Amazon Forest: వీళ్ల తెలివితేటలకు హాట్సాఫ్‌.. కొన్ని వేల ఏళ్ల క్రితమే అమెజాన్‌లో..? శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు?

Amazon Forest: వీళ్ల తెలివితేటలకు హాట్సాఫ్‌.. కొన్ని వేల ఏళ్ల క్రితమే అమెజాన్‌లో..? శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు?

Anil kumar poka

|

Updated on: Oct 01, 2023 | 8:31 AM

అధిక వర్షపాతానికి వృక్షసంపదకు నిలయం అమెజాన్ అడవులు. దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఓ ప్రాంతం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నివసించిన పురాతన మానవ స్థావరాల చుట్టూ నల్లని, సారవంతమైన మట్టిని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. డార్క్‌ ఎర్త్‌గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు ఈ మట్టిని అప్పట్లో ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనే దానిపై కొంత కాలం క్రితం పరిశోధనలు

అధిక వర్షపాతానికి వృక్షసంపదకు నిలయం అమెజాన్ అడవులు. దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఓ ప్రాంతం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నివసించిన పురాతన మానవ స్థావరాల చుట్టూ నల్లని, సారవంతమైన మట్టిని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. డార్క్‌ ఎర్త్‌గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు ఈ మట్టిని అప్పట్లో ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనే దానిపై కొంత కాలం క్రితం పరిశోధనలు మొదలుపెట్టారు. మట్టి విశ్లేషణతో పలు వివరాలు సేకరించి, డార్క్ ఎర్త్‌ను పురాతన అమెజోనియన్లు ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారని తాజాగా నిరూపించారు. ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు అమెజాన్‌లో డార్క్‌ ఎర్త్‌ పేరుతో సారవంతమైన భూమిని రూపొందించేందుకు పురాతన అమెజోనియన్లు ప్రయత్నించారని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇటీవలి కాలంలో చేపడుతున్న వాతావరణ మార్పు ఉపశమన ప్రయత్నాలపై ఎంతో ప్రభావం చూపనుంది. డార్క్‌ ఎర్త్‌ను తయారు చేయడంలో నాటి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారని, దానిని మానవ నివాసానికి, పంటలు పండించడానికి అనువైన ప్రదేశంగా మార్చారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఐటీకి చెందిన ఎర్త్, అట్మాస్ఫియరిక్ ప్రొఫెసర్ టేలర్ పెర్రోన్ మాట్లాడుతూ డార్క్‌ ఎర్త్‌లో భారీ మొత్తంలో కార్బన్ నిల్వలు వేల సంవత్సరాలుగా భూమిలో పేరుకుపోయాయని, తరతరాల ప్రజలు తమ ఆహార వ్యర్థాలు, బొగ్గు, చెత్తతో ఈ మట్టిని సారవంతం చేశారన్నారు. ఆగ్నేయ అమెజాన్‌లోని జింగు నది పరీవాహక ప్రాంతంలోని క్యూకురో ప్రాంతం నుంచి సేకరించిన డేటా ఆధారంగా నివేదికను రూపొందించారు. మట్టి నిర్వహణలో క్యూకురో పద్ధతులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారు. చెత్త, ఆహార స్క్రాప్‌లను కుప్పలుగా పోయడంతో అవి కుళ్ళిపోయి మట్టిలో కలిసి, సారవంతమైన నేలను తయారుచేసాయి. డార్క్‌ఎర్త్‌ను డాక్యుమెంట్ చేయడానికి పరిశోధకులు గ్రామస్తులతో ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. గ్రామస్తులు ఈడార్క్ ఎర్త్‌ను ఇగెపె అని పిలుస్తారు. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సారవంతమైన మట్టి రూపకల్పనకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..