Viral Video: ఆ దేశంలో స్ట్రీట్ ఫుడ్ తేళ్లు, బొద్దింకలే.. ఇష్టంగా తింటున్న యువత.. షాకింగ్ వీడియో వైరల్..

ఇప్పడూ చైనా, ఇటాలియన్,  కొరియన్ వంటి విదేశీ వంటలు కూడా తినే ఆహారంలో భాగమైపోతున్నాయి. మోమోస్, న్యూడుల్స్, వంటి ఫుడ్ ని అందరూ తిన్నా.. కొన్ని రకాల ఆహారం తినడం అంటే అమ్మబాబోయ్ మాకు వద్దు అని అంటారు.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక రకమైన ఆహారం కనిపిస్తుంది. వీధుల్లో రోడ్డు పక్కన అమ్ముతున్న ఆహారం.. వాటిని తింటున్న యువతను చూసి వికారంగా ఫీల్ అవుతున్నారు.

Viral Video: ఆ దేశంలో స్ట్రీట్ ఫుడ్ తేళ్లు, బొద్దింకలే.. ఇష్టంగా తింటున్న యువత.. షాకింగ్ వీడియో వైరల్..
Viral Video
Follow us

|

Updated on: Sep 11, 2023 | 11:18 AM

భారత దేశంలో రకరకాల ఆహారాలుంటాయి. సాంప్రదాయ ఆహారంతో పాటు వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందుకనే భారతీయులను ఆహారప్రియులు అని అంటారు. కొంతమంది సాంప్రదాయ ఆహారమైన పులిహోర, పాయసం, దద్దోజనం వంటి వాటిని ఇష్టంగా తింటే.. మరికొందరు స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరీ, సమోసా, చాట్ వంటి వాటిని ఇష్టంగా తింటారు. అయితే ఇప్పడూ చైనా, ఇటాలియన్,  కొరియన్ వంటి విదేశీ వంటలు కూడా తినే ఆహారంలో భాగమైపోతున్నాయి. మోమోస్, న్యూడుల్స్, వంటి ఫుడ్ ని అందరూ తిన్నా.. కొన్ని రకాల ఆహారం తినడం అంటే అమ్మబాబోయ్ మాకు వద్దు అని అంటారు.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక రకమైన ఆహారం కనిపిస్తుంది. వీధుల్లో రోడ్డు పక్కన అమ్ముతున్న ఆహారం.. వాటిని తింటున్న యువతను చూసి వికారంగా ఫీల్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అమ్మాయి తేళ్లు సహా అన్ని రకాల కీటకాలతో తయారు చేసిన ఆహారాన్ని అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ గా చౌమెయిన్ అంటే న్యుడిల్స్ , మోమోస్ వంటివాటిని అమ్ముతున్నట్లే.. బాలిక తన ఫుడ్ స్టాల్ లో  పురుగుల ఆహారాన్ని అమ్ముతుంది. బాలిక ప్లేట్‌లో  చనిపోయిన తేళ్లను తీసుకుని ఆ తేలును తీసుకొని నూనెలో వేయించింది. వేగిన తేలుని ఒక ప్లేట్ లోకి  తీసుకుని.. దానిపై ఉప్పు, మిరియాలను చల్లింది. అనంతరం ఆ యువతి ప్లేట్ లో ఉన్న కొన్ని బొద్దింకలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని వాటిని కూడా వేయించింది. రెడీ అయిన ఫ్రైడ్ తేలు, బొద్దింకలను ఆహారాన్ని  కస్టమర్‌కి  అందిస్తోంది. ఈ వీడియో థాయ్‌లాండ్‌కు చెందినది. ఇక్కడ ఇలాంటి వింత ఆహారాన్ని స్ట్రీట్ ఫుడ్‌గా విక్రయిస్తారు. స్థానిక యువత కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ ని ఎంతో ఇష్టంగా తింటారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో foodie_saurabh_ అనే IDతో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటివరకు 1 లక్ష 62 వేల కంటే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకోగా.. వందలాది మంది వీడియోను లైక్ చేసారు. అంతేకాదు రకరకాల కామెంట్స్ కూడా చేశారు.

ఒక వినియోగదారు  వీరి ఆహారం అలవాట్లు తగలెయ్య.. మాకు ఆకలి కూడా వెయ్యడం లేదు… అసలు ఎలా తింటున్నారో మాకు అర్ధం కావడం లేదు.. అని ఒకరు కోపంగా తన నిరసన వ్యక్తం చేయగా.. ఇక్కడ ఉన్నవారికి తాము ఏం తింటున్నారో వారికైనా తెలుస్తుందా..  తెలియడం లేదా’ అని మరొకరు కామెంట్రు చేయగా.. ఇది రీల్స్ కోసం చేస్తున్న డ్రామా’ అని రాశారు. వీరు ఏదైనా తింటారని కామెంట్ చేస్తే.. అదే సమయంలో కొందరు తేళ్ల ఫుడ్ చాలా గుతుంది.. రుచికరంగా ఉంటుందని  వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