Video Viral: తహసీల్దార్‌ ఆఫీస్‌లో తనిఖీలు చేపట్టిన కోతి.. ఫైళ్లు తిరగేస్తూ బిజీగా ఫోజులు! ఆ తర్వాత ఏం జరిగిందంటే

ఈ రోజుల్లో ప్రభుత్వ కొలువు పొందాలంటే పెద్ద తపస్సే చెయ్యాలి. అందునా రెవెన్యూ ఆఫీస్‌లో తహసీల్దార్‌ ఉద్యోగం కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడితేగానీ కొలువు దక్కదు. గ్రూప్‌ 2 క్లియర్‌ చేస్తేనే తహసీల్దార్‌ స్థాయి ఉద్యోగం సొంతం అవుతుంది. కానీ మనుషులకు దక్కని యోగం ఓ కోతికి భేషుగ్గా దక్కిందండి. దర్జాగా ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి.. అధికారుల కుర్చీలో కూర్చుంది. ఆనక ఊరికే కూర్చేంటే ఏం బాటుంటుంది అనుకుందోమో.. ఎదురుగా కనిపించిన రికార్డులు తిరగేసింది. ఏదో ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన అధికారి..

Follow us

|

Updated on: Oct 15, 2023 | 7:24 PM

లక్నో, అక్టోబర్‌ 15: ఈ రోజుల్లో ప్రభుత్వ కొలువు పొందాలంటే పెద్ద తపస్సే చెయ్యాలి. అందునా రెవెన్యూ ఆఫీస్‌లో తహసీల్దార్‌ ఉద్యోగం కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడితేగానీ కొలువు దక్కదు. గ్రూప్‌ 2 క్లియర్‌ చేస్తేనే తహసీల్దార్‌ స్థాయి ఉద్యోగం సొంతం అవుతుంది. కానీ మనుషులకు దక్కని యోగం ఓ కోతికి భేషుగ్గా దక్కిందండి. దర్జాగా ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి.. అధికారుల కుర్చీలో కూర్చుంది. ఆనక ఊరికే కూర్చేంటే ఏం బాటుంటుంది అనుకుందోమో.. ఎదురుగా కనిపించిన రికార్డులు తిరగేసింది. ఏదో ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన అధికారి మాదిరి హడావిడిగా ఫైల్లు తిరగేసి చక్కాపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మీరూ చూసేయండి..

యూపీలోని సహరాన్‌పూర్‌లోని బెహత్‌ తహసీల్దార్‌ ఆఫీస్‌లో ఈ దృశ్యం కనిపించింది. ఓ కోతి అక్కడి ప్రభుత్వ కార్యాలయంలోని టేబుల్‌ ముందు కూర్చుని ఓ అధికారిలా ఫైళ్లను తనిఖీ చేస్తూ కనిపించింది. కోతి టేబుల్ ముందున్న కూర్చీలో కూర్చుని ఫైళ్లలోని పేజీలు తిప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అధికారులు అరటి పండు ఇచ్చినా.. అత్యాశకు పోకుండా, కనీసం అటువైపైనా చూడకుండా బిజీగా ఫైళ్లు తిరగేస్తుంటుంది. కొంత సమయం తర్వాత ఓ ఉద్యోగి అరటి పండు తొక్క తీసి కోతికి ఇవ్వబోతాడు. ఈసారి కూడా కోతి అరటిపండు తీసుకోకుండా ఫైళ్లు తిప్పే పనిలో నిమగ్నమై ఉంటుంది.ఆ కార్యలయంలోని అధికారులు మాత్రం కోతికి మర్యాద ఇస్తున్నట్లు టేబుల్‌ చుట్టూ నిలబడి చూస్తుంటారు.

ఇదంతా చూసేందుకు ఎలా ఉందంటే.. ప్రభుత్వ కార్యాలయంలో తనిఖీలు చేసేందుకు వచ్చిన అధికారి మాదిరి అక్కడి దృశ్యం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పలువురు అధికారుల నిర్లక్షంపై విమర్శలు చేశారు. ఈ ఘటన అక్టోబర్ 12న బెహత్ తహసీల్ రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ దీపక్‌కుమార్‌ మాట్లాడుతూ వైరల్‌ వీడియో తహసీల్‌ దీంతో SDM అధికారులు ఈ వీడియోపై వివరణ ఇచ్చారు. కోతి తనకుతానే స్వయంగా తహసీల్దార్‌ ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్లిందని, ఏ కాగితానికి లేదా ఫైల్‌కు ఎటువంటి నష్టం కలిగించలేదని తెలిపారు. కోతి గురించి అటవీ శాఖకు సమాచారం అందించారు. తహసీల్‌ ఆవరణలోకి కోతులు వస్తున్నాయని, అయితే కార్యాలయం లోపల కుర్చీపై కూర్చున్న ఘటన జరగడం ఇదే తొలిసారి అని సబ్‌కలెక్టర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.