Natu Kodi Pulusu: రాగి సంగటిలోకి నాటు కోడి పులుసును ఇలా చేసుకోండి.. సూపర్ అంటారు!!

నాటు కోడి దాని రుచే వేరు. నాటు కోడి కూరను వండేటప్పుడే ఇళ్లంతా ఘమఘుమలాడుతూ ఉంటుంది. నాటు కోడి కూరను ఎలా వండినా దాని టేస్ట్ ఏమాత్రం మారదు. అయితే సరిగ్గా.. పక్కా కొలతలతో చేస్తే మాత్రం.. ఇంట్లోని వారందరూ సూపర్ అనడం మాత్రం గ్యారెంటీ. అందులోనూ రాగి సంగటిలోకైనా అన్నంలోకైనా నాటి కోడి పులుసు చాలా బావుంటుంది. అయితే కొంత మందికి నాటు కోడి పులుసు చేయడం రాదు. అలాంటి వారు ఒక్కసారి ఈ టిప్స్ ను, కొలతలను పాటించి చేసి చూడండి. ఒక్కో ప్రాంతంలో ఈ పులుసును ఒక్కోలా చేస్తారు. కానీ ఇలా కింద చెప్పిన విధంగా చేస్తే.. ఈజీగా, అద్భుతంగా..

Natu Kodi Pulusu: రాగి సంగటిలోకి నాటు కోడి పులుసును ఇలా చేసుకోండి.. సూపర్ అంటారు!!
Natu Kodi Pulusu
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2023 | 7:15 AM

నాటు కోడి దాని రుచే వేరు. నాటు కోడి కూరను వండేటప్పుడే ఇళ్లంతా ఘమఘుమలాడుతూ ఉంటుంది. నాటు కోడి కూరను ఎలా వండినా దాని టేస్ట్ ఏమాత్రం మారదు. అయితే సరిగ్గా.. పక్కా కొలతలతో చేస్తే మాత్రం.. ఇంట్లోని వారందరూ సూపర్ అనడం మాత్రం గ్యారెంటీ. అందులోనూ రాగి సంగటిలోకైనా అన్నంలోకైనా నాటి కోడి పులుసు చాలా బావుంటుంది. అయితే కొంత మందికి నాటు కోడి పులుసు చేయడం రాదు. అలాంటి వారు ఒక్కసారి ఈ టిప్స్ ను, కొలతలను పాటించి చేసి చూడండి. ఒక్కో ప్రాంతంలో ఈ పులుసును ఒక్కోలా చేస్తారు. కానీ ఇలా కింద చెప్పిన విధంగా చేస్తే.. ఈజీగా, అద్భుతంగా వస్తుంది. అందరికీ నచ్చుతుంది కూడా. మరి నాటు కోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నాటు కోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు:

నాటు కోడి చికెన్ – అరకిలో, తరిగిన ఉల్లి పాయలు పెద్దవి – రెండు, పచ్చిమిర్చి – 6, కరివే పాకు -కొద్దిగా, కొత్తి మీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 పెద్ద స్పూన్, నూనె – సరిపడినంత, కారం – మీ రుచికి సరిపడినంత, ఉప్పు – సరిపడినంత, పసుపు – కొద్దిగా, ధని యాల పొడి – రెండు స్పూన్స్, జీలకర్ర పొడి – 1 స్పూన్, టామాటాలు – రెండు (చిన్నవి), పెరుగు- 1 స్పూన్,

ఇవి కూడా చదవండి

నాటు కోడి మసాలా పొడికి కావాల్సినవి:

ధనియాలు – ఒక స్పూన్, ఎండు మిర్చి – 3 , తోక మిరియాలు – 1 స్పూన్, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – చిన్న ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, వెల్లుల్లి రెబ్బలు – 8, జాజికాయ పొడి – కొద్దిగా, లవంగాలు – 6, నల్ల యాలకులు – 4. వీటన్నింటినీ దోరగా వేయించుని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి.

మసాలా పేస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్:

గసగసాలు – అర టీ స్పూన్, సార పప్పు – రెండు స్పూన్లు, జీడి పప్పు – పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – రెండు స్పూన్లు. వీటిని కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

నాటు కోడి పులుసు తయారీ విధానం:

ఒక కుక్కర్ తీసుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకుని వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ నెక్ట్స్ పసుపు, ఉప్పు, జీల కర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసుకుని మరికాసేపు వేయించుకోవాలి. నూనె తేలిన తర్వాత టమాటాలను ప్యూరీలాగా వేసుకోవాలి. తర్వాత పెరుగు కూడా వేసి చిన్న మంటపై ఫ్రై చేసుకోవాలి. తర్వాత నాటుకోడి చికెన్ వేసి కలపాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి మసాలా పేస్ట్ వేసి మరోసారి కలుపుకోవాలి. ఈ మసాలాలు చికెన్ కి బాగా పట్టేలా వేయించి, సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి.. 7, 8 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుని.. కొత్తి మీర చల్లుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే నాటు కోడి పులుసు రెడీ. ఈ పులుసు రాగి సంగటి, అన్నం, రోటీ, చపాతీ వాటిలో ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్ లో చికెన్ చేసుకుని ఒక్కసారి తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.