Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రాంక్ పేరుతో తల్లికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కొడుకు.. ఇంత ఖరీదైన గిఫ్ట్.. నీ తల్లి ప్రాణం అంటున్న నెటిజన్లు

సర్ ఫ్రైజ్ గిఫ్ట్ పేరుతో తల్లిదండ్రులను భయపెట్టే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతి ఇవ్వరు. అయితే ఇప్పడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తల్లి తన పుట్టిన రోజుకు వచ్చిన బహుమతి చూసి షాక్ తింది. ఆమె ఏమిటి ఆ బహుమతి చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. ఇలాంటివి కూడా బహుమతిగా ఇస్తారా అని ఆలోచించాల్సిందే. ఆ గిఫ్ట్ చూసి మీరు కూడా షాక్ తింటారు. 

Viral Video: ప్రాంక్ పేరుతో తల్లికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కొడుకు.. ఇంత ఖరీదైన గిఫ్ట్.. నీ తల్లి ప్రాణం అంటున్న నెటిజన్లు
Son Birth Day Gift
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2023 | 1:27 PM

పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలతో పాటు మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల పుట్టిన రోజుకో తమ సంతోషాన్ని అభిమానాన్ని తెలియజేస్తూ బహుమతులు ఇవ్వడం సాధారణ విషయం. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజుని గుర్తు చేసుకుని మరీ బహుమతి ఇస్తారు. చాక్లెట్ ,కేక్  , టెడ్డీ బేర్ , డ్రెసెస్ లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులను బహుమతిగా ఇస్తారు. సాధారణంగా కొడుకులు, కూతుళ్ల పుట్టిన రోజు అయితే తల్లిదండ్రులు వారికి నచ్చిన బహుమతిని అందజేస్తారు. అదే సమయంలో తమ తల్లిదండ్రుల పుట్టిన రోజు వేడుకలను పిల్లలు ఇష్టంగా జరుపుతారు. వారిని ఆనందాన్ని కలిగించేలా కొన్ని బహుమతులను కూడా ఇస్తారు. అంతేకాని సర్ ఫ్రైజ్ గిఫ్ట్ పేరుతో తల్లిదండ్రులను భయపెట్టే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతి ఇవ్వరు. అయితే ఇప్పడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తల్లి తన పుట్టిన రోజుకు వచ్చిన బహుమతి చూసి షాక్ తింది. ఆమె ఏమిటి ఆ బహుమతి చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. ఇలాంటివి కూడా బహుమతిగా ఇస్తారా అని ఆలోచించాల్సిందే. ఆ గిఫ్ట్ చూసి మీరు కూడా షాక్ తింటారు.

అసలు విషయానికి వస్తే.. ఓ కుర్రాడు తన తల్లి పుట్టిన రోజున సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.. అది చూసి ఆ మహిళకు దాదాపు గుండెపోటు వచ్చినంత పనైంది. ఒక మహిళ తన కళ్ళు మూసుకుని కొడుకు ఇచ్చే బహుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. అప్పుడు ఎదురుగా ఉన్న టేబుల్ పై ఒక బాక్స్ పెట్టి ఉంది. ఆమె కళ్ళు తెరిచి తన ముందు పెద్ద పెట్టెను చూస్తుంది. ఆ పెట్టెలో ఏదో ప్రత్యేక మైన బహుమతి ఉన్నట్లు భావించి.. ఆశ్చర్యపోయిన కళ్లతో ఆ పెట్టెను చేతుల్లోకి తీసుకుని చుట్టూ చూసింది. అప్పుడు ఆమె  కొడుకు బాక్స్ తెరవమని చెప్పినట్లు ఉన్నాడు. కొడుకు కోరిక మేరకు దాన్ని తెరిచింది. కానీ పెట్టె తెరవగానే భయంతో పారిపోయింది. ఆమె భయంతో వణికింది. ఎందుకంటే నిజానికి ఆ పెట్టెలో పాము ఉంది. అకస్మాత్తుగా పామును చూసిన తర్వాత ఎవరైనా భయపడతారు కదా..

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

అయితే ఆ పాము నిజమో, నకిలీదో తెలియనప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Broofcolor అనే ఐడితో షేర్ చేయబడింది, ఇది ఇప్పటివరకు 4 లక్షల 95 వేల సార్లు వ్యూస్ ను 37 వేలకి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.

అదే సమయంలో ఈ వీడియోను చూసిన తర్వాత వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఇది చాలా ఖరీదైన జోక్. ఆ తల్లి ఇలాంటి జోక్‌తో చనిపోయి ఉండవచ్చు’ అని అంటే.. మరొకరు ‘ఆమె ఆత్మ ఆమె శరీరాన్ని విడిచిపెట్టింది, కానీ తిరిగి వచ్చింది’ అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..