Idi Amin Dada: నరమాంస భక్షకుడు ఆ దేశాధ్యక్షుడట.. ఫ్రిజ్‌లో ఎప్పుడూ మానవ శరీరాలు..

అతను నరమాంస భక్షకుడనే వార్త బయటకు వచ్చినప్పుడు ప్రజలు అతన్ని దెయ్యం, మృగం, క్రూరుడు, ఆఫ్రికా హిట్లర్ అని కూడా పిలవడం ప్రారంభించారు. అయితే ప్రజలు అతనికి తమ బాధను తెలియజేసేందుకు కానీ.. తమ నిరసన వెల్లడించే దైర్యంగానీ చేయులేదు. అతను క్రూరుడు, దుర్మార్గుడనే విషయం ఉగాండా ప్రజలకు ఈ విషయం తెలుసు.. కానీ అతనిపై గొంతు ఎత్తే ధైర్యం ఎవరికీ లేదు.

Idi Amin Dada: నరమాంస భక్షకుడు ఆ దేశాధ్యక్షుడట.. ఫ్రిజ్‌లో ఎప్పుడూ మానవ శరీరాలు..
Idi AminImage Credit source: face2faceafrica
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2023 | 9:59 AM

మన పురాణాల్లో నరులను తినేవారిని నరమాసం భక్షకులని.. రాక్షసులని పేర్కొన్నారు. నిజ జీవితంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకూ అడవుల్లో నరభక్షకులు ఉండేవారని.. వారు మనిషి మాంసాన్ని తినే వారని అంటారు. అయితే మానవ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘటన ఒకటి ఉంది. ఆ దేశ అధ్యక్షుడు నరమాంస భక్షకుడిగా మారి.. మనుషుల మాంసాన్ని తిని.. అనంతరం వారి తలలను తన ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. అప్పట్లో ఓ సంచలనమే ఈ అధ్యక్షుడి కథ.. అతను ఆఫ్రికాలోని ఉగాండా అధ్యక్షుడు  ఈదీ అమీన్, ఈ రోజు అతని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

6 లక్షల మందిని చంపేశారని ఆరోపణలు

ఉంగాడా అధ్యక్షుడు అమీన్‌.. తన తిండి కోసం 6 లక్షల మందిని చంపేశారనే ఆరోపణలు వినిపించాయి. అంతేకాదు అతను నరమాంస భక్షకుడనే వార్త బయటకు వచ్చినప్పుడు ప్రజలు అతన్ని దెయ్యం, మృగం, క్రూరుడు, ఆఫ్రికా హిట్లర్ అని కూడా పిలవడం ప్రారంభించారు.  అయితే ప్రజలు అతనికి తమ బాధను తెలియజేసేందుకు కానీ.. తమ నిరసన వెల్లడించే దైర్యంగానీ చేయులేదు. అతను క్రూరుడు, దుర్మార్గుడనే విషయం ఉగాండా ప్రజలకు ఈ విషయం తెలుసు.. కానీ అతనిపై గొంతు ఎత్తే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే ఒక్కసారి ఈదీ అమీన్‌కు వ్యతిరేకంగా కొందరు గళం విప్పితే.. వారికి బహిరంగంగా శిక్ష విధించాడు. ఆ నిరసనకారులను చెక్క స్తంభాలకు కట్టి.. అనంతరం నోటికి, కళ్ళకు నల్ల గుడ్డ చుట్టి, ఆపై బుల్లెట్లతో కాల్చారు. అనంతరం ఈ వ్యక్తుల మృతదేహాలను ట్రక్కులో ఎక్కించి అమీన్‌కు వద్దకు తీసుకుని వెళ్లారు. అప్పుడు ఈ మృతదేహాలతో వివిద పదార్ధాలను చేసుకుని తిని తన ఆకలిని తీర్చుకున్నాడని  చెబుతున్నారు.

మనిషి తినేవాడు రాష్ట్రపతి ఎలా అయ్యాడు?

అయితే ఒక నరమాంస భక్షక మృగం దేశానికి రాష్ట్రపతి ఎలా అయ్యిందన్న ప్రశ్న అందరిలోనూ తెలెత్తుతుంది. కనుక ఈదీ అమీన్ ఆర్మీ బట్లర్ నుండి ఒక దేశానికి అధ్యక్షుడయ్యే వరకు జరిగిన కథ గురించి తెలుసుకుందాం..

