Krishna Mukunda Murari October 9th, 2023: ముకుంద అహాన్ని దెబ్బకొట్టి.. శ్రీనివాస్‌ని ఇంటికి పిలిపించిన కృష్ణ..

ప్రభాకర్ సుక్కులు వెళ్ళడానికి రెడీ అవుతూ అందరికి తన కంపెనీ ఓపినింగ్ కు రమ్మనమని చెబుతాడు. ఇంతలో కృష్ణ వచ్చి చిన్నన్నా అని అంటే.. చల్లగా ఉండు బిడ్డ అని దీవిస్తుంటే.. ఇంతలో సుక్కు కలగజేసుకుని ముకుందకు మొగుడిని తెస్తేనే మన బిడ్డ చల్లగా ఉంటుందని అంటుంది. కృష్ణ, మురారీలు ప్రభాకర్ కు సుక్కుకు బట్టలు పెట్టి పంపిస్తారు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని అంటూనే,, మధు సినిమా స్టోరీ రెడీ చేసుకో సినిమా తీద్దామని చెబుతాడు.

Krishna Mukunda Murari October 9th, 2023: ముకుంద అహాన్ని దెబ్బకొట్టి.. శ్రీనివాస్‌ని ఇంటికి పిలిపించిన కృష్ణ..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Oct 19, 2023 | 8:25 AM

ప్రభాకర్ వస్తుంటే అందరూ నీకోసం చూస్తున్నారు రా చిన్నన్నా అని కృష్ణ అంటుంటే.. ఒక్క నిమిషం నువ్వు రా అల్లుడూ అంటూ మురారీని తీసుకుని వెళ్తాడు. ముకుంద .. మా ఇద్దరినీ చూసి ఉంటాడు.. మా విషయం తెలిసి పోయి ఉంటుందా చూద్దాం ఏమి జరుగుతుందో అని అంటుకుంది. ఇంతలో ప్రభాకర్ సేమ్ తనలా డ్రెస్ చేసి మురారీని తీసుకుని కిందకు వస్తాడు. అల్లుడు ధూమ్ ధామ్ షురూ అయింది పాట పెట్టు అని అంటే మధు ఒకే అంటూ సాంగ్ పెడతాడు.

డీజీ తో ఎంజాయ్ చేసిన ఫ్యామిలీ

ముందు ప్రభాకర్ .. మురారీ సాంగ్ కు డ్యాన్స్ చేస్తుంటే.. సుక్కు ఇపుడు అల్లుడు బిడ్డ చేస్తారు నువ్వు రా అని అంటే ఒకే అంటుంది. కృష్ణ సాంగ్ చేయడానికి వెళ్తుంటే ముకుంద పట్టుకుని ఆపి.. ఓడిపోయావు మా నాన్నకు పిలిపిస్తా అన్నావు అంటుంటే.. ఓడిపోలేదు ఇంకా పండగ పూర్తి కాలేదు.. నువ్వు ఓడిపోతే ఓ చీమలా మూలాన పడి ఉండాలి నువ్వు .. అది ఇల్లంతా తిరిగినా గానీ దాని స్థానం మాత్రం మూలే అంటూ ముకుందని కృష్ణ ఆటాడుకుంటుంది.

లడ్డు కోసం పోటీ పడిన ముకుంద.. కృష్ణలు

డీజీ సాంగ్స్ తో సందడి చేసిన కృష్ణ అలసి పోయాం కనుక.. గణపతి లడ్డుని వేలం వేస్తారు.. మధు లడ్డుని రూ.  500 లతో మొదలు పెడుతుంది. అప్పుడు ముకుంద నా కెపాసిటీ ఏమిటో అందరికి చుపిస్తా అనుకుంటూ నా పాట రూ.50 వేలు అని చెబుతుంది ముకుంద.. అందరూ షాక్ తింటారు.. అప్పుడు కృష్ణ.. నా పాట లక్ష అని అంటుంది.. మళ్ళీ కృష్ణతో ముకుంద పోటీ పడుతూ అలా లడ్డు కాస్ట్ ని ఆరు లక్షలు వరకూ తీసుకుని వెళ్తుంది. ప్రభాకర్ లడ్డుకి పోటీ పడబోతుంటే కృష్ణ ఆపి.. ముకుంద పేరుతోనే లడ్డు పాటని ఇవ్వమని చెబుతుంది.

ఇవి కూడా చదవండి

తండ్రిని పిలవాల్సి వచ్చిన ముకుంద

గణేష్ లడ్డుని పాడుకున్న ముకుందకు లడ్డుని ఇవ్వమని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వమని చెబుతుంది. తన దగ్గర మూడు లక్షలు ఉంది.. ఇప్పుడు ఎలా అత్తయ్యలు లేరు.. మురారీని అడిగితె కృష్ణ దగ్గర పరువు పోతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే.. ప్రసాద్.. అమ్మా ముకుంద క్యాష్ ఇచ్చి లడ్డు తీసుకో అని అంటాడు.. క్యాష్ లేకపోతే చెక్కు, యూపీఐ ఏదైనా ఒకే అంటాడు. ఇంతలో ముకుంద వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మూడు లక్షలు కావాలి.. ఇవ్వవా అని అడుగుతూనే బయట ఉండి కాల్ చెయ్యి అంటే అలాగే అంటాడు శ్రీనివాస్. ఒక్క ఐదు నిమిషాల్లో మా మనిషి వచ్చి డబ్బులు ఇస్తారు కాల్ చేస్తారు.

