Overnight Billionaire: రాత్రిరాత్రే కోటీశ్వరుడైనా దినసరి కూలీ.. బ్యాంకు ఖాతాలో రూ.200 కోట్లు జమ!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లా బతానియా గ్రామానికి చెందిన దినసరి కూలీ శివప్రసాద్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని బ్యాంకు అకౌంట్‌కు రూ.200 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. దీంతో ఇన్‌కం ట్యాక్స్ వారు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో తన బ్యాంకుకు అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియక తికమక పడ్డ సదరు కూలీ, ఐటీ అధికారులు పంపిన పన్ను పత్రాలు చూసి కళ్లు తేలేశాడు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక బాధితుడు లబోదిబో..
బస్తీ, అక్టోబర్ 18: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లా బతానియా గ్రామానికి చెందిన దినసరి కూలీ శివప్రసాద్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని బ్యాంకు అకౌంట్‌కు రూ.200 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. దీంతో ఇన్‌కం ట్యాక్స్ వారు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో తన బ్యాంకుకు అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియక తికమక పడ్డ సదరు కూలీ, ఐటీ అధికారులు పంపిన పన్ను పత్రాలు చూసి కళ్లు తేలేశాడు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక బాధితుడు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లా లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బటానియా గ్రామానికి చెందిన కూలీ శివప్రసాద్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడిగా మారి ఇటీవల సంచలనం సృష్టించాడు. ఢిల్లీలో కూలీ పనులు చేసుకునే శివ ప్రసాద్‌కు కొద్ది రోజుల క్రితం ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. అతని బ్యాంకు ఖాతాలో రూ.2 వేలకోట్ల 21 కోట్ల 30 లక్షలకు పైగా నగదు జమ అయినట్లు నోటీసులో ఐటీ శాఖ తెలిపింది. అయితే అతని పేరిట ఎక్కడ బ్యాంకు ఖాతా ఉందో, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా జమ అయ్యిందో.. దానిపై ఎవరు రై.4.58 లక్షల పన్ను చెట్టించారో అతని అర్ధం కాలేదు. ఎవరో తన పేరు మీద తెరిచిన ఖాతాలో ఈ లావాదేవీలు జరిపారని అర్ధం చేసుకున్నాడు. అంతేకాకుండా తన పాన్ కార్డు 2019లో పోగొట్టుకున్నానని కూడా అధికారులకు తెలిపాడు. కూలి పనులు చేసుకుంటూ జీవించేతాను ఆదాయపు పన్ను కింద రూ.4.58 లక్షలు తన ఖాతా నుంచి చెల్లించడం ఏమిటో తనకేమీ అర్థం కావడంలేదని వాపోయాడు.
పోగొట్టుకున్న తన పాన్‌కార్డు ఆధారంగా ఎవరో అక్రమంగా బ్యాంకు ఖాతాను తెరిచి మోసానికి పాల్పడుతున్నారంటూ స్థానిక లాల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో శివ ప్రసాద్ ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.