Viral News: 4 ఏళ్లు ముందుకెళ్లి భవిష్యత్ ను చూశా.. 2027 లో ప్రపంచంలో జీవులు అంతం.. షాకింగ్ కామెంట్స్

వాస్తవానికి వ్యక్తి తనను తాను టైమ్ ట్రావెలర్‌గా అభివర్ణించుకున్నాడు. అతను భవిష్యత్తుకి వెళ్లి.. అక్కడ నుంచి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. మిర్రర్ నివేదిక ప్రకారం.. వ్యక్తి 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూసిన తర్వాత తిరిగి వచ్చానని చెప్పాడు. అతను 2027 లోకి వెళ్ళినప్పుడు భూమిపై మనుషులు లేరని చెప్పాడు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు మాత్రమే కనిపించాయి. తాను ప్రస్తుతానికి విడిచి తర్వాత, తాను రోమ్‌తో సహా అనేక ప్రదేశాలను సందర్శించానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

Viral News: 4 ఏళ్లు ముందుకెళ్లి భవిష్యత్ ను చూశా.. 2027 లో ప్రపంచంలో జీవులు అంతం.. షాకింగ్ కామెంట్స్
Tiktok 'time Traveller
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Sep 21, 2023 | 7:51 PM

కొన్ని సంవత్సరాల క్రితం 2012 సంవత్సరంలో ప్రపంచం అంతం అవుతుందని ప్రపంచవ్యాప్తంగా ఒక పుకారు వ్యాపించింది. అప్పట్లో ఈ వార్తను చాలా మంది ప్రజలు విశ్వసించారు. అంతేకాదు అందుకు తగినట్లు తగిన నివారణ సన్నాహాలు కూడా చేశారు. కొంతమంది వ్యక్తులు విపత్తు సమయంలో ఉపయోగించుకునేలా బంకర్లను కూడా నిర్మించారు. తరువాత ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని నిరూపించబడింది. అయితే ప్రపంచం అంతం గురించి అనేక వాదనలు చేసేవారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం అలాంటి వ్యక్తి చేసిన వాదన  ఒకటి చర్చలో ఉంది. 4 ఏళ్ల తర్వాత అంటే 2027లో ప్రపంచంలో తాను తప్ప మరెవరూ మిగలరని ఓ వ్యక్తి పేర్కొన్నాడు.

వాస్తవానికి వ్యక్తి తనను తాను టైమ్ ట్రావెలర్‌గా అభివర్ణించుకున్నాడు. అతను భవిష్యత్తుకి వెళ్లి.. అక్కడ నుంచి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. మిర్రర్ నివేదిక ప్రకారం.. వ్యక్తి 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూసిన తర్వాత తిరిగి వచ్చానని చెప్పాడు. అతను 2027 లోకి వెళ్ళినప్పుడు భూమిపై మనుషులు లేరని చెప్పాడు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు మాత్రమే కనిపించాయి. తాను ప్రస్తుతానికి విడిచి తర్వాత, తాను రోమ్‌తో సహా అనేక ప్రదేశాలను సందర్శించానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అంతేకాదు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొలోస్సియంను కూడా చూసినట్లు అక్కడ ఒక్క మానవుడు కూడా కనిపించలేదని పేర్కొన్నాడు.  అయితే సాధారణంగా అక్కడ పర్యాటకుల రద్దీ ఉంటుందని పేర్కొన్నాడు.

భూమిపై మిగిలి ఉన్న ఏకైక వ్యక్తి

నివేదికల ప్రకారం వ్యక్తి పేరు జేవియర్. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో అనేక వీడియోలు, చిత్రాలను కూడా చేశారు. అందులో గగుర్పాటు కలిగించే భయానక దృశ్యాలు చూడవచ్చు. 2027లో భూమిపై మిగిలి ఉన్న ఏకైక మానవుడు తానేనని ఆయన పేర్కొన్నారు. అతను షేర్ చేసిన వీడియోలోమొత్తం నగరం  చిత్రాన్ని చూపించాడు. మొత్తం నగరం పూర్తిగా ఖాళీగా ఉంది. కార్లు, ఎత్తైన భవనాలు ఉన్నాయి, కానీ మనుషులు లేరు. మనుష్యులందరూ అదృశ్యమైనట్లు కనిపించింది.

ఇవి కూడా చదవండి

నగరమంతా నిర్మానుష్యం

తాను 2027 లో రోమ్ వీధుల్లో పగటిపూట తిరుగుతున్నానని, వీధులు పూర్తిగా ఖాళీగా కనిపించాయని జేవియర్ చెప్పాడు. జేవియర్ ఇలా వింత అనుభవనాలను చెప్పడం ఇదే మొదటిసారి కాదు 2021లో కూడా అతను ఇలాంటి వింత వాదనలు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..