Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘అవును.. ఎవరికీ బతకడం అంత ఈజీ కాదు!’ కంటతడి పెట్టిస్తోన్న వీడియో

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కాలం అగ్నిపరీక్ష పెడితే.. మరికొందరికి పూలబాటలు వేస్తుంది. అయితే ఎవరికీ బతకడం అంత ఈజీ ఏం కాదు.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి. పనిగట్టుకుని ఎందరో వెనక్కి లాగడానికి వెంటబడుతుంటారు. కానీ వాళ్లందరినీ వదిలించుకుని ముందుకు సాగిపోతుండాలి. అయితే అది అంత సులువుకాదు. లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలియదు. ఏ మలుపులో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఊహించడం కష్టం. అలాంటి ఓ బాధాకర..

Viral Video: 'అవును.. ఎవరికీ బతకడం అంత ఈజీ కాదు!' కంటతడి పెట్టిస్తోన్న వీడియో
Water Bottle Vendor
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 12, 2023 | 2:55 PM

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కాలం అగ్నిపరీక్ష పెడితే.. మరికొందరికి పూలబాటలు వేస్తుంది. అయితే ఎవరికీ బతకడం అంత ఈజీ ఏం కాదు.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి. పనిగట్టుకుని ఎందరో వెనక్కి లాగడానికి వెంటబడుతుంటారు. కానీ వాళ్లందరినీ వదిలించుకుని ముందుకు సాగిపోతుండాలి. అయితే అది అంత సులువుకాదు. లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలియదు. ఏ మలుపులో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఊహించడం కష్టం. అలాంటి ఓ బాధాకర దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన వారికి ఎవరికైనా గుండె బద్దలవడం ఖాయం. ఎంత కష్టించి పని చేసినా.. ఎందరిని ముంచినా.. పొట్టకూటి కోసమేనన్నది జగమెరిగిన సత్యం. ఈ వీడియోలో ఓ కూలి ప్రాణాలకు తెగించి పరుగులు తీసిన దృశ్యం ప్రతిఒక్కరినీ కలచి వేస్తోంది.

ఆతురుతలో, ప్రాణాలను కూడా పణంగా పెట్టే ఇలాంటి దృశ్యాలు మన చుట్టుపక్కన ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలోని కదులుతున్న రైలులో నీళ్ల బాటిళ్లు అమ్ముకోవడానికి రాటుదేలిన గులక రాళ్లలో తల మీద బరువుతో ఓ వ్యక్తి పరుగులు తీయడం కనిపిస్తుంది. అతని కంటే ముందుగా మరో వ్యక్తి ఆహారంతో ఉన్న బుట్టతో కదులుతున్న రైలు చాకచక్యంగా ఎక్కుతాడు. అతడిని చూసి నీళ్ళ బాటిళ్లు అమ్మే మరో వ్యక్తి కూడా అలానే రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతను బ్యాలెన్స్ చేయలేక రాళ్లలో అమాంతంగా పడిపోతాడు. ఎక్కి ఉంటే తన చేతిలోని బాటిళ్లన్నీ అమ్ముడు పోయేవి. ఆ రోజుకి అతనికి కడుపు నిండా ఆహారం దొరికి ఉండేది. కానీ కాలం పెట్టిన పరీక్షలో అతని అంచనాలు తలకిందులయ్యాయి. కానీ ఇక్కడ అదృష్టమేమిటంటే.. అతను పట్టాలకు దూరంగా రాళ్లల్లో పడిపోవడం, అతనికి ప్రాణాపాయం తప్పడం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లక్షల్లో వీక్షణలు, లైకులు కామెంట్లు రావడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు ‘లైఫ్‌ ఈజ్‌ నాట్ ఈజీ ఫర్‌ ఎవ్రివన్‌’ అంటూ ఎమోషన్‌ కామెంట్లు పెడుతున్నారు. మీరూ చూడండి..

ఇవి కూడా చదవండి

ముందే చెప్పినట్లు జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఒక్క రూపాయి సంపాదించడానికి ఎంతగా కష్టపడాలో.. పట్టెడన్నం నోట్లోకి వెళ్లేందుకు ఎంత కష్టపడాలో అన్నది ఈ వీడియో చూస్తే అవగతమవుతుంది. అలాంటి రూపాయి కోసం చాలా సార్లు ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో అందుకు ఓ ఉదాహరణ.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.