Congo Landslide: కాంగోలో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు..17 మంది మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషాన్
ఆఫ్రికాలోని కాంగోలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి 17 మంది మరణించారు. మీడియా నివేదికల ప్రకారం కొండచరియలు విరిగిపడటంతో చాలా ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా మరికొంత మంది ఉండి ఉండే అవకాశం ఉందని.. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నివేదిక ప్రకారం కాంగో నది ఒడ్డున మోంగ్లా ప్రావిన్స్‌లోని లిస్లే నగరంలో ఈ కొండచరియలు […]
ఆఫ్రికాలోని కాంగోలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి 17 మంది మరణించారు. మీడియా నివేదికల ప్రకారం కొండచరియలు విరిగిపడటంతో చాలా ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా మరికొంత మంది ఉండి ఉండే అవకాశం ఉందని.. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
నివేదిక ప్రకారం కాంగో నది ఒడ్డున మోంగ్లా ప్రావిన్స్‌లోని లిస్లే నగరంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. బాధితులు పర్వతం దిగువన నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రావిన్స్‌లో 3 రోజుల సంతాప దినాలు
భారీ వర్షాలతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి అనేక మంది ప్రజలు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు యంత్రాల అవసరం చాలా ఉందని మోంగ్లా గవర్నర్ అన్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకు గవర్నర్ సంతాపం తెలిపారు. మొత్తం ప్రావిన్స్‌లో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.
ఏప్రిల్‌లో 21 మంది మృతి
గత ఏప్రిల్‌లో కాంగోలో కొండచరియలు విరిగిపడన ఘటనలో 21 మంది మరణించారు. అనేక మంది శిధిలాల కింద చిక్కుకుని అదృశ్యమయ్యారు. బోలోవా గ్రామంలోని నదికి సమీపంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మహిళలు, 13 మంది చిన్నారులు మృతి చెందారు. మీడియా నివేదికల ప్రకారం గత సంవత్సరం సెప్టెంబర్ 2022 లో, మసిసి ప్రాంతంలోని బిహాంబ్వే గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..