Operation Ajay: ఇజ్రాయిల్ నుంచి ఢిల్లీ చేరుకున్న 212 మంది భారతీయులు.. ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రికి స్వాగతం
ఈ సమయంలో ఇజ్రాయిల్ నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇజ్రాయిల్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశం విడిచి 212 మంది భారతీయులతో కూడిన మొదటి చార్టర్ విమానం గురువారం బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇజ్రాయిల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన పౌరులు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ ఉదయం AI1140 విమానంలో న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.
ఈ సమయంలో ఇజ్రాయిల్ నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇజ్రాయిల్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశం విడిచి 212 మంది భారతీయులతో కూడిన మొదటి చార్టర్ విమానం గురువారం బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరింది.
భారతీయ పౌరులతో మొదటి విమానం
#WATCH | First flight carrying 212 Indian nationals from Israel, lands at Delhi airport; received by Union Minister Rajeev Chandrasekhar pic.twitter.com/uB71qIBmJy
— ANI (@ANI) October 13, 2023
అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని ఈ ఉదయం 212 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన విమానం
#OperationAjay: First flight carrying 212 Indian nationals from Israel, lands at Delhi airport pic.twitter.com/tKrV0WV4X9
— ANI (@ANI) October 13, 2023
ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు
సమాచారం ప్రకారం దాదాపు 18000 మంది భారతీయులు ఇజ్రాయిల్‌లో ఉన్నారు. వీరిలో భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు భారతీయులెవరూ గాయపడినట్లు సమాచారం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన ఒక వ్యక్తితో మేము సంప్రదిస్తున్నాము అతను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు.
వెస్ట్ బ్యాంక్, గాజాలో చిక్కుకున్న భారతీయులు
AF C-17, C-230, IL-76 స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నాయని అరిందమ్ బాగ్చి చెప్పారు. వెస్ట్ బ్యాంక్‌లో 12 మంది భారతీయులు, గాజాలో 3-4 మంది భారతీయులు కూడా ఉన్నారని తాము వారితో టచ్‌లో ఉన్నామని, వారిని తిరిగి తీసుకువస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. పాలస్తీనాపై భారత్ తన విధానాన్ని పునరుద్ఘాటించిందని ఆయన అన్నారు. మానవతా చట్టాన్ని అనుసరించడం అంతర్జాతీయ బాధ్యత అని బాగ్చి అన్నారు. దీనితో పాటు అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాడాల్సిన బాధ్యత ప్రపంచానికి ఉందని చెప్పారు.
ఆపరేషన్ అజయ్ ప్రారంభం
శాంతియుతంగా జీవిస్తున్న పాలస్తీనా సార్వభౌమాధికారం ఆచరణీయ రాజ్య స్థాపన కోసం ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష చర్చలను పునఃప్రారంభించాలని భారతదేశం కోరుకుంటుందని.. శాంతిని భారత్ కోరుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మన పౌరుల సౌలభ్యం కోసం ఆపరేషన్ అజయ్ ప్రారంభించినట్లు ప్రతినిధి గురువారం తెలిపారు. తొలి విమానం రాత్రి టెల్ అవీవ్ చేరుకుని ఈరోజు (శుక్రవారం) ఉదయం తిరిగి భారత్‌కు చేరుకుంటుంది. ఇందులో దాదాపు 230 మంది భారతీయులు తిరిగి వస్తున్నారు.
ప్రయాణికులు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు
భారతీయులు తిరిగి మన దేశానికి తీసుకుని వచ్చేందుకు వీలుగా ఈ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎందుకంటే పోరాటం ప్రారంభమైన అక్టోబర్ 7న ఎయిర్ ఇండియా తన విమానాలను నిలిపివేసింది. తిరిగి వచ్చే వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని.. వారి రిటర్న్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
ఆపరేషన్ అజయ్ గురించి ఇజ్రాయిల్ విద్యార్థి శుభం కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. చాలా మంది విద్యార్థులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తాము భారత రాయబార కార్యాలయం ద్వారా ప్రతి భారతీయ పౌరుడికి కొన్ని నోటిఫికేషన్‌లు, లింక్‌లు ఇచ్చారని.. ఇది మా ధైర్యాన్ని పెంచిందన్నారు. భారత రాయబార కార్యాలయం మాతో అనుసంధానమై ఉన్నట్లు తాము భావించామని ఇది మాకు ఒక రకమైన ఉపశమనం కలిగించింది. తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని శుభం కుమార్ చెప్పారు.
#WATCH | Israel: "I am very happy. It has been very scary here… Thank you Indian government for this evacuation..," says Visesh an Indian passenger returning to India from Tel Aviv under 'Operation Ajay' pic.twitter.com/8cL2p5AkhX
— ANI (@ANI) October 12, 2023
ఇప్పటి వరకు వేలాది మంది చనిపోయారు
మీడియా నివేదికల ప్రకారం ఇజ్రాయిల్‌లో ఇప్పటివరకు 222 మంది సైనికులతో సహా 1300 మందికి పైగా మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. 1973లో ఈజిప్ట్ , సిరియాతో వారాలపాటు జరిగిన యుద్ధం తర్వాత ఇంత భారీ సంఖ్యలో మరణాలు కనిపించలేదన్నారు. అక్కడి అధికారుల ప్రకారం హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌లో మహిళలు, పిల్లలతో సహా కనీసం 1,417 మంది మరణించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..