ఉగాండా సైన్యంలో వంటమనిషిగా పనిచేసిన ఈద్ అమీన్ చాలా తెలివైనవాడు. అంతేకాదు చాలా  ప్రమాదకరమైనవాడు. అతను భారీ కాయుడు.. అతని శరీరతీరు అతని పురోగతికి మొదటి మెట్టు అయింది.  ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు. బరువు 160 కిలోలు. సైన్యంలో పనిచేస్తున్న సమయంలో బాక్సింగ్‌ క్రీడాకారుడిగా చేరాలని ప్రయత్నించాడు. సక్సెస్ గా రింగ్ లోకి అడుగు  పెట్టి… వరుసగా తొమ్మిది సంవత్సరాలు ఉగాండా నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇది అతనికి సైన్యంలో ప్రమోషన్ పొందడానికి సహాయపడింది. ఈ విధంగా 1965 నాటికి అమీన్ ఉగాండా సైన్యానికి జనరల్ అయ్యాడు.

తిరుగుబాటులో 3 గంటల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న అమీన్

ఆర్మీ జనరల్ అయిన తర్వాత, ఇదీ అమీన్ ఉగాండా అధికారంపై దృష్టి సారించాడు. ఇదీ అమీన్‌ను విశ్వసించిన ఉగాండా ప్రధానమంత్రి మిల్టన్ ఒబోటే 25 జనవరి 1971న సింగపూర్‌లో ఉన్నప్పుడు, అతను తన ప్రధానమంత్రి నమ్మకాన్ని ఛిన్నాభిన్నం చేసి రాజధాని కంపాలాలో రక్తపు తిరుగుబాటు చేశాడు. కేవలం మూడు గంటల సైనిక చర్యలో దేశం మొత్తం అధికార పగ్గాలు ఇదీ అమీన్ చేతుల్లోకి వచ్చాయి.

జనవరి 25, 1971 తేదీ ఉగాండాకు .. ఆఫ్రికాకు మాత్రమే కాదు, మొత్తం మానవాళికి కూడా బ్లాక్ డే గా నిలిచింది. ఎండుకంటే నరమాంస భక్షకుడు అమీన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన రక్తపు దాహాన్ని ప్రజలకు రుచి  చూపించడం ప్రారంభించాడు, అతనులోని వికృత రూపాయలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

అమీన్ తనను తాను దాదా గా అభివర్ణించుకునేవాడు. ఉగాండాలో తనని వ్యతిరేకించిన వారికి బహిరంగంగా మరణశిక్ష విధించేవాడు. అయితే  అమీన్ మ్యాన్ ఈటర్ అనే రహస్యాన్ని మొదట అతని వైద్యుడు కిబో రింగోటా బయటపెట్టాడు.. ఒకసారి డాక్టర్ కిబో రింగోటా ఫ్రిడ్జ్ నుండి ఐస్ తీసుకోవడానికి అమీన్ కిచెన్‌కి వెళ్లినప్పుడు..  ఫ్రిజ్ తెరవగానే డాక్టర్ షాక్ తిన్నాడు. రెండు మానవ శరీరాలను ఫ్రీజర్‌లో ఉంచారు.. డాక్టర్ కిబో అక్కడ ఉన్న మరికొందరు సిబ్బందితో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకున్నాడు. అమీన్ ఫ్రిడ్జ్ ఎల్లప్పుడూ మానవ అవయవాలతో నిండి ఉంటుందని తెలుసుకున్నాడు.

ప్రధాన న్యాయమూర్తిని హత్య చేసి..

1975లో ఈదీ అమీన్ తన మాట వినని దేశ ప్రధాన న్యాయమూర్తిని హత్య చేశాడని.. ఈదీ అమీన్ స్వయంగా అతడికి చేరుకుని పోస్ట్‌మార్టం పూర్తి కాగానే తనను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాడని, ఆపై ప్రధాన న్యాయమూర్తి మాంసాన్ని తిన్నాడని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు పేర్కొన్నట్లు సమాచారం. అమీన్ ఉగాండాను 8 సంవత్సరాలు పాలించారు, ఈ సమయంలో ప్రతి ఉదయం ఉగాండా వీధుల్లో అనేక మృతదేహాలు కనిపిస్తూనే ఉండేవి. అమీన్ పాలన సమయంలో  ఉగాండాలో 6 లక్షల మందిని చంపాడని చెబుతారు.

