Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Warming: మండిపోతున్న భారత్, పాక్ .. ప్రమాదంలో ఉన్న 220 కోట్ల మంది ప్రజలు. గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశం..

వాతావరణ మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత పెరుగుతోందని పరిశోధనల్లో తేలింది. ఆందోళన కరమైన విషయం ఏమిటంటే భూ ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే దాదాపు 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుండి ఈ పెరుగుదల ఉందని.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలో వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలతో అధికంగా ఉంది.

Global Warming: మండిపోతున్న భారత్, పాక్ .. ప్రమాదంలో ఉన్న 220 కోట్ల మంది ప్రజలు. గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశం..
Sun Stroke
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2023 | 11:12 AM

మారిన కాలంతో పాటు మానవ జీవన విధానంతో పాటు.. వాతావరణంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తాజాగా గ్లోబల్‌ టెంపరేచర్‌కు సంబంధించిన తాజా పరిశోధన ఓ భయంకరమైన విషయాన్ని వెల్లడించింది. గ్లోబల్‌ టెంపరేచర్‌ 2 డిగ్రీల సెల్సియస్‌ పెరగనున్నదని.. దీని ప్రభావం భారత్‌, పాకిస్థాన్‌తో సహా పలు దేశాలపై పడనున్నదని.. కు చెందిన 220 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర వేడిని ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత ప్రజల్లో హీట్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, తూర్పు చైనా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక తేమతో కూడిన వేడిని ఎదుర్కోవలసి ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అధిక తేమతో హీట్ వేవ్ ప్రమాదం

పీర్-రివ్యూడ్ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. ఉష్ణోగ్రత పెరిగితే ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, తూర్పు చైనా, సబ్-సహారా ఆఫ్రికా దేశాల ప్రజలు అధిక తేమతో కూడిన హీట్‌వేవ్‌లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమని  వెల్లడించారు. వాతావరణ మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత పెరుగుతోందని పరిశోధనల్లో తేలింది. ఆందోళన కరమైన విషయం ఏమిటంటే భూ ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే దాదాపు 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుండి ఈ పెరుగుదల ఉందని.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలో వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలతో అధికంగా ఉందని.. దీని ప్రభావంతో ఉష్ణోగ్రత పెరగడం ముడిపడి ఉంది.

ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు – IPCC

2015లో 196 దేశాలు వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ దేశాల లక్ష్యం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను నివారించడం.. పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం. అయితే ఉష్ణోగ్రత పెరుగుదలలో అదుపు లేదని ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) ఈ విషయాన్ని హెచ్చరించింది. ఈ శతాబ్ది చివరి నాటికి ప్రపంచంలో దాదాపు 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఈ సంస్థ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

వాతావరణ మార్పు.. వినాశకర ప్రభావం

వాతావరణ మార్పుతో తలెత్తే పరిస్థితులను తగ్గించాలననా వినాశకరమైన ప్రభావాన్నీ నివారించడానికి..  2019తో పోలిస్తే 2030 నాటికి ప్రపంచం ఉద్గారాలను సగానికి తగ్గించాలని IPCC సూచించింది. ఇలా చేస్తే  ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం కావచ్చనని వెల్లడించింది. గత నాలుగు నెలలు అంటే జూన్, జూలై, ఆగస్టు , సెప్టెంబర్‌లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని గ్లోబల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, 2023 ఎన్నడూ లేని విధంగా అత్యంత వేడిగా భూమి మారుతుందని వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..