చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

విచారణ చేపట్టి ఈ క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు అక్టోబర్‌ 10వ తేదీకి వాయిదా వేసింది. అయితే మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. 17ఏపైనే వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. 17ఏ ప్రకారం అరెస్టుకు అనుమతి లేదని చంద్రబాబు తరపున సాల్వే అన్నారు. కేసును క్వాష్‌ చేయాలని బాబు తరపున లాయర్‌ హరీస్‌సాల్వే కోర్టుకు విన్నవించారు. అయితే 17ఏ చంద్రబాబుకు అమలు కాదని..

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Chandrababu
Follow us
Ravi Kiran

| Edited By: Subhash Goud

Updated on: Oct 09, 2023 | 4:39 PM

చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించగా, వాదనలు అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం వెల్లడించింది. అయితే ముందుగా ఉదయం నుంచి వాదనలు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది కోర్టు. తర్వాత విచారణ చేపట్టి ఈ క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు అక్టోబర్‌ 10వ తేదీకి వాయిదా వేసింది. అయితే మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. 17ఏపైనే వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. 17ఏ ప్రకారం అరెస్టుకు అనుమతి లేదని చంద్రబాబు తరపున సాల్వే అన్నారు. కేసును క్వాష్‌ చేయాలని బాబు తరపున లాయర్‌ హరీస్‌సాల్వే కోర్టుకు విన్నవించారు. అయితే 17ఏ చంద్రబాబుకు అమలు కాదని సీబీఐ తరపున లాయర్‌ రోహిత్గీ అన్నారు.

అటు సీఐడీ, ఇటు చంద్రబాబు తరపున వాదనలు వింటూనే జస్టిస్‌ త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. 17ఏ ప్రస్తావన సరే, ప్రధాన ఆరోపణ ఉన్న అవినీతిని మర్చిపోతే ఎలా..? అవినీతి జరగకూడదన్న మౌలిక ఉద్దేశాన్ని పట్టించుకోవాలి కదా అని అన్నారు. అనుమతి తీసుకోనంత మాత్రన అవినీతిపై చర్యలు తీసుకోకూడదా..? చట్టం ఉద్దేశమే అవినీతి అడ్డుకోవడం కదా అని జస్టిస్‌ త్రివేది వ్యాఖ్యానించారు.