జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కారణంగా జాతక చక్రంలో దిగ్బలం ఏర్పడుతుంది. దిగ్బలం అంటే ఆ గ్రహానికి విపరీతమైన బలం పడుతుంది. ఇది శుభ యోగం మాత్రమే కలగజేస్తుంది. దీని ప్రకారం, గురు, బుధ గ్రహాలకు లగ్నంలో, చంద్ర, శుక్రులకు నాలుగవ స్థానంలో, శనీశ్వరుడికి సప్తమ స్థానంలో, రవి, కుజులకు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన దిగ్బలం పట్టి, తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. ఇది జాతక చక్రంలోనే కాదు, గ్రహచారంలో కూడా వర్తిస్తుంది. గ్రహచారంలో రాశిని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రహ చారం ప్రకారం, ఆరు రాశులకు ఈ విధమైన దిగ్బల యోగం పట్టింది. అవి: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశులు.