Pitru Paksha 2023: గయను పూర్వీకుల తీర్థయాత్ర అని ఎందుకు పిలుస్తారు? ఇసుకతో చేసే శ్రాద్దకర్మ ప్రాముఖ్యత ఏమిటంటే

ఎవరైనా గయ తీర్థయాత్రకు వెళ్లి.. తమ పూర్వీకుల పేరు, గోత్రం మొదలైన వాటితో .. తమ పూర్వీకులకు  పిండ ప్రదానం చేస్తే అతను సద్గతిని పొందుతారని విశ్వాసం. అంతేకాదు హిందూ విశ్వాసం ప్రకారం గయ  తీర్థంలో చేసే శ్రాద్ధ క్రతువు మొత్తం తమ కుటుంబంలోని ఏడు తరాల వారిని కలుపుతుందని సంతృప్తి చెందేలా చేస్తుందని నమ్మకం. 

Pitru Paksha 2023: గయను పూర్వీకుల తీర్థయాత్ర అని ఎందుకు పిలుస్తారు? ఇసుకతో చేసే శ్రాద్దకర్మ ప్రాముఖ్యత ఏమిటంటే
Pind Daan In Gaya
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2023 | 9:42 AM

హిందూ మతంలో దైవం అనుగ్రహం కోసం తమకు ఇష్టమైన దేవతలను పూజించడానికి వివిధ క్షేత్రాలకు వెళ్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అదే విధంగా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి.. తమ పూర్వీకులకు  మోక్షం కోసం  శ్రాద్ధ కర్మలను, పిండ ప్రదానం, దానాలు వంటి క్రతువులను నిర్వహించడానికి కూడా ఒక ప్రాంతాలన్ని వెళ్లారు. ఇక్కడకు వెళ్లి పూర్వీకులకు శాంతిని చేకూర్చే ప్రక్రియను నిర్వహిస్తారు. అదే గయ.  హిందూ మతంలో గయ అనేది ఒక పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఎవరైనా తమ పూర్వీకుల పట్ల భక్తితో , విశ్వాసంతో చేసే శ్రాద్ధ కర్మలు.. పితృ దోషం నుండి విముక్తి చేస్తుందని విశ్వాసం. అందుకనే గయ ధామానికి వెళ్లే ప్రత్యేక సంప్రదాయం ఎప్పటి నుంచో పాటిస్తున్నారు.

ఎవరైనా గయ తీర్థయాత్రకు వెళ్లి.. తమ పూర్వీకుల పేరు, గోత్రం మొదలైన వాటితో .. తమ పూర్వీకులకు  పిండ ప్రదానం చేస్తే అతను సద్గతిని పొందుతారని విశ్వాసం. అంతేకాదు హిందూ విశ్వాసం ప్రకారం గయ  తీర్థంలో చేసే శ్రాద్ధ క్రతువు మొత్తం తమ కుటుంబంలోని ఏడు తరాల వారిని కలుపుతుందని సంతృప్తి చెందేలా చేస్తుందని నమ్మకం.

గయ తీర్థంలో చేసే పితృ పూజ ప్రాముఖ్యత

గయకు సంబంధించిన మత విశ్వాసం

హిందువుల విశ్వాసం ప్రకారం గయ శ్రీ మహావిష్ణువు నివసించే పవిత్ర పుణ్యక్షేత్రం. పూర్వీకులు దేవుడి రూపంలో శ్రీ విష్ణువు నివసించే పవిత్ర నగరం. పౌరాణిక కాలంలో శ్రీ రాముడు సీతాదేవితో కలిసి గయలో తన తండ్రి దశరథ మహారాజు కోసం ఇక్కడ ప్రత్యేకంగా శ్రాద్ధకర్మలు చేశారని నమ్మకం.

ఇవి కూడా చదవండి

ఎన్ని శ్రాద్ధ కర్మలను రోజులు చేస్తారు

3, 5, 7 లేదా 17 రోజులు గయాతీర్థంలో ఉండి పూర్వీకులకు శ్రాద్ధ, పితృపూజలు నిర్వహించాలనే నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం ఇన్ని రోజులు ఒకే ప్రదేశంలో ఉండాలంటే ఎవరికైనా సమయం సరిపోదు.. అంతేకాదు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కనుక మీరు ఇన్నో రోజులు చేయాల్సిన కతృవులను ఒక్కరోజులోనే చేసే వీలు కూడా ఉంది. ఇలా ఇక్కడ చేసే కర్మలు మీ పూర్వీకుల మోక్షానికి మార్గం తెరవగలరు. మీకు సమయం తక్కువగా ఉంటే ఫల్గు నదిలో స్నానం చేసిన తర్వాత మీరు పర్వణ పద్ధతిలో పూర్వీకులకు శ్రాద్ధాన్ని ఆచరించి, పూర్వీకుల అనుగ్రహాన్ని పొందవచ్చు.

పిండ ప్రదానం ఎందుకు  చేస్తారంటే

పౌరాణిక నమ్మకం ప్రకారం పితృ పక్షం సమయంలో ఎవరైతే గయ క్షేత్రంలో తన పూర్వీకుల కోసం పిండదానం చేస్తారో .. అతని పూర్వీకులు నేరుగా మోక్షాన్ని పొందుతారని గయాసురుడికి బ్రహ్మ దేవుడు వరం ఇచ్చాడు. పూర్వీకులకు శ్రాద్ధ,  పిండ ప్రదానం సమర్పించడానికి మధ్యాహ్నం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడకు వెళ్లి 11:30 నుండి 12:30 మధ్య మీ పూర్వీకులకు  పిండ ప్రదానం చేయండి.

గయలో శ్రద్ధా కర్మకు అనుసరించాల్సిన నియమాలు

గయా తీర్థానికి వెళ్లి శ్రాద్ధం పెట్టే వ్యక్తి రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఎటువంటి  అసభ్యకరమైన పనులు చేయకూడదు. పూర్వీకులకు శ్రాద్ధం పెట్టేందుకు రాత్రిపూట గయలో ఉండేవారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. హింసం చేయడం, అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేయరాదు.

ఇసుక దానం

హిందూ విశ్వాసం ప్రకారం గయలో ఇసుకను దానం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సీతారాములు దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేయడానికి గయకు చేరుకున్నప్పుడు.. దాని కోసం సన్నాహాలు ప్రారంభించారు. అప్పుడు పిండ దానానికి సమయం ఆసన్నమైందని ఆకాశం నుండి ఒక స్వరం వినవచ్చిందని నమ్ముతారు. అప్పుడు సీతా దేవి ఇసుకతో బంతిని తయారు చేసి, ఫల్గు నది, మర్రి చెట్టు, మొగలి పువ్వు , ఆవును సాక్షులుగా తీసుకొని పిండం ప్రదాన ప్రక్రియను పూర్తి చేసింది. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ పూర్వీకుల మోక్షం కోసం ఇసుకతో పిండాన్ని సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.