AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable’s side effects: ఈ వెజిటేబుల్స్ ని తరచూ తీసుకుంటున్నారా.. రక్త పోటు వచ్చే ఛాన్స్ ఉంది!

కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. నాన్ వెజ్ కంటే కూరగాయల్లోనే ఎక్కువగా పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే మంచి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. కాయ కూరలు, ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూంటారు. కానీ కూర గాయల్లో కొన్ని రకాలు తీసుకుంటే మాత్రం..

Vegetable's side effects: ఈ వెజిటేబుల్స్ ని తరచూ తీసుకుంటున్నారా.. రక్త పోటు వచ్చే ఛాన్స్ ఉంది!
Vegetables
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 05, 2023 | 7:45 PM

Share

కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. నాన్ వెజ్ కంటే కూరగాయల్లోనే ఎక్కువగా పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే మంచి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. కాయ కూరలు, ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూంటారు. కానీ కూర గాయల్లో కొన్ని రకాలు తీసుకుంటే మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. వీటి గురించి తెలియక మనం తరచూ వండుకుంటూ ఉంటాం. ఇప్పుడు చెప్పే కూరగాయలను కాస్త పక్కకు పెడితే మాత్రం చాలా మేలు కలుగుతుంది. ఆరోగ్యానికి హాని కలిగించే కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికం:

క్యాప్సికం తింటే మంచిదే కానీ.. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. క్యాప్సికం ను ఎక్కువగా తింటే కడుపులో మంట వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్రోకలీ:

బ్రోకలీని ఎక్కువగా పిజ్జా, సలాడ్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. కొంత మంది వాష్ చేసుకుని పచ్చిగా కూడా లాగించేస్తారు. ఇలా తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ స్థాయిలను బ్రోకలీ పెంచుతుంది. మల బద్ధకం కూడా వస్తుంది.

బ్రస్సెల్ స్ప్రౌట్స్:

ఇవి చూడటానికి చిన్నగా గుండ్రగా క్యాబేజీ మాదిరగా ఉంటాయి. వీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొనాలి.

సెలరీ:

సెలరీ వినియోగం కూడా ఈ మధ్య బాగా పెరిగింది. ఆరోగ్యానికి మంచిదే అయినా ఇది ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనే సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో క్రిమి సంహారక మందుల వినియోగం ఎక్కువగా ఉన్నట్టు పలు పరిశోధనల్లో తేలింది.

మొక్క జొన్న:

మొక్క జొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ మొక్క జొన్న తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయట. అంతే కాకుండా బరువు కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.

బంగాళా దుంపలు:

చాలా మందికి ఇష్టమైన వాటిల్లో బంగాళా దుంపలు కూడా ఒకటి. వీటిని తింటే వాతవ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా వీటిలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటాయి. ఆలూ తినడం వల్ల బరువు పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి.

పైన చెప్పిన కూరగాయలు అప్పడప్పుడు తీసుకుంటే పర్వాలేదు కానీ.. తరచూ తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే