AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress-CPI-CPM: పొత్తు పొడిచింది.. కాంగ్రెస్ వైపే కామ్రేడ్లు.. సీపీఐ, సీపీఎం ఎన్ని స్థానాలు కేటాయించారంటే..?

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ సోమవారం ప్రకటించింది. దీంతో పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి.

Congress-CPI-CPM: పొత్తు పొడిచింది.. కాంగ్రెస్ వైపే కామ్రేడ్లు.. సీపీఐ, సీపీఎం ఎన్ని స్థానాలు కేటాయించారంటే..?
CPI Congress CPM
Shaik Madar Saheb
|

Updated on: Oct 09, 2023 | 5:15 PM

Share

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ సోమవారం ప్రకటించింది. దీంతో పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తు.. వ్యూహానికి ప్రతివ్యూహాలను రచించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో కీలక పార్టీల మధ్య పొత్తు పొడిచింది.. తెలంగాణ రాజకీయాల్లో ఇంతకాలం కమ్యూనిస్టులు సీపీఎం, సీపీఐ ఎవరితో జట్టుకడతారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. మొదట బీఆర్ఎస్‌తో అంటూ ప్రచారం జరగగా.. గులాబీ బాస్ కేసీఆర్ ఏకంగా అభ్యర్థులను ప్రకటించడంతో.. ఆపార్టీతో పొత్తు లేదంటూ కామ్రేడ్లు తేల్చిచెప్పారు. ముఖ్యంగా సీట్ల విషయంలో ఆయా పార్టీల మధ్య సయోధ్య జరగలేదంటూ ప్రచారం జరిగింది. ఇంతలోనే కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు కామ్రేడ్లు సిద్ధమైనప్పటికీ.. సీట్ల సర్దుబాటు విషయంలో కొంచెం ఊగిసలాట నడిచింది.

ఈ ఊగిసలాటకు సోమవారం బ్రేక్ పడింది. చివరకు కామ్రేడ్లు కాంగ్రెస్‌తోనే జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు. కమ్యూనిస్టులు కోరిన సీట్లకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. పొత్తులో భాగంగా సీపీఐకి 2, సీపీఎంకు 2 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఒక్కొక్క సీటు చొప్పున ఉభయ కమ్యూనిస్టులకు మొత్తం నాలుగు సీట్లను కేటాయించింది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలను, సీపీఎంకు భద్రచలం, మిర్యాలగూడెం స్థానాలను కేటాయించింది. భద్రాచలం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పినపాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో కమ్యూనిస్టులకు ఉన్న ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సీపీఎం, సీపీఐ పార్టీలకు చేరో రెండు స్థానాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు జిల్లాల్లోని పార్టీ బలం, అదే విధంగా కమ్యూనిస్టు కేడర్ కలిసివస్తుందని హస్తం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ.. మునుగోడు ఉపఎన్నికలో భాగంగా మొదట బీఆర్ఎస్ తో ప్రయాణాన్ని ప్రారంభించిన కమ్యూనిస్టులు చివరకు.. హస్తం పార్టీతో జతకట్టడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..