6 మంది భార్యలు 45 మంది పిల్లలు

అతను క్రూరమైనవాడు మాత్రమే కాదు.. దుర్మార్గుడు కూడా.. ప్రభుత్వ డబ్బులతో తరచూ పార్టీలు ఇచ్చేవాడు. ఆరుసార్లు వివాహం చేసుకున్నాడు. వీటిల్లో ఐదు రాష్ట్రపతి అయిన తర్వాత జరిగాయి. అమీన్‌ తన ఆరుగురు భార్యల ద్వారా 45 మంది సంతానాన్ని కన్నాడు. అంతేకాదు అతని అంతఃపురంలో 35 మందికి పైగా మహిళలు ఉన్నారు. వారు 100 మందికి పైగా పిల్లలకు జన్మనిచ్చారు. అయితే అమీన్ రెండవ భార్య ‘కె అడోరా’ తన భర్త నరమాంస భక్షకుడని తెలుసుకున్నప్పుడు.. అతడిని ద్వేషించడం ప్రారంభించింది, ఆపై ఆమె తన వైద్యునితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న ఇదీ అమీన్ ‘కె అడోరా’ను దారుణంగా హతమార్చాడు.

భారతీయులను ద్వేషించిన అమీన్‌

ప్రపంచం మొత్తం ఈదీ అమీన్‌ను అసహ్యించుకుంది. అయితే ఈదీ అమీన్ మాత్రం భారతదేశ ప్రజలను ఎక్కువగా ద్వేషించాడు. అతను ఉగాండా నుండి లక్ష మంది భారతీయులను తరిమివేసాడు. వాస్తవానికి, ఉగాండా..  బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో వేలాది మంది భారతీయులను ఉగాండాకు తరలించారు. వారు అక్కడే స్థిరపడ్డారు. తమ సామర్థ్యం ఆధారంగా వారు ఉగాండా ఆర్థిక వ్యవస్థలో తమ ఆధిపత్యాన్ని స్థాపించారు.

అమీన్ అధికారంలోకి రాగానే మొదట అక్కడ నివసిస్తున్న భారతీయులనే టార్గెట్ చేశాడు.. 1972 ఆగస్టు 4న భారతీయులందరూ రెండు సూట్‌కేసులతో 90 రోజుల్లో ఉగాండా విడిచి వెళ్లాలని ఈదీ అమీన్ ఉత్తర్వు జారీ చేశాడు.. ఉగాండా భారతీయుల ఆస్తులు లాక్కుంటానని .. ఉగాండా ప్రజలకు మాత్రమే తమ దేశంలో ఆస్థి హక్కు ఉందని వెల్లడించాడు.

అమీన్ ఉత్తర్వు ఉగాండాలో నివసిస్తున్న భారతీయులలో ప్రకంపనలు సృష్టించింది.. తమ వ్యాపారాలను వదిలి బ్రిటన్‌కు పారిపోవటం ప్రారంభించారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ భారత ప్రధానిఈదీ అమీన్‌ను హెచ్చరించింది. ఈ నియంతపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అమీన్ నిరంకుశంగా మారాడు.. కొన్నిసార్లు ఇజ్రాయెల్ విమానాలను హైజాక్ చేశాడు. కొన్నిసార్లు అమెరికాను బెదిరించాడు. ఇతనికి లిబియా నియంత కల్నల్ గడ్డాఫీ మద్దతు ఉంది.

ఉగాండా నుండి పారిపోవాల్సి వచ్చినప్పుడు

అక్టోబరు 30, 1978న అమీన్ సైన్యం .. ఉగాండ పొరుగు దేశం టాంజానియాపై దాడి చేసింది. గడాఫీ అమీన్ సైన్యానికి సహాయం చేయడానికి లిబియా సైన్యాన్ని పంపాడు. టాంజానియాతో 6 నెలల పాటు యుద్ధం కొనసాగింది. అప్పుడు టాంజానియా సైన్యం ఉగాండా సైన్యాన్ని తిప్పికొట్టి 10 ఏప్రిల్ 1979న ఉగాండా రాజధాని కంపాలాలోకి ప్రవేశించింది. అమీన్ నిరుత్సాహానికి గురై తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. ఉగాండాను శాశ్వతంగా విడిచిపెట్టాడు.

తన స్నేహితుడు కల్నల్ గడాఫీ నుండి ఆశ్రయం పొందేందుకు మొదట లిబియా చేరుకున్నాడు. ఆపై సౌదీ అరేబియా చేరుకున్నాడు. అమీన్ సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో 24 సంవత్సరాలు నివసించాడు. ఈ నియంత 20 జూలై 2003న మరణించాడు. ఉగాండా ప్రజలు అమీన్‌ను ఎంతగా ద్వేషించారంటే అతని మృతదేహాన్ని తమ దేశంలో ఖననం చేయడానికి కూడా అనుమతించలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..