- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips pictures of these birds in the house for special benefits know their name and right direction in telugu
Vastu Tips: ఇంట్లో అలంకరణ కోసం పక్షుల చిత్రాలు పెట్టుకోవాలనుకుంటున్నారా.. ఏ దిశలో ఏ పక్షుల పిక్స్ పెట్టాలంటే..
ఇంటిని అలంకరించేందుకు మనం తరచుగా అనేక రకాల ఫోటోలను ఉంచుతాము. అయితే అందం కోసం పెట్టె కొన్ని రకాల ఫోటోలు వాస్తు దోషాలను కూడా కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఇంట్లో ఆనందం సంతోషం కలిగించే కొన్ని చిత్రాలు ఉన్నాయని.. వాటిని ఇంట్లో సరైన దిశలో ఉంచితే శుభప్రదమని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఈ రోజు ఇంట్లో ఏయే పక్షుల చిత్రాలను శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం.
Updated on: Oct 05, 2023 | 9:17 AM

మన జీవితంలో పక్షులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో ముఖ్యమైన భాగం. పక్షుల కిలకిలారావాలు, వాటి అందాలతో ప్రకృతి పరవాసిస్తే... మనసు పులకరిస్తుంది. ఇంటి అలంకరణలో పక్షుల చిత్రాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. పక్షుల చిత్రాలు ఇంటికి సహజమైన అనుభూతిని కలిగిస్తాయి. అందమైన పక్షుల చిత్రాలు ఇంటిని అందంగా మార్చడమే కాకుండా .. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని కూడా పెంచుతాయి.

నెమలి: వాస్తు ప్రకారం నెమలికి , నెమలి ఈకకు కూడా ప్రాముఖ్యత ఉంది. అలాగే నెమలి ఈకను హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీకృష్ణుడి నెత్తిమీద కొలువై పూజలను అందుకునే ఈ నెమలి ఈకను ఇంట్లో ఉంచడం వల్ల శుభం కలుగుతుంది. అంతేకాదు కార్తికేయ వాహనం కూడా నెమలి. ఇంటికి దక్షిణ దిశలో నెమలి చిత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే శుభ ఫలితాలను పొందుతారు. ఇంట్లో ప్రకాశవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. నెమలి ప్రేమ, అందం , ప్రత్యేకతకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

పిచ్చుక: ఇంటి ఆవరణలోకి పిచ్చుక రావడం శుభప్రదంగా భావించినట్లే. అదేవిధంగా, ఇంట్లో దాని బొమ్మను ఉంచడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. వాస్తు దోషాలను తొలగించడానికి ఇది మంచి పరిష్కారంగా పరిగణించబడుతుంది. అంతేకాదు చిలుక ఇంటిలోని ప్రతికూలతను కూడా తొలగిస్తుంది.ఇంటికి తూర్పు దిశలో ఉంచడం సరైనదని భావిస్తారు. పిచ్చుక జీవితం సరళతకు, ఆనందానికి చిహ్నం. దీని చిత్రాన్ని తూర్పు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది.

చిలుక: ఇంట్లో రంగురంగుల చిలుక ఫోటో పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఈ చిలుకలు జీవితంలో ఐశ్వర్యాన్ని తెస్తాయట. అంతే కాకుండా వైవాహిక జీవితం కూడా మధురంగా మారుతుంది. మీరు కూడా ఇలా చేస్తే, మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందడమే కాకుండా ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు.

పాలపిట్ట: దీనిని ఇండియన్ రోలర్, నీలకంఠ పక్షి ఇలా ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. నీలకంఠ పక్షి చిత్రం ఇంట్లో సానుకూల శక్తిని, శాంతిని తెస్తుంది. ఈశాన్య దిక్కున ఈ పాలపిట్ట చిత్రాన్ని పెట్టుకోవడానికి అనుకూలమైన ప్రదేశం.

పావురం : పావురం చిత్రం ఇంట్లో శాంతి, ప్రేమ సందేశాన్ని ఇస్తుంది. దీనిని పశ్చిమ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రేమ పక్షులుగా కనిపించే తెల్ల పావురాలు.. ఇంటికి సానుకూలతను ముఖ్యంగా ప్రేమను తెస్తాయి.

వైల్డ్ బర్డ్స్ : అయితే ఇంట్లో పక్షుల చిత్రాలను పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. అడవి పక్షుల చిత్రాలను ఇంట్లో పెట్టుకోరాదు. ముఖ్యంగా రాబందులు, గుడ్లగూబలు, కాకులు, గబ్బిలాలు మొదలైన వాటి చిత్రాలను ఇంట్లో పెట్టుకోకూడదు.




