AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Madness: భార్య సీరియల్స్‌ పిచ్చితో విసిగిన భర్త.. చివరకు ఏం చేశాడంటే..

బుల్లితెర సీరియల్స్‌ చూడని గృహిణి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సీరియల్స్‌ చూస్తూ కాలం గడిపేస్తుంటారు. ఈ సీరియల్స్‌ పిచ్చిలో పడి భర్త, పిల్లలను కూడా అశ్రద్ధ చేసే మహిళలు సైతం ఉన్నారు. టీవీలకు అతుక్కుపోయి సీరియల్స్‌ చూసే మహిళల వల్ల భార్యభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. ఛానెల్‌ మార్చమంటే భార్యలకు పట్టరాని కోపం వస్తుంది. తాజాగా ఓ భర్త తన భార్య సీరియల్‌ పిచ్చితో వేగిపోయాడు. దీంతో జీవితం మీద విరక్తి కలిగిందేమో వెనకా ముందు ఆలోచించకుండా ప్రాణాలు..

Serial Madness: భార్య సీరియల్స్‌ పిచ్చితో విసిగిన భర్త.. చివరకు ఏం చేశాడంటే..
Serial Madness
Srilakshmi C
|

Updated on: Oct 17, 2023 | 3:28 PM

Share

చెన్నై, అక్టోబర్‌ 17: బుల్లితెర సీరియల్స్‌ చూడని గృహిణి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సీరియల్స్‌ చూస్తూ కాలం గడిపేస్తుంటారు. ఈ సీరియల్స్‌ పిచ్చిలో పడి భర్త, పిల్లలను కూడా అశ్రద్ధ చేసే మహిళలు సైతం ఉన్నారు. టీవీలకు అతుక్కుపోయి సీరియల్స్‌ చూసే మహిళల వల్ల భార్యభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. ఛానెల్‌ మార్చమంటే భార్యలకు పట్టరాని కోపం వస్తుంది. తాజాగా ఓ భర్త తన భార్య సీరియల్‌ పిచ్చితో వేగిపోయాడు. దీంతో జీవితం మీద విరక్తి కలిగిందేమో వెనకా ముందు ఆలోచించకుండా ప్రాణాలు తీసేసుకున్నాడు. కామెడీగా అనిపించినా ఈ దుర్ఘటన వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో ఈ సంఘటన వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన నిషా, ఆశీర్వాదం అనే దంపతులు ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆశీర్వాదం ఉద్యోగి. స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక నిషా గృహిణి. ఇంటి వద్దనే ఉండేది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న నిషా టీవీ సీరియల్స్‌ చూడటం అలవాటుగా మర్చుకుంది. దీంతో రోజంగా సీరియల్స్‌ చూస్తూ టీవీ వద్దనే ఉండేది. భర్త ఆశీర్వాదం సాయంత్రం ఆఫిస్‌ నుంచి ఇంటికి వచ్చినా భార్య నిషా తనకు ఇష్టమైన సీరియల్ చూస్తూ ఉండేది. ఆమె సీరియల్స్‌ పిచ్చి వల్ల దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. తీరుమార్చుకోని నిషా సీరియల్స్‌ తదేకంగా చూస్తూ ఉండేది.

ఈ క్రమంలో ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన ఆశీర్వాదం ఛానల్ మార్చాలంటూ భార్య నిషాను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆశీర్వాదంకు చిర్రెత్తుకొచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఛానల్ మార్చాలంటూ ఆశీర్వాదం పట్టుబట్టడంతో చిన్న గొడవ కాస్త చిరిగి చిరిగా గాలివానగా మారింది. నిషా అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆశీర్వాదం కూడా కోపంతో ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఇంటికి తిరిగొచ్చిన నిషాకు ఇంట్లో ఆశీర్వాదం భర్త ఆశీర్వాదం విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. భార్య నిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.