Funny: బూట్లకి బురద అంటుకుంటుందని యువకుల తంటాలు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు రహదారులు జలమయం అయిపోయి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడటం మనం చూస్తుంటాం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, కాల్వలు దాటి వెళ్లాల్సిన వారి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. తాజాగా ఇద్దరు యువకులు నీట్‌గా తయారై ఎక్కడికో బయలుదేరారు. వర్షం కారణంగా దారిమొత్తం బురదమయంగా ఉంది. వారికి దారిలో ఓ చిన్న పిల్లకాలువ లాంటిది దాటి వెళ్లాల్సి వచ్చింది.
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు రహదారులు జలమయం అయిపోయి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడటం మనం చూస్తుంటాం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, కాల్వలు దాటి వెళ్లాల్సిన వారి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. తాజాగా ఇద్దరు యువకులు నీట్‌గా తయారై ఎక్కడికో బయలుదేరారు. వర్షం కారణంగా దారిమొత్తం బురదమయంగా ఉంది. వారికి దారిలో ఓ చిన్న పిల్లకాలువ లాంటిది దాటి వెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడ ఓ బుల్డోజర్ పూడికతీత పనులు చేస్తోంది. దాంతో ఆ ప్రాంతమంతా బురదగామారింది. అందులోనుంచి నడిచివెళ్తే తమ బూట్లు పాడవుతాయని ఆ ఇద్దరు వ్యక్తులు బల్డోజర్ నడుపుతున్న వ్యక్తిని సాయమడిగారు. ఆ యువకులు ఇద్దరూ బుల్డోజర్ టబ్‌లో కూర్చున్నారు. ఆ డ్రైవర్ వారిని మెల్లగా అవతలి ఒడ్డుకు చేర్చుతున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే క్షణంలో యువకులు ఇద్దరూ పట్టుతప్పి బురదలో పడిపోయారు. బూట్లు పాడవుతాయని బుల్డోజర్ ఎక్కితే మొత్తం బురదచేసి పడేసినట్టయింది వారి పరిస్థితి. వారిద్దరూ నీట్‌గా తయారై ఆఫీసుకు వెళ్తున్నట్టున్నారు. చేసేదిలేక బురదలోంచి లేచి ఇంటిముఖం పట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను షేర్ చేసిన ఒక వినియోగదారు బుల్డోజర్లను దుర్వినియోగం చేస్తే ఇలాగే ఉంటుందని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియోచూసిన వేలాదిమంది నెటిజన్లు లైక్ చేస్తూ ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

