Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Save Cooking Gas: ఒక నెలలో వచ్చే గ్యాస్ రెండు నెలలు వాడాలా.. చిన్న చిన్న చిట్కాలతో గ్యాస్‌ ఆదా చేయండిలా..

కుక్కర్, పాత్రలు మొదలైనవాటిని కడిగిన తర్వాత వెంటనే...నేరుగా వంట చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుందని మీకు తెలుసా? అవును... వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్‌పై ఉంచినట్లయితే, డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీని వలన గ్యాస్ ఖర్చవుతుంది. చాలా మంది కుక్కర్‌కు బదులుగా ఇతర పాత్రలను ఉపయోగిస్తారు. కానీ గ్యాస్ ఉపయోగించి వంట చేసే వారు ప్రెషర్ కుక్కర్ వాడటం మంచిది. దీనివల్ల గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

Save Cooking Gas: ఒక నెలలో వచ్చే గ్యాస్ రెండు నెలలు వాడాలా.. చిన్న చిన్న చిట్కాలతో గ్యాస్‌ ఆదా చేయండిలా..
Save Cooking Gas
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 10, 2023 | 8:16 AM

గ్యాస్‌ స్టౌవ్‌ వాడే ముందు.. గ్యాస్ బర్నర్‌ని శుభ్రంగా ఉంచండి. శుభ్రం చేయకపోతే, పైపు ద్వారా గ్యాస్ సరిగ్గా సప్లై కాదు. పైప్‌లో గ్యాస్‌ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం రెండు వారాలకు ఒకసారి గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడం మంచిది. బియ్యం, పప్పు వంటి కొన్ని ధాన్యాలతో వండేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. బియ్యం, పప్పులు వంటి ధాన్యాలు వంటకు ముందు కడిగి నీటిలో నానబెట్టుకోవటం ఉత్తమం. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది. వంట కూడా త్వరగా పూర్తవుతుంది.

కుక్కర్, పాత్రలు మొదలైనవాటిని కడిగిన తర్వాత వెంటనే…నేరుగా వంట చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుందని మీకు తెలుసా? అవును… వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్‌పై ఉంచినట్లయితే, డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీని వలన గ్యాస్ ఖర్చవుతుంది.

చాలా మంది కుక్కర్‌కు బదులుగా ఇతర పాత్రలను ఉపయోగిస్తారు. కానీ గ్యాస్ ఉపయోగించి వంట చేసే వారు ప్రెషర్ కుక్కర్ వాడటం మంచిది. దీనివల్ల గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రెషర్ కుక్కర్‎లో వంట చేయడం వల్ల గ్యాస్‎ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ప్రెషర్‌ కుకర్‌ ఎక్కువ పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది. పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుక్కర్‌లో పెట్టుకునే వీలు ఉంటుంది. కాబట్టి త్వరగా వంట పూర్తి అవుతుంది. గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది.

ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌ నుంచి తీసిన వెంటనే నేరుగా గ్యాస్‎పై పెట్టి వేడి చేసే అలవాటు కూడా గ్యాస్‌ను వృధా చేస్తుంది. అలా చేయడం వల్ల ఆహారం వేడి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. ఫ్రిజ్ నుంచి ఆహారం బయటకు తీసిన తర్వాత ముందు సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాతే దాన్ని వేడి చేయండి. ఇలా చేస్తే మీ గ్యాస్‌ ఆదా అవుతుంది.

చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్‌ ను వాడకపోవడమే మంచిది. అలా వాడటం వల్ల మంట చాలా వరకు బయటికి పోతుంది. అలా కూడా గ్యాస్‌ వృథా అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..