- Telugu News Photo Gallery Cinema photos Pakistani Cricketers Fell In Love With These Bollywood Actress, photos viral on social media
పాక్ క్రికెటర్లతో పీకల్లోతు ప్రేమలో పడిన హీరోయిన్లు వీరే..
క్రికెటర్లు, సినీ హీరోయిన్లకు లవ్ ఎఫైర్స్ ఉంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళితే మరికొన్నేమో మధ్యలోనే పెటాకులవుతుంటాయి. ఇప్పటికీ అనేక మంది క్రికెటర్లు నటీమణులతో డేటింగ్ ఉన్నారనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఈ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఏకంగా పాక్ క్రికెటర్లతో ప్రేమాయణం నడిపారని వార్తలు వచ్చాయి.
Srilakshmi C | Edited By: Ravi Kiran
Updated on: Oct 18, 2023 | 9:03 AM

క్రికెటర్లు, సినీ హీరోయిన్లకు లవ్ ఎఫైర్స్ ఉంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళితే మరికొన్నేమో మధ్యలోనే పెటాకులవుతుంటాయి. ఇప్పటికీ అనేక మంది క్రికెటర్లు నటీమణులతో డేటింగ్ ఉన్నారనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఈ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఏకంగా పాక్ క్రికెటర్లతో ప్రేమాయణం నడిపారని వార్తలు వచ్చాయి. వారెవరెవరంటే..నటి సోనాలి బింద్రే దక్షిణాదిన ఎన్నో హిట్ మువీల్లో నటించి అశేష అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ నటి పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్‌తో పీకల్దాక ప్రేమలో మునిగినట్లు సమాచారం. అటు షోయబ్ అక్తర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సోనాలి ఫోటో తన పర్సులో ఉందని చెప్పుకొచ్చాడు.

పాక్ క్రికెటర్ వసీం అక్రమ్, సుస్మితా సేన్‌ల సంబంధం కూడా అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వసీమ్‌తో తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సుస్మితా సేన్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వసీం అక్రమ్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది.

నటి రేఖ, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్యకూడా ఘాటు ప్రేమ నడిచినట్లు తెలుస్తోంది. ఇద్దరూ తమ బంధంపై ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించనప్పటికీ వీరి రిలేషన్ గురించి అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.

ఇక టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి. కేవలం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు మాత్రమే ఇద్దరం కలిసి పాల్గొన్నామని.. ఏదో ఉందని వస్తున్న రూమర్స్ కేవలం నిరాధారమైనవి అని తమన్నా కొట్టిపారేసింది.

పాకిస్థాన్ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్, బాలీవుడ్ నటి రీనా రాయ్ ప్రేమాయణం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వీరి తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లారు. అయితే వారి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. వీరికి ఓ కూతురు పుట్టిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. వీరి కూతురు పేరు సనమ్.





























