Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Hamas Conflict: ప్రాణభయంతో చనిపోయినట్లు నటించినా.. గుర్తించి మరీ హతమార్చిన హమాస్‌ ఉగ్రమూక! వెలుగులోకి మరో ఘటన

ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రమూక పాల్పడిన దురాగతాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. గాజా సరిహద్దులోని కిబ్బుజ్‌ రీమ్‌వద్ద జరిగిన నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై హమాస్‌ మిలిటెంట్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ముష్కరులకు భయపడి చెట్లు, పొదల చాటున దాక్కున్న వారినీ వెతికి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రాణాలు కాపాడుకునేందుక చనిపోయినట్లు నటించిన ఓ మహిళను ఆమె శ్వాసను గుర్తించి మరీ హతమార్చారు...

Israel Hamas Conflict: ప్రాణభయంతో చనిపోయినట్లు నటించినా.. గుర్తించి మరీ హతమార్చిన హమాస్‌ ఉగ్రమూక! వెలుగులోకి మరో ఘటన
Israel Hamas Conflict
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 10, 2023 | 3:56 PM

జెరూసలెం, అక్టోబర్ 10: ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రమూక పాల్పడిన దురాగతాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. గాజా సరిహద్దులోని కిబ్బుజ్‌ రీమ్‌వద్ద జరిగిన నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై హమాస్‌ మిలిటెంట్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ముష్కరులకు భయపడి చెట్లు, పొదల చాటున దాక్కున్న వారినీ వెతికి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రాణాలు కాపాడుకునేందుక చనిపోయినట్లు నటించిన ఓ మహిళను ఆమె శ్వాసను గుర్తించి మరీ హతమార్చారు. ఇజ్రాయెల్‌ ప్రజలపై హమాస్‌ ఉగ్రవాదుల నరమేధానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. అసలేం జరిగిందంటే..

ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ టీవీ హోస్ట్‌ మాయన్‌ ఆడమ్‌ చెల్లి మాపల్‌ ఆడమ్‌ (27) గత శనివారం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు వెళ్లింది. అయితే ఆ ప్రాంతాన్ని హమాస్‌ ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో వారంతా ప్రాణాలు దక్కించుకునేందుకు చల్లాచెదురుగా పారిపోయారు. ఈ క్రమంలో మాపల్‌ ఓ ట్రక్కు కింద దాక్కుని చనిపోయినట్లు నటించగా.. ఆమె దగ్గరికొచ్చి చూసి శ్వాస ఉన్నట్లు గుర్తించి కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటనలో మాపల్‌ ఆడమ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రోయ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని ఆమె సోదరి టీవీ హోస్ట్‌ మాయన్‌ ఆడమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకుంటూ అక్కడి పరిస్థితులను వివరించింది.

మాపల్‌ చనిపోవడానికి ముందు అక్కడి పరిస్థితిని తెల్పుతూ ట్రక్కు కింద నుంచి ఫొటో తీసి తన సోదరికి పంపించింది. ఆ ఫొటోను మాయన్‌ ఆడమ్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ఆ దారుణాన్ని వివరించింది. ‘శనివారం (అక్టోబర్ 7) సాయంత్రం మాపల్‌ తీసిన చివరి ఫొటో ఇది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ట్రక్‌ కింద గంటల పాటు ఆమె కదలకుండా చనిపోయినట్లు నటించింది. కానీ ఉగ్రవాదులు ఆమెను గుర్తించి దారుణంగా చంపేశారు. మాపల్‌ బాయ్‌ఫ్రెండ్‌ తీవ్రగాయాలతో ఆమె పక్కన పడిపోయాడంటూ’ ఆవేదన వ్యక్తం చేసింది. మాపల్‌ ఇజ్రాయెల్‌ మిలిటరీలో కూడా పనిచేసింది. గతంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ‘ఒక సైన్యం, 72 ఏళ్లు, 23,816 మంది అమరవీరులు. నా దేశానికి సేవ చేసే మహత్‌ భాగ్యాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలంటూ’ తన పోస్టులో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా వందలాది మంది హాజరైన మ్యూజిక్‌ పార్టీపై హమాస్‌ జరిపిన కాల్పుల్లో కేవలం 260 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. నిజానికి 800లకుపైగా ప్రజలు, సైన్యం ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న బుల్లెట్ల వర్షానికి జనాలు పిట్టల్లా రాలిపోయారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ల మెరుపు దాడి ఆ దేశంలోని అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. మారణహోమం సృష్టించారు. ప్రతిగా ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలోని హమాస్‌ స్థావరాలపై బాంబులతో విరుచుపడింది. ఇరువైపులా ప్రాణ నష్టం దాదాపు 1600లకు చేరింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.