AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆ సమస్యతో బాధపడేవారు ఈ నాలుగు పండ్లను అస్సలు తినకూడదు..

Health Tips: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు టైప్ 2 డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వృద్ధులే కాదు యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహం నయం చేయలేనిది. కేవలం నియంత్రణలో మాత్రమే ఉంచుకోవాలి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా

Health Tips: ఆ సమస్యతో బాధపడేవారు ఈ నాలుగు పండ్లను అస్సలు తినకూడదు..
Fruits
Shiva Prajapati
|

Updated on: Oct 06, 2023 | 1:27 AM

Share

Health Tips: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు టైప్ 2 డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వృద్ధులే కాదు యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహం నయం చేయలేనిది. కేవలం నియంత్రణలో మాత్రమే ఉంచుకోవాలి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఆహార నియంత్రణ, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు స్వీట్లు తినడం మానేయాలి. ప్రాసెస్ చేసిన చక్కెరకు బదులుగా సహజ చక్కెరను అంటే పండ్లు తింటారు. కానీ డయాబెటిక్ పేషెంట్లు కొన్ని పండ్లకు దూరం పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. సహజమైన చక్కెర పండ్లలో దొరుకుతుందని, అయితే కొన్ని పండ్లు డయాబెటిక్ రోగులకు ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లను తినడం వల్ల వేగంగా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, డయాబెటిక్ రోగులు ఏ పండ్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

అరటిపండు: టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు అరటిపండ్లను తినకూడదు. అరటిపండులో షుగర్ కంటెంట్, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది.

అనాస పండు: పైనాపిల్‌లో విటమిన్ సి కూడా ఉంటుందని. అయితే ఇందులో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ పెరుగుతుందని డాక్టర్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సపోట: సపోటా తినడానికి రుచిగా ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలి. సపోటాలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు హానికరం.

లిచీ: డయాబెటిక్ పేషెంట్లు లిచీ తినకుండా ఉండాలి. వాస్తవానికి, లిచీలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఈ పండుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏ పండ్లు తినాలి?: డయాబెటిక్ పేషెంట్లు పరిమిత పరిమాణంలో యాపిల్ తినవచ్చని చెప్పారు. పీచు పదార్థం కలగి, నారింజ పండ్లను కూడా తినవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..