- Telugu News Photo Gallery Plastic air pollution: Microplastics in clouds could be exacerbating climate change, japanese study says
Plastic Air Pollution: మానవాళికి మరో ముప్పు.. మేఘాల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు..
ప్రకృతిలో ప్లాస్టిక్ వ్యర్ధాల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా జపనీస్ శాస్త్రవేత్తలు మేఘాల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నట్లు ధృవీకరించారు. ప్రతి లీటరు క్లౌడ్ వాటర్‌లో 6.7 నుండి 13.9 మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు. జపాన్ పరిశోధకులు మైక్రోప్లాస్టిక్‌లు మేఘాల్లో ఉన్నాయని ధృవీకరించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు.
Updated on: Oct 01, 2023 | 11:41 AM

జపాన్ శాస్త్రవేత్తల బృందం 7.1 నుండి 94.6 మైక్రోమీటర్ల పరిమాణంలో గాలిలో ఉండే మైక్రోప్లాస్టిక్‌ల్లో తొమ్మిది రకాల పాలిమర్‌లను, ఒక రకమైన రబ్బర్‌ను గుర్తించింది. పరీక్షించిన ప్రతి లీటరు క్లౌడ్ వాటర్‌లో 6.7 నుండి 13.9 ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి.

"ప్లాస్టిక్ వాయు కాలుష్యం సమస్యను ముందస్తుగా పరిష్కరించకపోతే, వాతావరణ మార్పు, పర్యావరణ ప్రమాదాలు వాస్తవంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కోలుకోలేని, తీవ్రమైన పర్యావరణ నష్టాన్ని కలిగిస్తుంది" అని పరిశోధన ప్రధాన రచయిత అయిన వాసెడా విశ్వవిద్యాలయానికి చెందిన హిరోషి ఒకోచి హెచ్చరించారు.

మైక్రోప్లాస్టిక్‌లు ఎగువ వాతావరణానికి చేరుకున్నప్పుడు.. సూర్యరశ్మి నుండి అతి నీలలోహిత వికిరణానికి గురైనప్పుడు, అవి కుళ్ళిపోతాయి.. గ్రీన్‌హౌస్ వాయువులకు దోహదం చేస్తాయని ఓకోచి చెప్పారు.

మైక్రోప్లాస్టిక్స్.. పారిశ్రామిక మురుగునీరు, వస్త్రాలు, సింథటిక్ కార్ టైర్లు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఇతర వనరుల నుండి 5 మిల్లీమీటర్ల కంటే చిన్న ప్లాస్టిక్ కణాలుగా నిర్వహించారు.

నిర్వహించారు. ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న చేపలు, ఆర్కిటిక్ సముద్రపు మంచు, పైరినీస్ పర్వతాల్లోని మంచు నీటిలో కనుగొనబడ్డాయి.

ఏది ఏమయినప్పటికీ గాలిలో మైక్రోప్లాస్టిక్ రవాణాపై పరిశోధనలు పరిమితంగా చేస్తున్నారు. విభిన్న ప్రదేశాల్లో ప్లాస్టిక్ రవాణా అస్పష్టంగా ఉందని తమ పరిశోధనలో క్లౌడ్ వాటర్‌లో గాలిలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ల మొదటి నివేదిక ఇదని వెల్లడించారు.

మేఘాల్లోని "మైక్రోప్లాస్టిక్‌లను మానవులు, జంతువుల్లో నీటి ద్వారా తీసుకుంటున్నారు. ఈ వ్యర్ధాలు ఊపిరితిత్తులు, గుండె, రక్తం, మలం వంటి అనేక అవయవాలలో గుర్తించబడ్డాయి అని వాసేడా విశ్వవిద్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

మిలియన్ల టన్నుల మేఘాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయని.. ఈ మైక్రోప్లాస్టిక్‌లు మేఘాల్లో ముఖ్యమైన అంశంగా మారవచ్చని సూచించింది. ప్లాస్టిక్ వర్షం' ద్వారా మనం తినే తిండిని, త్రాగే ప్రతిదాన్ని కలుషితం చేస్తుంది.. కొత్త పరిశోధన ఫలితాలను విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, అలాగే క్యాన్సర్ కారకాలుగా మారి హాని కలిగిస్తాయని కొన్ని ఇటీవలి పరిశోధనల్లో వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు.





























