌లో ఆ డాగ్‌కు ట్రైనింగ్ పూర్తికావాల్సి ఉంది. ఇంతలో ఆ డాగ్ యజమాని నిఖిల్ జైస్వాల్ అక్టోబర్ 9న ట్రైనింగ్ సెంటర్ ట్రైనర్ రవి కుష్వాహాకు ఫోన్ చేశాడు. తన కుక్కను ఇంటికి తీసుకెళ్లేందుకు శిక్షణ పూర్తయ్యిందా? అని వాకబు చేశాడు. అయితే ట్రైనర్ రవి ఆయన కుక్క అనారోగ్యంతో చనిపోయిందని ఫోన్‌లో తెలిపాడు. ఏదో జరిగి ఉంటుందని అనుమానించిన డాగ్ యజమాని నిఖిల్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Dog killed by training centre owner in #bhopal@Manekagandhibjp ji please help us in putting them behind the bar.@deespeak #AnimalCruelty #AnimalAbuse #killed #pfa #peopleforanimal pic.twitter.com/9mGJduzYqr
— शोbhit (@2IC_Shobhit) October 18, 2023
దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ట్రైనింగ్ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ట్రైనర్ రవి కుష్వాహాతోపాటు తివారీ, దాస్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసిన కుక్కను తాళ్లతో కట్టేసి గేట్‌కు వేలాడదీసి చంపిన దృశ్యం బయటపడింది. కుక్క దాదాపు 10 నిమిషాల పాటు ప్రాణాలతో పోరాడి ఊపిరాడక మృతి చెందింది. ట్రైనింగ్ సెంటర్ గేట్‌కు కుక్కను వేలాడదీసి దారుణంగా చంపిన ఫుటేజ్ చూసి పోలీసులు సైతం షాక్ గురయ్యారు. దీంతో డాగ్ ట్రైనర్ రవి కుష్వాహాతోపాటు అక్కడ పని చేసే నేహా తివారీ, తరుణ్ దాస్‌ను అరెస్ట్ చేశారు. కాగా ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ట్రైనింగ్‌లో భాగంగా తాము కుక్కను గేట్‌కు వేలాడదీశామని.. కానీ కుక్క మెడకు తాడు బిగుసుకుని అది కుప్పకూలినట్లు పోలీసులకు తెలిపారు. అయితే తాము దానిని కాపాడేందుకు పశువైద్యుడి వద్దు తీసుకెళ్లినప్పటికీ దాని ప్రాణం దక్కలేదని కట్టుకథ అల్లి చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. అయితే బెయిలబుల్ సెక్షన్ల కారణంగా నిందితులకు నోటీసులిచ్చి పోలీసులు వారిని విడుదల చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.