సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్ ఇతడు.. మంటల్లో 80శాతం కాలిన వ్యక్తి.. కంటి చూపులేకున్నా కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు..!
జైద్‌కి ప్రమాదం జరిగినప్పుడు, భవిష్యత్తులో అతడు మాట్లాడటం, నడవడం సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. కానీ, నేడు అతను మాట్లాడగలడు. నడవగలడు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెబుతున్నాడు. జైద్ మాట్లాడుతూ..తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు. అతనికి చెప్పడానికి మాటలు లేవని అన్నాడు. పోలీసు అధికారిగా మారిన రోజు అతని జీవితంలో అత్యంత గొప్ప రోజుగా చెప్పాడు. నిజం చెప్పాలంటే..
ఈ ప్రమాదంలో జైద్ శరీరం 80 శాతం కాలిపోయింది. తన కంటి చూపు కూడా పోయింది. అతడి చెవులు, ముక్కు, ముఖం మొత్తం కాలిపోయాయి. అయినప్పటికీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కష్టపడి పని చేస్తూ… ఆ వ్యక్తి పోలీసు అధికారి అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అతని పేరు జైద్ గార్సియా. జైద్ శరీరం 80 శాతం వరకు కాలిపోయింది. అతని ముఖమంతా వికృతంగా మారిపోయింది. అయితే, ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూనే.. అతడు.. తన జీవితాన్ని ధైర్యంగా ముందుకు కొనసాగించాడు. తనకు చిన్నతనంలో పోలీస్ ఆఫీసర్ కావాలని కల ఉండేది. కానీ అతను ఈ కలను నెరవేర్చుకోకముందే, అతనికి జరిగిన ప్రమాదంలో అతడు పూర్తిగా మంటల్లో పడి కాలిపోయాడు. ఈ ప్రమాదంలో అతని శరీరం 80 శాతం కాలిపోయింది. అతను కంటి చూపును కూడా కోల్పోయాడు. అంతేకాదు అతని చెవులు, ముక్కు, ముఖం మొత్తం కాలిపోయింది.
ఈ ప్రమాదం తర్వాత జైద్ కుప్పకూలిపోయాడు. అయినప్పటికీ, అతను తనను తాను కంట్రోల్ చేసుకోగలిగాడు.. ఈ సవాలు పరిస్థితిని అతడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 10 ఏళ్ల వయసులో కలలుగన్న పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. వాస్తవానికి 2015 సంవత్సరంలో జైద్‌కు ప్రమాదం జరిగింది. అతను తన ఇంట్లో కొవ్వొత్తి వెలిగించాడు. దాని కారణంగా ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు జైద్ దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నాడు. మండుతున్న మంటలు అతని దుప్పటికి కూడా అంటుకున్నాయి. అతను మంటల్లో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో జైద్ శరీరం 80 శాతం కాలిపోయింది. ఈ ప్రమాదం తరువాత, జైద్ టెక్సాస్‌లోని ఒక ఆసుపత్రిలో చేరాడు. అక్కడ తను కాలిన గాయాలకు చికిత్స పొందాడు. చికిత్స అనంతరం అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతను శాశ్వతంగా కంటిచూపు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత, జైద్ బ్లైండ్ స్కూల్ నుండి తన చదువును పూర్తి చేసి, తను అనుకున్న విధంగానే.. ఈ రోజు అతను పోలీసు అధికారి అయ్యాడు.
View this post on Instagram
జైద్‌కి ప్రమాదం జరిగినప్పుడు, భవిష్యత్తులో అతడు మాట్లాడటం, నడవడం సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. కానీ, నేడు అతను మాట్లాడగలడు. నడవగలడు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెబుతున్నాడు. ఒక వార్తా సంస్థతో మాట్లాడిన జైద్, తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు. అతనికి చెప్పడానికి మాటలు లేవని అన్నాడు. పోలీసు అధికారిగా మారిన రోజు అతని జీవితంలో అత్యంత గొప్ప రోజుగా చెప్పాడు. నిజం చెప్పాలంటే..ఇదంతా జరుగుతుందని..తనపై తనకే నమ్మకం లేదన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..