Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కలబంద దివ్యౌషధం.. ఈ నాలుగు కలిపి వాడితే అద్భతం చూస్తారు..

ప్రజలు తమ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ప్రతిదీ చేస్తున్నారు, కొందరు జిమ్‌లలో చేరుతున్నారు, కొందరు యోగా సహాయం తీసుకుంటున్నారు. అయితే మీరు తక్కువ శ్రమతో కూడా మీ బరువును తగ్గించుకోవచ్చని మీకు తెలుసా, అవును ఈ రోజు మనం అలోవెరా ఉపయోగించి మీ అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కలబంద దివ్యౌషధం.. ఈ నాలుగు కలిపి వాడితే అద్భతం చూస్తారు..
Weight Lose
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 09, 2023 | 2:17 PM

ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం సమస్యగా తయారైంది. దీని వెనుక ప్రధాన కారణాలు సరైన ఆహారం, అస్తవ్యస్థమైన జీవన శైలి. బరువు పెరగడంతో పాటు అనేక ఇతర సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ రోజుల్లో, ప్రజలు తమ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ప్రతిదీ చేస్తున్నారు, కొందరు జిమ్‌లలో చేరుతున్నారు, కొందరు యోగా సహాయం తీసుకుంటున్నారు. అయితే మీరు తక్కువ శ్రమతో కూడా మీ బరువును తగ్గించుకోవచ్చని మీకు తెలుసా, అవును ఈ రోజు మనం అలోవెరా ఉపయోగించి మీ అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి కలబందను ఎలా ఉపయోగించాలి ..

మీరు బరువు తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్టయితే.. త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటే, కలబంద రసం మీకు ఉత్తమ ఎంపిక. కలబంద రసం రుచి, పోషక విలువలను మెరుగుపరచడానికి, మీరు నారింజ, దానిమ్మ రసాన్ని సమాన పరిమాణంలో కలిపి త్రాగవచ్చు. దీనికి అవసరమైన పదార్థాలు. 100 ml నీటిలో 1-2 టీస్పూన్ల కలబంద జెల్ కలపాలి.

ఇవి కూడా చదవండి

– ఈ ద్రావణంలో నారింజ, దానిమ్మపండు రసాన్ని మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం తాగడం వల్ల మీ అధిక బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

– బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లతో కలబంద

కొబ్బరి నీళ్లలో కలబందను కలుపుకుని తాగొచ్చు. దీనితో చేసిన జ్యూస్‌తో మీ అధిక బరువును చాలా త్వరగా తగ్గించుకోవచ్చు.

అవసరమైన పదార్థాలు

– 2 టీస్పూన్ల అలోవెరా జెల్

– 200 మి.లీ కొబ్బరి నీరు

మరింత రుచికరంగా ఉండటానికి మీరు కొన్ని పుదీనా ఆకులను కూడా కలుపుకోవచ్చు.

– దోసకాయతో అలోవెరా

కలబంద, దోసకాయ రెండూ బరువు తగ్గడానికి ప్రసిద్ధి చెందాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని తాగడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. ఈ డ్రింక్ తాగడం వల్ల మీ ఆకలి సమస్య త్వరగా తీరుతుంది మీ బరువు కూడా తగ్గుతుంది.

అవసరమైన పదార్థాలు

– 2 టీస్పూన్ల అలోవెరా జెల్

– 1 తరిగిన దోసకాయ

– 1 ముక్క అల్లం మరియు 1/2 నిమ్మరసం

ఇవన్నీ కలిపి తాగడం వల్ల అధిక బరువు చాలా త్వరగా తగ్గుతుంది.

– అలోవెరా, బొప్పాయి, పైనాపిల్ ఈ మూడు పదార్థాలు బరువు తగ్గడానికి బాగా పని చేస్తాయి. ఈ మూడు పదార్థాలను మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల మీ బరువు చాలా త్వరగా తగ్గుతుంది.

అవసరమైన పదార్థాలు

– 2 చెంచాల అలోవెరా జెల్,

– 100 గ్రాముల బొప్పాయి

– 100 గ్రాముల పైనాపిల్

కలిపి తీసుకుంటే అధిక బరువు చాలా త్వరగా తగ్గుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..