కృష్ణ చెప్పిందంటే చేస్తుంది అంతే

ఇంతలో మధు అలేఖ్య ఓ ఫోక్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తారు. ఇంతలో ముకుంద వాళ్ల నాన్న వచ్చి ముకుందకు డబ్బులు ఇస్తాడు. ఎందుకు వచ్చారు లోపలికి అంటే.. ఫోన్ చేశాను వినిపించలేదని లోపాలకి వచ్చాను అంటుంటే.. కృష్ణ వచ్చి.. బాబాయ్ అంటూ తన చిన్నాన్న ప్రభాకర్ కు ముకుంద తండ్రి అంటూ పరిచయం చేస్తుంది. ఏవో ప్రగల్భాలు పలికావు.. నా దగ్గర ఆరువందల మాత్రమే ఉంది. నిన్ను ఆరు లక్షల వరకూ పాడిచింది ఇందుకే.. సో.. రేపటి నుంచి ఒక మూలన పడి ఉండు అంటుంది ముకుందని కృష్ణ.

నిద్రపోతున్న మురారీని లేపుతూ కృష్ణ.. తనదైన శైలిలో అల్లరి మొదలు పెడుతుంది. లేచాక అమ్మయ్య లేచారా.. మీరు లేవాలనే ఇందంతా చేశాను.. రాత్రి లెట్ అయింది కదా నిద్రపోనివచ్చు కదా.. అని అంటే.. చిన్నన్నా, చిన్నమ్మ వెళ్లిపోతున్నారు కదా బట్టలు పెడదాం అనుకున్నాం కదా అంటుంటే.. మధ్యాహ్నం వెళ్ళమని చెప్పు కృష్ణ అంటూ మళ్ళీ నిద్రపోతాడు. కృష్ణ .. మురారీని లేపడానికి తిప్పలు పడుతుంది. ఏబీసీడీ అబ్బాయి అంటావు కదా మరి లేపు అని అంటుంటూ.. మురారీని నిద్రలేపడానికి నానా తిప్పలు పడుతుంది. ఇప్పుడు చెప్పు నేను ఏసీపీ సార్ నా ఎబిసిడీలబ్బాయినా.. అంటే నాకు ఎప్పుడూ ఎబిసిడీలబ్బాయే.. కాఫీ తీసుకుని రా అంటే.. లేదు ఫ్రెష్ అయి తగుదురుగాని లేవండి అని అంటుంటే..  ఓకే అంటాడు. రూమ్ లో ఉంటే ఇలా ఉంటారు. అదే ముకుంద ముందు అయితే ఇంకా దగ్గరకు వస్తారు అని కృష్ణ ఆలోచిస్తుంది.

ముకుంద కు మొగుడిని తెస్తేనే మన బిడ్డ చల్లగా ఉంటుంది

ప్రభాకర్ సుక్కులు వెళ్ళడానికి రెడీ అవుతూ అందరికి తన కంపెనీ ఓపినింగ్ కు రమ్మనమని చెబుతాడు. ఇంతలో కృష్ణ వచ్చి చిన్నన్నా అని అంటే.. చల్లగా ఉండు బిడ్డ అని దీవిస్తుంటే.. ఇంతలో సుక్కు కలగజేసుకుని ముకుందకు మొగుడిని తెస్తేనే మన బిడ్డ చల్లగా ఉంటుందని అంటుంది. కృష్ణ, మురారీలు ప్రభాకర్ కు సుక్కుకు బట్టలు పెట్టి పంపిస్తారు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని అంటూనే,, మధు సినిమా స్టోరీ రెడీ చేసుకో సినిమా తీద్దామని చెబుతాడు.

ఆదర్శ్ ను మిలటరీ నుంచి తీసుకుని రామన్న ప్రభాకర్..

కృష్ణతో నీకు ఒకటి చెప్పాలి.. ఆ ముకుంద బిడ్డ మొగుడిని మిలటరీ నుంచి తీసుకుని రావడం తప్పితే నీ కాపురం నిలబడడానికి వేరే దారే కనిపించడం లేదు అని అంటాడు ప్రభాకర్. ఇదంతా నీకు ఎరుకై ఉంటుందని తెలిసే చెబుతున్నా జర జాగ్రత్తగా ఉండు.. లేకపోతే నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ముకుంద చాలా జాదూగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు అని అంటూనే నీకు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే నేను ఉన్నా అది మరచిపోకు అంటూ కూతురుకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు ప్రభాకర్, సుక్కు..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!