- Telugu News Photo Gallery Cinema photos Do you know these actress samantha to trisha remueration details in south industry telugu movie news
Tollywood: ఈ ముద్దుగుమ్మల రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?.. సమంత నుంచి త్రిష వరకు.. ఎవరెక్కువ అంటే..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీనియర్ హీరోయిన్స్ ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లి, పిల్లలు తర్వాత సినిమాలకు దూరమవుతుంటారు. ఆ తర్వాత కేవలం సహయ పాత్రలు మాత్రమే పోషించేవారు. ఇక వయసు 40 వచ్చిందంటే.. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సత్తా చాటుతున్నారు. హీరోయిన్ త్రిష.. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది. కొన్నాళ్లు మూవీస్ కు బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ..
Updated on: Oct 01, 2023 | 12:03 PM

హీరోయిన్ త్రిష.. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది. కొన్నాళ్లు మూవీస్ కు బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఒక్కో సినిమాకు దాదాపు 12 కోట్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే నయనతార సైతం ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాకు నయన్ రూ. 10 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక బాహుబలి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి అనుష్క ఏకంగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత..సైతం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు దాదాపు రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం.

ఇటు తెలుగు, అటు హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఒక్కో సినిమాకు రూ. 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.

భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. ఇప్పుడు తమిళంలో వరుస చిత్రాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ. 2.5 నుంచి రూ. 4 కోట్ల రూపాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక భోళా శంకర్, జైలర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మిల్కీబ్యూటీ తమన్నా..ఇప్పుడు బాలీవుడ్ పై మనసుపారేసుకుంది. ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల వరకు తీసుకుంటుందట.

అలాగే పెళ్లై, బాబు జన్మించిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టా్ర్ట్ చేసింది కాజల్. ప్రస్తుతం భగవంత్ కేసరి, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలకు రూ.4 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.





























