Woman Cuts Tongue With Sword: భక్తి పారవశ్యంలో కత్తితో నాలుకను తెగ నరికి దేవతకు అర్పణ.. వీడియో తీసేందుకు ఎగబడ్డ భక్తులు
మూఢభక్తి ముసుగులో ఓ యువతి దారుణానికి పాల్పడింది. దేవలను పూజించేందుకు గుడికి వెళ్లిన ఓ యువతి తన్మయత్వంలో పదునైన కత్తితో నాలుకను తెగనరికి దేవతకు అర్పించింది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లోని బాగేశ్వరి శక్తి ధామ్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటన సమయంలో ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎవరూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం..
భోపాల్, అక్టోబర్ 16: మూఢభక్తి ముసుగులో ఓ యువతి దారుణానికి పాల్పడింది. దేవలను పూజించేందుకు గుడికి వెళ్లిన ఓ యువతి తన్మయత్వంలో పదునైన కత్తితో నాలుకను తెగనరికి దేవతకు అర్పించింది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లోని బాగేశ్వరి శక్తి ధామ్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటన సమయంలో ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎవరూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని సాగూర్ భాగూర్‌లో మాతా బాగేశ్వరి శక్తి ధామ్ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన, చారిత్రాత్మక దేవాలయం. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవరాత్రుల మొదటి రోజు అమృత్ కుండ్‌కు చెందిన ఓ యువతి నాలుకను కత్తితో కోసి దేవతకు సమర్పించింది. యువతి కత్తి పట్టిన వెంటనే అక్కడున్న జనం అంతా మరింత బిగ్గరగా, ఉత్సాహంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఆమె అమాంతం కత్తితో నాలుకను తెగ నరికి దేవతకు సమర్పించింది. కత్తి దాటికి యువతి నోటి నుంచి రక్తపు ధారాపాతంగా కారిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం యువతి సృహతప్పి పడిపోయింది. అయినప్పటికీ అక్కడ ఉన్న భక్తుల్లో ఏక్కరూ కూడా ఆమెను రక్షించడానికి ప్రయత్నించలేదు. బదులుగా ఈ సంఘటన తర్వాత ఆలయ ప్రాంగణంలోని భక్తులంగా పెద్ద ఎత్తున అమ్మవారి స్తుతులతో ప్రతిధ్వనిస్తుంది. ఈ యువతిని దేవత పూనిందని అక్కడున్న వారంతా చెప్పుకొవడం విశేషం. దీంతో ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు, తమ మొబైల్ ఫోన్ కెమెరాలలో బంధించడానికి వందలాది మంది ప్రజలు పోటెత్తారు.
MP: खरगोन जिले में अंधविश्वास के चलते एक लड़की ने बाघेश्वरी शक्ति धाम के अमृत कुंड में तलवार से अपनी जीभ काटी. इस दौरान उसकी जीभ से खून भी निकल रहा था. उसे ये हरकत करते भीड़ ने देखा. लेकिन, किसी ने उसे रोका नहीं. लोगों को लगा उसमें माता का वास है. pic.twitter.com/mY6SZKRCFx
— Sushil Kaushik (@SushilKaushikMP) October 16, 2023
అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో ఈ సంఘటన జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.