Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ ధరల దోపిడీపై టీటీడీ కొరడా.. ఏపీ టూరిజంకు హోటల్స్‌ను అప్పగించేందుకు నిర్ణయం..

డయల్ యువర్ ఈఓలో భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఎట్టికేలకు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది టీటీడీ. నెలకు దాదాపు రూ. 50 లక్షల దాకా రెంట్ చెల్లిస్తున్న ఒక్కో రెస్టారెంట్ ఇష్టమొచ్చినట్లు ధరలు నిర్ణయించి దోపిడీ కొనసాగిస్తుండటంతో భక్తులు నిలువ దోపిడీకి గురి అవుతున్నారు. వందకు పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లోనూ ఇదే రీతిలో ధరల దగా కొనసాగుతుండడం గమనించి టీటీడీ యాక్షన్‌ స్టార్ట్ చేసింది.

Tirumala: తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ ధరల దోపిడీపై టీటీడీ కొరడా.. ఏపీ టూరిజంకు హోటల్స్‌ను అప్పగించేందుకు నిర్ణయం..
Private Hotels In Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2023 | 8:49 AM

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో  ప్రైవేట్ హోటల్స్ దందాకు చెక్ పెట్టింది టీటీడీ. తిరుమలలో భక్తుల ఆకలి, ఆహార అవసరాలు ఆసరాగా ప్రైవేట్ హోటల్లో కొనసాగుతున్న ధరల దోపిడీపై యాక్షన్ తీసుకుంది.  ఇంకా చెప్పాలంటే తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ ధరల దోపిడీపై టిటిడి కొరడా జులిపిస్తోంది. భక్తుల ఫిర్యాదుతో తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారం అందేలా టీటీడీ చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులకు అందుబాటులో ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా హోటల్స్‌ బాధ్యతను ఏపీ టూరిజంకు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే రెండు హోటల్స్ నిర్వహణను ఏపీ టూరిజంకు కట్టబెట్టింది టీటీడీ . ఈక్రమంలో మరిన్ని హోటల్స్ లైసెన్సులను రద్దు చేయాలని భావిస్తుంది. నాణ్యమైన ఆహార పదార్థాలను తక్కువ ధరలకు అందుబాటులో తీసుకొచ్చేలా చొరవ చూపుతోంది.

డయల్ యువర్ ఈఓలో భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఎట్టికేలకు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది టీటీడీ. నెలకు దాదాపు రూ. 50 లక్షల దాకా రెంట్ చెల్లిస్తున్న ఒక్కో రెస్టారెంట్ ఇష్టమొచ్చినట్లు ధరలు నిర్ణయించి దోపిడీ కొనసాగిస్తుండటంతో భక్తులు నిలువ దోపిడీకి గురి అవుతున్నారు. వందకు పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లోనూ ఇదే రీతిలో ధరల దగా కొనసాగుతుండడం గమనించి టీటీడీ యాక్షన్‌ స్టార్ట్ చేసింది.

ఏపీ టీడీసీకి తక్కువ టెండర్ ధర నిర్ణయించి నాణ్యమైన ఆహారం భక్తులకు అందించే చర్యలు చేపట్టింది. గతంలో తిరుమలకు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు ఎలాంటి ఖర్చులేకుండా టీటీడీ అందించాలని ప్రతిపాదనలు పెట్టినటప్పటికి అవి అమలు సాధ్యం కాలేదు. టిఫిన్‌ కోసం హోటల్స్ కు వెళ్తే సుమారు 400 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో.. ధరల దోపిడి కట్టడి చేసేందుకు త్వరలోనే భక్తులకు సౌకర్యవంతమైన ఆహారం తక్కువ ధరలకు అందించేందుకు టీటీడీ పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటుంది. ధరల టోడిపీడికి చెక్ పెడుతూ ఏపీ టూరిజంకు హోటల్స్‌ను అప్పజెప్పేందుకు నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..