AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మానవత్వానికి వయసుతో పనేముంది.. కోటిమందికి పైగా చూసిన వీడియోలో ఓ చిన్నారి మంచి మనసు కనిపిస్తుంది.. వీడియోపై ఓ లుక్ వేయండి మరి..

ఈ దృశ్యం చూసినప్పుడు ఎవరికైనా భూమి మీద మానవత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. అయితే పిల్లలు దేవుడితో సమానం.. వాళ్లకు ఎటువంటి కల్లాకపటం ఉండదని అంటారు. ఆ విషయాన్ని రుజువు చేస్తూ.. చిన్నారుల మంచి తనం మానవత్వం తెలిపే సంఘటనలు అనేకం మన ముందు కనిపిస్తాయి. రోడ్డుమీద నిలబడిన ఓ బిచ్చగాడిని చూసిన ఓ బాలిక చూపించిన సహృదయం చూస్తే ఎవరికైనా కంట కన్నీరు వస్తుంది. 

Viral Video: మానవత్వానికి వయసుతో పనేముంది.. కోటిమందికి పైగా చూసిన వీడియోలో ఓ చిన్నారి మంచి మనసు కనిపిస్తుంది.. వీడియోపై ఓ లుక్ వేయండి మరి..
Video Viral
Surya Kala
|

Updated on: Sep 08, 2023 | 9:37 AM

Share

ప్రతిరోజూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ల్లో రకరకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వీడియోలు హృదయానికి శాంతిని ఇస్తాయి. మరికొన్ని ఫన్నీగా ఉండి నవ్విస్తాయి.. ఇంకొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని ఇంకా మనసుల్లో మానవత్వం.. సాటి మనిషి పట్ల దయ, కరుణ, సానుభూతి ఇంకా మనుషుల్లో ఉన్నాయనిపిస్తాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని రుజువు అనిపిస్తుంది ఎవరికైనా. నేటి తరం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. చాలామంది బంధాలకు, బంధుత్వాలకు దూరంగా ఏ బాధ్యత లేకుండా బతకాలనుకునేవారు ఎక్కువ. అయినప్పటికీ నేటి పిల్లలు మానవత్వాన్ని తమలో ఉందని నిరూపిస్తున్నారు. దీనిని చూసిన తర్వాత ఎవరైనా చిన్నారికి సలామ్ అని అంటారు.

తరచుగా కష్టాల్లో ఉన్నవారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అయితే కొంతమంది జంతువుల పట్ల సానుభూతితో ఉంటారు.. వాటి పట్ల చూపించే ప్రేమ మనుషులపై చూపించరు. అసలు వారు మనుషులను పట్టించుకోరు. ఈ దృశ్యం చూసినప్పుడు ఎవరికైనా భూమి మీద మానవత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. అయితే పిల్లలు దేవుడితో సమానం.. వాళ్లకు ఎటువంటి కల్లాకపటం ఉండదని అంటారు. ఆ విషయాన్ని రుజువు చేస్తూ.. చిన్నారుల మంచి తనం మానవత్వం తెలిపే సంఘటనలు అనేకం మన ముందు కనిపిస్తాయి. రోడ్డుమీద నిలబడిన ఓ బిచ్చగాడిని చూసిన ఓ బాలిక చూపించిన సహృదయం చూస్తే ఎవరికైనా కంట కన్నీరు వస్తుంది.

వీడియో చూడండి

రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. ఆ రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్న ఒక బిచ్చగాడు కనిపిస్తున్నాడు. అతనికి కళ్లు లేనట్లు తెలుస్తోంది. ఆ బిచ్చగాడిని చూస్తూ చాలామంది వెళ్లిపోతున్నారు. అయితే ఒక బాలిక స్కూల్ బ్యాగ్ వేసుకుని అతని దగ్గరకు వచ్చింది. తన దగ్గర ఉన్న బ్యాగ్ నుంచి తనకు ఇంట్లో తినమని పెట్టిన శాండ్‌విచ్‌ని తీసి అతనికి తినిపించి.. అనంతరం అతని ప్రేమగా సృజిస్తూ… కరచాలనం చేసింది.

ఈ వీడియో queen_of_valley అనే ఖాతాతో ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేశారు. దీనిని ఇప్పటివరకు కోట్లాది మంది వీక్షించారు. వీడియోలో అమ్మాయి బిచ్చగాడికి సహాయం చేసిన విధానాన్ని చూసి, వినియోగదారులు చిన్నారిని  అభినందిస్తున్నారు, ఒకరు ఈ రోజుల్లో అలాంటి దయగల పిల్లలు చాలా తక్కువగా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేశారు.

మరిన్ని  ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