Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Divya Prabha: విమానంలో ప్రముఖ నటికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించాడు. సోమవారం (అక్టోబర్ 9) నటి దివ్య ముంబై నుంచి కొచ్చికి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణించిన సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ తన ఇన్‌స్టా ఖాతాలో మంగళవారం (అక్టోబర్‌ 10) పోస్టు పెట్టింది..

Actress Divya Prabha: విమానంలో ప్రముఖ నటికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
Drunk Passenger Harassment On Air India Flight
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 11, 2023 | 2:48 PM

తిరువనంతపురం, అక్టోబర్ 11: ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించాడు. సోమవారం (అక్టోబర్ 9) నటి దివ్య ముంబై నుంచి కొచ్చికి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణించిన సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ తన ఇన్‌స్టా ఖాతాలో మంగళవారం (అక్టోబర్‌ 10) పోస్టు పెట్టింది.

‘ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ఏఐ 681లో ముంబై నుంచి కొచ్చికి వచ్చే సమయంలో విమానంలో నేనొక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. మద్యం మత్తులో ఉన్న తోటి ప్రయాణికుడు నన్ను వేధించాడు. నన్ను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఎయిర్‌ హోస్టెస్‌కి ఫిర్యాదు చేయగా.. వారు తీసుకున్న ఏకైక చర్య ఏంటంటే నా సీటు మార్చడం మాత్రమే. అది కూడా టేకాఫ్‌కు ముందు నన్ను వేరే సీటుకు మార్చారు. కొచ్చికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్‌ అధికారులకు తెలిపాను. వారు నన్ను పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు వెళ్లమని చెప్పారు. కేరళ పోలీసులకు నేను అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాను. ఈ విషయమై దర్యాప్తు చేయాలని వారిని అభ్యర్ధిస్తున్నానంటూ’ నటి దివ్య పోలీసులకు ఈ మెయిల్‌ ద్వారా పంపిన ఫిర్యాదు తాలూకు స్క్రీన్‌ షాట్‌ను కూడా ఈ పోస్టుకు జోడించింది.

ఇవి కూడా చదవండి

సదరు పోకిరీపై ఎయిర్ హోస్టెస్‌కు ఫిర్యాదు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుండానే సింపుల్‌గా తన సీటును మార్చారంటూ తన పోస్టులో నటి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అలాగే విమానాల్లో ప్రయాణికుల భద్రత కోసం కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం నటి దివ్య పెట్టిన ఇన్‌స్టా పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు అభిమానులు నటికి మద్దతిస్తున్నారు. ఎయిర్‌ ఇండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.