Sahure Pyramid: 4400 ఏళ్ల తర్వాత తెరవబడిన ఈజిప్షియన్ పిరమిడ్.. అనేక రహస్యాలు వెల్లడవుతాయని విశ్వాసం..

పిరమిడ్ లో ఉన్న గదులన్నీ ఛేదించలేని  పరిగణించబడతాయి. ఈ పిరమిడ్ లోపల దాగున్న విషయాలను ఎవరూ చూడలేదు.. అయితే ఇప్పుడు  సాహురా పిరమిడ్ లోని 8 స్టోర్ రూముల్లో అనేక రహస్యాలు దాగున్నాయని.. ఒక గది  తెరవనున్న నేపథ్యంలో పిరమిడ్ లోని ఒక రహస్యాన్ని అయినా బయటపెట్టగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఆ గదులన్నీ బాగా దెబ్బతిన్నాయి.

Sahure Pyramid: 4400 ఏళ్ల తర్వాత తెరవబడిన ఈజిప్షియన్ పిరమిడ్.. అనేక రహస్యాలు వెల్లడవుతాయని విశ్వాసం..
Pyramid Of Sahure
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2023 | 8:36 AM

నైలు నది వర ప్రసాదం ఈజిప్టు.. ఈ దేశాన్ని పిరమిడ్ల దేశం అని కూడా పిలుస్తారు.  ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక వింతగా ఖ్యాతించాయి ఈజిప్టి పిరమిడ్స్.. ఇక్కడ ఉన్న పిరమిడ్లు అనేక రహస్యలకు నెలవుగా  పరిగణించబడతాయి. వాటిల్లో ఒకటి సాహురా పిరమిడ్. ఈ పిరమిడ్ సుమారు 4400 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ ఫారో ఫారో సాహురే కోసం నిర్మించబడింది. ఇప్పుడు ఈ మర్మమైన పిరమిడ్‌లోని ఒక గది తెరవబడింది. దీంతో పురాతన రహస్యాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. పిరమిడ్ నిర్మాణ మూలాన్ని,  పిరమిడ్ లోపల దాగి ఉన్న ఫారోల రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

డైలీ స్టార్ యొక్క నివేదిక ప్రకారం జూలియస్-మాక్సిమిలియన్స్-యూనివర్శిటీకి చెందిన ఒక బృందం సాహురా పిరమిడ్ కి చెందిన రహస్యాల గుట్టుని విప్పేందుకు ప్రయత్నిస్తోంది. 3డి లేజర్ స్కానింగ్,  ప్రాంతం  మ్యాప్‌ల సహాయంతో.. ఈ శాస్త్రవేత్తల బృందం పిరమిడ్‌లోని ఎనిమిది గదుల్లో ఒకదానికి సంబంధించిన రహస్య మార్గాన్ని తెరవగలమని భావిస్తోంది. పిరమిడ్ లో ఉన్న గదులన్నీ ఛేదించలేని  పరిగణించబడతాయి. ఈ పిరమిడ్ లోపల దాగున్న విషయాలను ఎవరూ చూడలేదు.. అయితే ఇప్పుడు  సాహురా పిరమిడ్ లోని 8 స్టోర్ రూముల్లో అనేక రహస్యాలు దాగున్నాయని.. ఒక గది  తెరవనున్న నేపథ్యంలో పిరమిడ్ లోని ఒక రహస్యాన్ని అయినా బయటపెట్టగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఆ గదులన్నీ బాగా దెబ్బతిన్నాయి.

నివేదికల ప్రకారం ఈ పిరమిడ్ ఐదవ రాజవంశానికి చెందిన ఫారో సాహురే కోసం 26 నుండి 25 వ శతాబ్దం BCలో నిర్మించబడింది. ప్రధాన పిరమిడ్ సుమారుగా కత్తిరించిన సున్నపురాయి బ్లాక్‌లతో నిర్మించబడింది, మట్టి మోర్టార్‌తో బంధించబడింది. చుట్టూ చక్కటి తెల్లటి సున్నపురాయి ఉంది.

ఇవి కూడా చదవండి

పిరమిడ్ లోపలి గదులను రాతి గోడలను దొంగలు ధ్వంసం చేశారని, దీని వలన ఖచ్చితమైన పునర్నిర్మాణం అసాధ్యమని చెబుతున్నారు. సాహురే తన అంత్యక్రియల స్మారక చిహ్నం కోసం అబుసిర్ సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఎంచుకున్నాడని నమ్ముతారు. ఇక్కడ పిరమిడ్ నిర్మించబడింది, ఈ పిరమిడ్ నిర్మాణ అభివృద్ధి, పురోగతి,చారిత్రక అవగాహనకు చిహ్నంగా నిలిచినా ఇప్పటికీ దీని నమూనా ప్రపంచానికి ఒక రహస్యంగా మిగిలిపోయింది. మానవ మేథస్సుని సవాల్ చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..