Telangana: కారును ఢీ కొట్టేందుకు బస్సు ను సిద్దం చేస్తున్న హస్తం పార్టీ.. ఎన్నికల బరిలో కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

Hyderabad: ఎన్నికల పై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచిందా....? cwc సమావేశాలు , తుక్కుగూడ విజయభేరి విజయంతో కదనరంగంలొకి దూకుతున్నారా...? ఆరు గ్యారంటీ స్కీమ్స్ అస్త్రంగా ప్రజల్లోకి వెళ్ళనున్నారా...? రాష్ట్రం మొత్తం చుట్టేయడానికి నేతలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టేనా..? ఉమ్మడిగా వెళ్తారా ...ఒక్కో నేత ఒక్కో వైపు నుండి యాత్ర చేస్తారా...? ఇంతకీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వేల తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి..

Telangana:  కారును ఢీ కొట్టేందుకు బస్సు ను సిద్దం చేస్తున్న హస్తం పార్టీ.. ఎన్నికల బరిలో కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!
Ts Congress
Follow us
TV9 Telugu

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 09, 2023 | 2:11 PM

హైదరాబాద్, అక్టోబర్09; cwc సమావేశాలు , తుక్కుగూడ విజయభేరి భారీ బహిరంగ సభ సక్సెస్ తో తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీదుంది… అగ్రనేతలు సోనియా , రాహుల్ గాంధీ ,ఖర్గే ,ప్రియాంక గాంధీ తదితరులు ఇచ్చిన జోష్ ని ఎన్నికల వరకు కంటిన్యూ గా కొనసాగంచాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తుంది… ఇందులో భాగంగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది…రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నేతలంతా కలిసి బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు.. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సిఎల్పి నేత బట్టి విక్రమార్క , స్టార్ కంపెయినర్ కోమటిరెడ్డి ,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,మధుయాష్కి ,విహెచ్ తో పాటు ఇతర ముఖ్య నేతలుండనున్నారు.. యాత్ర కి సంబంధించిన పూర్తి స్థాయి రూట్ మ్యాప్ ని వ్యూహకర్త సునీల్ కనుగోలు పర్యవేక్షణలో జరుగుతుంది.. అక్టోబర్ 16 వ తేదీ లేదా 19 నుండి యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు…. యాత్రలో ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభ జరగనుంది దానికి ఏఐసీసీ పెద్దలతో పాటు , ఏఐసీసీ నేతల ను ఆహ్వానించాలని చూస్తున్నారు..

అయితే ఈ 10 రోజుల్లోపు అభ్యర్థుల ఎంపిక పై ఫైనల్ చేసి మొదటి దశ ప్రకటించి.. మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థులను అధిష్టానం చూసుకోవడం తో పాటు అసంతృప్త నేతలను బుజ్జగించి పార్టీ అధికారంలోకి రావాలంటే అందరు కలిసి పని చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.. దీని వల్ల యాత్రకి కూడా ఇబ్బంది లేకుండా కేవలం ఎన్నికలపైనే ఫోకస్ చేయచ్చని నేతల భావన ..దీంతో పాటు ఎన్నికలకు సంబధించి ఏర్పాటు చేసిన 8 కమిటీ ల నివేదిక కూడా త్వరగా ఇచ్చేలా చూడాలని పీసీసీ ఆదేశాలు జారి చేసారని సమాచారం.. మేనిఫెస్టో కమిటీ ,స్ట్రాటజి కమిటీ , ట్రైనింగ్ కమిటీ ,తదితర కమిటి లు తమ పనిని వేగవంతం చేయాల్సి ఉంది.. బస్సు యాత్ర లోపు ఎన్నికలకు సంబంధించిన ప్రతిదీ కంప్లీట్ చేసుకొని ఏ ఒక్క నేత కూడా గాంధీ భవన్ లో కాకుండా నియోజకవర్గాల్లోనే ఉండాలని హుకుం జారీ చేయనున్నారు..

ఉత్తర తెలంగాణ లో పార్టీ బలహీనంగా ఉండడం వల్ల… సునీల్ కనుగోలు సూచనలతో అక్కడి నుండే బస్సు యాత్ర చెపట్టెందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు.. అక్టోబర్ 16 న బాసర సరస్వతి ఆలయం వద్ద బస్సు యాత్ర ప్రారంభించి నిజామాబాద్ ,ఆదిలాబాద్ , మంచిర్యాల ,కరీంనగర్ ,వరంగల్ ,మెదక్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ , నల్గొండ ,ఖమ్మం మీదుగా ఈ బస్సు యాత్ర ఉండబోతుంది..ప్రధానంగా ఆరు గ్యారంటీ స్కీమ్స్ ని ప్రజల్లో వివరించనున్నారు.. తాము వస్తే మహిళలకు ప్రతినెలా 2500 పంపిణి, 500 కే వంట గ్యాస్ సిలిండర్. అర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మహిళలకు అవగాహన కల్పించాలని .. ప్రతిఏటా రైతులు,కౌలు రైతులకు 15,000 బ్యాంక్ అకౌంట్ లోకి .. వ్యవసాయ కూలీలకు 12,000 పంపీణి. వరిపంటకు 500 బోనస్.. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ .. ఇల్లులేని వారికి ఇంటి స్థలం తో కలిపి 5 లక్షల తో ఇంటి నిర్మాణం… తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం యువ వికాసం స్కీమ్ ద్వార విద్యార్ధులకు 5 లక్షల విద్యా,భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు, చేయూత స్కీమ్ పథం ద్వార వృద్దులకు, వికాలంగులకు, ఒంటరి మహిళలకు 4,000 నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యభీమా వీటిని గ్రామ గ్రామనా డోర్ టూ డోర్ వివరించనున్నారు.. అదే సమయంలో బీఆరెస్ వైపల్యాలపై ఛార్జిషీట్ తో పాటు, స్థానిక సమస్యలపై ప్రధానంగా బస్సు యాత్రలో ఫోకస్ చేయాలని భావిస్తున్నారు..

ఇవి కూడా చదవండి

ఇప్పటికే బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించి వేగంగా ప్రచారం చేస్తుండగా .. కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.. cwc, తుక్కుగూడ జాతీయ నేతలు ఇచ్చిన బూస్టింగ్ తో రెట్టింపు ఉత్సాహంతో కదులుతుండడంతొ కాంగ్రెస్ వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