బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు బయల్దేరిన దంపతులు.. తుని నుండి చెన్నై వరకూ.. యాక్సిడెంట్‌తో కథ అడ్డం తిరిగింది..!

ఏపిలోని తుని నుండి.... తమిళనాడులోని చెన్నై వరకూ బైక్ పై ప్రయాణం... ఆ దంపతులిద్దరికీ అలవాటే...గతంలోనూ ఇలాంటి లాంగ్ డ్రైవ్ లకు వెలుతుండేవారు. అయితే ఇందులో వింతేముంది అంటారా..? లాంగ్ డ్రైవ్ పూర్తి కాకుండానే పోలీసులకు చిక్కారు. ఎందుకంటారా..? వారి లాంగ్‌ డ్రైవ్‌ అసలు సంగతి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..అదేంటో తెలియాలంటే.. కంప్లీట్‌ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు బయల్దేరిన దంపతులు.. తుని నుండి చెన్నై వరకూ.. యాక్సిడెంట్‌తో కథ అడ్డం తిరిగింది..!
Road Accident
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 09, 2023 | 1:32 PM

చెన్నైలోని పెరంబదూర్ కు చెందిన కిషోర్, మీరా జాస్మిన్ దంపతులు, అక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే వీరికి కాకినాడ జిల్లా తునిలో బంధువులున్నారు. వీరిలో కేశవ్ అనే వ్యక్తితో ఎక్కువుగా వీరిద్దరికి పరిచయం ఉంది. ఈ నెల ఆరో తేదిన వీరిద్దరూ తుని చేరుకున్నారు. కేశవ్ ను కలిశారు. ఆ తర్వాత రోజు సాయంత్రం తుని నుండి బైక్ పై బయలు దేరారు. ఎప్పటి లాంటి ప్రయాణమే కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. గతంలోనూ వీళ్లిద్దరూ ఇదే విధంగా ప్రయాణించినట్లు తెలుస్తుంది.

అయితే ఆదివారం తెల్లవారు జామున మూడు గంటల సమయలో మంగళగిరి వై జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న కిషోర్, మీరా జాస్మిన్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు పోలీసుల సాయంతో వీరిని మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ స్పృహలో లేరు. దీంతో వీరి వివరాలు పోలీసులకు తెలియకుండా పోయాయి.

ఆదివారం మద్యాహ్నం వరకూ ఎవరూ వీరి కోసం రాలేదు. దీంతో పోలీసులు బాధితులు వివరాలు తెలుసుకునేందుకు వీరి బైక్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. వీరితో పాటు బైక్ పై ఉన్న బ్యాగ్ ను ఓపెన్ చేసి చూసి ఆశ్చర్య పోయారు. ఏదైనా ఆదారాలు దొరుకుతాయనుకుంటే ఏకంగా 8 కేజీల గంజాయి దొరికింది. దీంతో అవాక్కవ్వడం పోలీసులు వంతైంది. వెంటనే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

దంపతులిద్దరూ స్పృహలోకి వచ్చిన తర్వాత వివరాలు సేకరించారు. తునిలో కేశవ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి చెన్నై పెరంబదూర్ లో విక్రయిస్తున్నట్లుగా దంపతులు ఒప్పుకున్నారు. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి రవాణాకు స్మగ్లర్లు వివిధ మార్గాలను వెతుక్కుంటున్నట్లే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు కూడా విభిన్న పద్దతుల్లో గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రోడ్డు ప్రమాదం జరగటంతోనే దంపతుల గుట్టు రట్టైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఇదే ఫస్ట్ మదర్స్ డే..
ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఇదే ఫస్ట్ మదర్స్ డే..
నిలవాలంటే గెలవాల్సిందే.. రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై
నిలవాలంటే గెలవాల్సిందే.. రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై
హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..
హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..
ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.!
ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.!
యువ ఓటర్లు ఎవరి వైపు..? పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
యువ ఓటర్లు ఎవరి వైపు..? పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
డెత్ ఓవర్లలో డేంజరస్ బౌలర్లు వీరే.. టాప్ 5 లిస్ట్ ఇదే..
డెత్ ఓవర్లలో డేంజరస్ బౌలర్లు వీరే.. టాప్ 5 లిస్ట్ ఇదే..
పవన్ కళ్యాణ్ వద్దనుకున్న సినిమాతో హిట్టు కొట్టిన మాస్ మహారాజా..
పవన్ కళ్యాణ్ వద్దనుకున్న సినిమాతో హిట్టు కొట్టిన మాస్ మహారాజా..
ఓటర్స్ బీ అలర్ట్.. పోలింగ్‎కు ముందు ఈ ఎలక్షన్ రూల్స్‌ పాటించాలి..
ఓటర్స్ బీ అలర్ట్.. పోలింగ్‎కు ముందు ఈ ఎలక్షన్ రూల్స్‌ పాటించాలి..
విజయవాడలో పటిష్టమైన బందోబస్తు.. పెద్ద ఎత్తున పట్టుబడిన మద్యం, నగద
విజయవాడలో పటిష్టమైన బందోబస్తు.. పెద్ద ఎత్తున పట్టుబడిన మద్యం, నగద
3 రోజుల నైట్ షిఫ్ట్ మిమ్మల్నీ డయాబెటిక్ రోగిని చేయగలదు.!-అధ్యయనం
3 రోజుల నైట్ షిఫ్ట్ మిమ్మల్నీ డయాబెటిక్ రోగిని చేయగలదు.!-అధ్యయనం