Hyderabad: బంజారాహిల్స్ ఏసీబీ దాడి కేసులో సినిమా తరహాలో ట్విస్టులు.. 20 పేజీల నివేదికను సిద్ధం చేసిన ఏసీబీ..
Telangana: ఈ విధంగా 20 పేజీల నివేదికను నగర సిపి సివి ఆనంద్ కు అందజేశారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే హోంగార్డ్ హరి, సీఐ నరేందర్ చెప్పారంటూ బాధితుడి వద్ద నుంచి లంచం రాబట్టేందుకు బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు అని తెలియడంతో హరి తన సిమ్ కార్డును మార్చాడు. ప్రస్తుతం హరి ఫోన్‌ను రికవరీ చేసుకున్న ఏసీబీ అధికారులు, ..
బంజారాహిల్స్ ఏసీబీ దాడి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి… ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తిపైనే ఉల్టా కేసు నమోదు చేసి ఈ వ్యవహారం అంతా నడిపించాడు బంజారాహిల్స్ సిఐ నరేందర్.. జులై 30 అర్ధరాత్రి బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 44 లో ఉన్న స్కై లాంచ్ పబ్బులో ఎస్ఐ నవీన్ రెడ్డి నేతృత్వంలో దాడి చేసినట్లు రికార్డ్స్ లో ఎంట్రీ చేశారు.. వాస్తవానికి ఎస్ఐ నవీన్ రెడ్డి ఆరోజు డ్యూటీలోనే లేడు.. ఆ తర్వాత జులై 30 అర్ధరాత్రి పబ్బులో దాడి చేసినట్లు సీఐ నరేందర్ కోర్టు లో దాఖలు చేసినటువంటి చార్జిషీట్లో పేర్కొన్నాడు .కానీ పంచనామా చేసినటువంటి స్టేట్మెంట్లు కానీ, పత్రాలను కానీ వేటిని సమర్పించలేదు. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు.
ఇందులో ట్విస్ట్ ఏంటంటే మొదటిగా స్కైలాంచ్ పబ్బు ఓనర్లు అయినటువంటి లక్ష్మణ్ రావు రాజశేఖర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసినట్లుగా సమాచారం.. కానీ, స్కై లాంచ్ పబ్ కింద ఉన్నటువంటి మరొక పబ్ కి చెందిన వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.. స్కైలాంచ్ పబ్బు తో బాధితుడు నిర్వహిస్తున్నటువంటి పబ్ కి పార్కింగ్ వివాదం ఉంది.. అయితే బాధితుడు పార్కింగ్ ప్రదేశానికి ప్రతి నెల 50 వేల రూపాయలను చెల్లిస్తున్నాడు.. అయినప్పటికీ స్కై లాంచ్ పబ్బకి వచ్చేటటువంటి కస్టమర్స్ మాత్రం బాధితుడు నిర్వహిస్తున్నటువంటి పబ్బు పార్కింగ్ ప్లేస్‌లో పార్కింగ్ చేయడంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు.. అయితే, స్కై లాంచ్ పబ్బులో స్లీపింగ్ పార్ట్నర్ గా పని చేస్తున్నటువంటి ఓ వ్యక్తి పోలీస్ అధికారి బంధువుగా తేల్చారు ఏసీబీ అధికారులు… బాధితుడు బంజారాహిల్స్ సీఐని ఆశ్రయించి ఫిర్యాదు చేయగా తిరిగి బాధితుడి పైనే ఉల్టా కేసును నమోదు చేశారు. అనంతరం బాధితుడు ఐపీఎస్లను సంప్రదించి చెప్పగా బంజర హిల్స్ సిఐ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో గత్యంతరం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు సదరు బాధితుడు.
తొలుత స్కైలాంచ్ పబ్బు నాలుగు లక్షల 50 వేల వరకు నెలకు ఇంత ఇవ్వాలి అని డిమాండ్ చేసినట్లు లక్ష్మణ్ రావు రాజశేఖర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం వచ్చింది. అయితే జులై 30 అర్ధరాత్రి పబ్బులో పోలీసులు దాడి చేయలేదని తేల్చారు. అంతేకాకుండా ఆ సమయంలో పబ్బు ఓనర్లు కూడా లేనట్లు ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించారు. ఈ విధంగా 20 పేజీల నివేదికను నగర సిపి సివి ఆనంద్ కు అందజేశారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే హోంగార్డ్ హరి, సీఐ నరేందర్ చెప్పారంటూ బాధితుడి వద్ద నుంచి లంచం రాబట్టేందుకు బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు అని తెలియడంతో హరి తన సిమ్ కార్డును మార్చాడు. ప్రస్తుతం హరి ఫోన్‌ను రికవరీ చేసుకున్న ఏసీబీ అధికారులు, ఫోరెన్సిక్ కు పంపించారు. ఈ విధంగా బంజారాహిల్స్ ఏసీబీ దాడి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు సినిమా తరహాలో కనిపించాయి. అయితే, ఈనెల 16న బంజారా హిల్స్ సీఐ నరేందర్ తో పాటు ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డు హరిలను విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..