Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లోకల్‌ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయాణికుల స్టంట్స్‌.. ఆటోమేటిక్ డోర్ తెరుచుకోకముందే లోపలికి వెళ్లేందుకు..

ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో, ముంబయి లోకల్‌ ట్రైన్‌లో పలువురు యువతీ యువకులు చేసిన విన్యాసాలు నెటిజ్లను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ముంబై లోకల్ ట్రైన్‌లో సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సీట్ల కోసం కొట్లాటలు, మహిళల సిగపట్లు కూడా సర్వసాధారణంగా మారిపోయాయి.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వటం గ్యారెంటీ.

Viral Video: లోకల్‌ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయాణికుల స్టంట్స్‌.. ఆటోమేటిక్ డోర్ తెరుచుకోకముందే లోపలికి వెళ్లేందుకు..
Local Train
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 10, 2023 | 10:56 AM

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం చాలా మంది ఫేమస్‌ అవుతున్నారు. కొందరు రాత్రికి రాత్రే పపులర్‌గా మారిపోతున్నారు. చాలా మంది సోషల్ మీడియాను తమ ఉపాధి అస్త్రంగా కూడా మలుచుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో, ముంబయి లోకల్‌ ట్రైన్‌లో పలువురు యువతీ యువకులు చేసిన విన్యాసాలు నెటిజ్లను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ముంబై లోకల్ ట్రైన్‌లో సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సీట్ల కోసం కొట్లాటలు, మహిళల సిగపట్లు కూడా సర్వసాధారణంగా మారిపోయాయి.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వటం గ్యారెంటీ. ఎందుకంటే ముంబై లోకల్ ట్రైన్ ఆటోమేటిక్ డోర్లు తెరుచుకోకముందే, ప్రయాణికులు లోపలికి ప్రవేశించడానికి పెద్ద రిస్కె తీసుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు దీనిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నారు.

స్టేషన్‌లో రైలు ఆగగానే జనం రైలు తలుపులు తట్టడం మొదలుపెట్టారు. కాస్త మాత్రమే ఓపెన్ చేసిన డోర్ లోపల చేయి పెట్టి బలవంతంగా పూర్తిగా డొర్‌ తెరుచుకునేలా చేశారు.. ఆ తర్వాత ప్రయాణికులు ఎగబడి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ముంబైవాసులు ఎప్పుడూ ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది ఈ వీడియోను లైక్ చేశారు.

Automatic door in Mumbai trains byu/Novel_Swimmer_8284 inDamnthatsinteresting

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైల్లోకి దూసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని కొందరు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించాలని మరికొందరు అంటున్నారు. పనికి వెళ్లాలన్నా, స్కూల్, కాలేజీకి వెళ్లాలన్నా ఇదే రైలు వల్ల ఉపయోగం ఏంటని ఎక్కువ మంది అంటున్నారు.

రోజూ ఇలాగే ప్రయాణం చేస్తుంటాను. ట్రైన్‌ ఎక్కే క్రమంలోనే పడి లేస్తూ,.. మనుషుల మధ్య ఒత్తిడి కారణంగా శరీరంలో అవయవాలు కూడా నలిగిపోతున్నాయని పలువురు బాధితులు కూడా స్పందించారు. చాలా మందికి వెన్ను, కడుపు నొప్పి వస్తుందని ఒకరు అన్నారు. ముంబయిలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్య ఇది అంటున్నారు మరికొందరు.. దీనికి అక్కడి ప్రభుత్వం సరైన మార్గం ఎందుకు చూపడం లేదని పలువురు వాపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..