Viral Video: భారీ కొండ చిలువని చంటిపిల్లాడిలా భుజాన వేసుకున్న మహిళ.. షాకింగ్ వీడియో వైరల్..
వైరల్ అవుతున్న ఓ వీడియోలో భారీ కొండా చిలువను మోసుకుని వెళ్తుంది ఓ మహిళ. అంత భారీ కొండచిలువను ఆ మహిళ భుజంపై వేసుకుని తీసుకుని వెళ్లడం చూసిన వారు షాక్ అవుతున్నారు. గుండె జబ్బున్నవారు చూస్తే ప్రాణాలు కోల్పోతారెమో కూడా. ఆ మహిళ పసుపు రంగులో మిలమిలా మెరిసిపోతున్న కొండచిలువను తన భుజంపై ఎత్తుకుని ఏదో చిన్నపిల్లను ఎత్తుకుని ఆడించినట్లు ఆడిస్తుంది.

ప్రకృతిలో జీవుల్లో పాములు ఒకటి. ఈ జీవులు ప్రపంచ వ్యాప్తంగా తరచుగా కనిపించే జీవులు. అయితే ఎక్కువగా వేసవి కాలంలో, వర్షాకాలంలో మాత్రమే మనుషులు తిరిగే ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే బొరియలలో , పుట్టల్లో నివసించే ఈ పాములు ఎండ వేడిని తట్టుకోలేవు. అదే సమయంలో వర్షాకాలంలో బొరియలు నీటితో నిండిపోతాయి. అందుకనే ఈ కాలాల్లో పాములు బయటకు వచ్చి, ఆపై ఇక్కడ, అక్కడ తిరుగుతాయి. వాస్తవానికి ఇవి వన్యప్రాణులే అయినప్పటికీ.. మానవాళికి దూరంగా అడవుల్లో నివసించడానికి ఇష్టపడతాయి. అయితే కొన్నిసార్లు ఇవి మానవ నివాసాలలోకి ప్రవేశించి తమ ఉనికితో అందరినీ భయపెడుతూ ఉంటాయి. అయితే పాములకు అస్సలు భయపడని వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారు ఎటువంటి పాములనైనా సరే ఓ బొమ్మలా.. లేదా పెంపుడు కుక్క పిల్లలా హత్తుకుని ఉంటారు. ఒడిలో పెట్టుకుంటారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ వీడియో చూస్తే ఎవరికైనా గూస్‌బంప్స్ రావడం ఖాయం.
వైరల్ అవుతున్న ఓ వీడియోలో భారీ కొండా చిలువను మోసుకుని వెళ్తుంది ఓ మహిళ. అంత భారీ కొండచిలువను ఆ మహిళ భుజంపై వేసుకుని తీసుకుని వెళ్లడం చూసిన వారు షాక్ అవుతున్నారు. గుండె జబ్బున్నవారు చూస్తే ప్రాణాలు కోల్పోతారెమో కూడా. ఆ మహిళ పసుపు రంగులో మిలమిలా మెరిసిపోతున్న కొండచిలువను తన భుజంపై ఎత్తుకుని ఏదో చిన్నపిల్లను ఎత్తుకుని ఆడించినట్లు ఆడిస్తుంది.
అదే సమయంలో ఆ కొండచిలువ పూర్తిగా ఆ మహిళ శరీరాన్నీ చుట్టెయ్యడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ మహిళ దాని ప్రయత్నాలను ఫలించనివ్వడం లేదు. అయితే అసలు పాముని చూస్తే చాలు.. అది విషపురమైనా కాకపోయినా వీలైనంత దూరం పారిపోతాం.. ఇంట్లో కనిపిస్తే దానిని బయటకు పంపించే వరకూ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇబ్బంది పడతాం.. మరి అలాంటిది ఒక భారీ కొండచిలువను ఎదో చిన్నపిల్లనో పెంపుడు పిల్లినో ఎత్తుకున్నట్లు భుజాన ఎత్తుకున్న ఆ మహిళ దైర్యం చుస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే.
వీడియో చూడండి
View this post on Instagram
షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేక్‌స్రీల్మ్ అనే ఐడితో షేర్ చేయబడింది. ఇప్పటివరకు లక్షకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే 5 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.
అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘మహిళ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నట్టుంది’ అని ఎవరో చెబుతుంటే, ‘కొండచిలువ తినేస్తే ఏమై ఉండేది’ అని ఒకరు అంటున్నారు. అదేవిధంగా మరొకరు ఏ వ్యక్తి అయినా ఆ కొండ చిలువ దాడి చేస్తే.. దాడి నుండి తప్పించుకోవడానికి ఒంటరిగా పోరాడగలడని తాను అనుకోవడం లేదని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




