Israel Hamas Conflict: ‘తల్లి గర్భం చీల్చి.. కడుపులోని బిడ్డను కత్తితో పొడిచారు’ హమాస్‌ దాడిలో భయానక దృశ్యం

ఇజ్రాయెల్‌లోని యోసి లాండౌ (Yossi Landau) అనే వ్యక్తి జకా అనే సంస్థలో వాలంటీర్‌గా మృత దేహాలను సేకరిస్తున్నాడు. 3 దశాబ్ధాలుగా (33 ఏళ్లుగా) ఆ దేశంలో ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వంటి సమయాల్లో అసహజ మరణాలు సంభవించినప్పుడు అతను మృతదేహాలను సేకరిస్తున్నాడు. తాజాగా ఇజ్రాయెల్‌లో జరుగుతోన్న యుద్ధం కారణంగా గాజా మిలిటెంట్ల చేతిలో మరణించిన వారి మృతదేహాలను సేకరిస్తుండగా భయాకక దృశ్యాలు అతని కంటపడ్డాయి. దాదాపు 12 వందల మృతదేహాలను..

Israel Hamas Conflict: 'తల్లి గర్భం చీల్చి.. కడుపులోని బిడ్డను కత్తితో పొడిచారు' హమాస్‌ దాడిలో భయానక దృశ్యం
Israel Hamas Conflict
Follow us

|

Updated on: Oct 13, 2023 | 4:20 PM

ఇజ్రాయెల్‌, అక్టోబర్‌ 13: ఇజ్రాయెల్‌లోని యోసి లాండౌ (Yossi Landau) అనే వ్యక్తి జకా అనే సంస్థలో వాలంటీర్‌గా మృత దేహాలను సేకరిస్తున్నాడు. 3 దశాబ్ధాలుగా (33 ఏళ్లుగా) ఆ దేశంలో ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వంటి సమయాల్లో అసహజ మరణాలు సంభవించినప్పుడు అతను మృతదేహాలను సేకరిస్తున్నాడు. తాజాగా ఇజ్రాయెల్‌లో జరుగుతోన్న యుద్ధం కారణంగా గాజా మిలిటెంట్ల చేతిలో మరణించిన వారి మృతదేహాలను సేకరిస్తుండగా భయాకక దృశ్యాలు అతని కంటపడ్డాయి. దాదాపు 12 వందల మృతదేహాలను సేకరించగా వాటిల్లో ఒక మృతదేహం చూసి అతని గుండె బద్ధలైంది. కొన్ని దశాబ్దాల పాటు ఎన్నో మృత దేహాలను దగ్గర్నుంచి చూసినప్పటికీ తాజా మారణహోమంలో కనిపించిన ఆ మృతదేహం అతని కాళ్ల కింద నేల కంపించేలా చేసింది. హమాస్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ గర్భిణి మృతదేహం అది.

గాజాకు ఉత్తరాన తీరప్రాంత నగరమైన అష్డోడ్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరగా రోడ్డుపో గర్భిణీ మహిళ భయానక స్థితిలో మరణించి ఉండటం చూశాడు. అది చూసి అతడికి కన్నీళ్లు ఆగలేదట. తల్లి పొట్టను చీల్చి మరీ కడుపులోని బిడ్డను చంపడం చూసి అతని ఒళ్లు గగుర్పొడించిందట. ఈ భయానక ఘటనలను అతడు ఓ అంతర్జాతీయ మీడియాకు వివరిస్తూ భావోధ్వేగానికి గురయ్యాడు.

‘శనివారం ఉదయం నేను సైరన్ల శబ్దాలు విని ఉలిక్కిపడి లేచా. రాకెట్ దాడులు జరుగుతున్నట్లు హెచ్చరికలు రావడంతో క్షణాల్లోనే షెల్టర్లలోకి వెళ్లిపోయాం. అప్పటికే ప్రధాన భూభాగంలోకి హమాస్‌ (Hamas) మిలిటెంట్లు చొరబడ్డాయి. పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ దళాల మధ్య కాల్పులు జరుగుతుండగా.. మునుపెన్నడూ చూడని హింసను కళ్లారా చూశాను. దాడి జరిగిన తర్వాత మృతదేహాలను సేకరించేందుకు మా బృందంతో గాజా సరిహద్దుకు బయల్దేరాం. 15 నిముషాల్లో వెళ్లవల్సిన మాకు 11 గంటల సమయం పట్టింది. దారి పొడవునా మృతదేహాలను సేకరిస్తూనే ఉన్నాం. సరిహద్దు సమీప ప్రాంతాల్లో అనేక కార్లు బోల్తా పడ్డాయి. వీధుల్లో చెల్లాచెదురుగా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు రిఫ్రిజిరేటెడ్ ట్రక్కుల్లోకి ఎక్కించిన తర్వాత గాజా నుంచి 5 కిలోమీటర్ల (మూడు మైళ్ళు) దూరంలో ఉన్న 1,200 మంది నివాసితులతో కూడిన కిబ్బట్జ్ బీరీకి చేరుకున్నాం. అక్కడ ఓ ఇంట్లో ఇన్నేళ్లలో మేం ఎన్నడూ చూడని దారుణ ఘటన చూశాం. ఓ ఇంట్లోని ప్రవేశించగా గర్భవతైన ఓ మహిళ కడుపు చీల్చి, లోపలి బిడ్డను కత్తితో పొడిచి చంపారు. బొడ్డుతాడు కూడా తెగని ఆ బిడ్డను పొడిచి చంపారు. దాదాపు 20 మంది పిల్లలతో సహా అనేక మంది ప్రజల చేతులు వెనుకకు కట్టి తుపాకులతో కాల్చి చంపారు. కొందరు మహిళలను అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చారు.

ఇవి కూడా చదవండి

కిబ్బుట్జ్‌ ప్రాంతంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే సూపర్‌నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై జరిగిన దాడిలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు తొలగించినప్పటికీ ఆ ప్రాంతమంతా వస్తువులు చల్లాచెదురుగా పడి ఉన్నాయంటూ అక్కడి యుద్ధ వాతారణాన్ని మీడియాకు వివరించాడు. హమాస్ దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌ సైన్యం ఇప్పటివరకు గాజాపై 6 వేల బాంబులతో దాడి చేసింది. ఈ దాడుల్లో 1,417 మంది గాజా వాసులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.