Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో ఈ చేప మహా ముదురు.. నీళ్లు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా బతికేస్తుందట! వీడియో వైరల్

నీళ్లు లేకుండా చేపలు జీవించగలవా..? అసాధ్యం అనే కదా మీ అన్సర్‌. చేపలు వాటి మనుగడ కోసం నీటిపై ఆధారపడతాయనే సత్యాన్ని సైన్స్‌ చెబుతోంది. చేపలు జీవించాలంటే నీళ్లు తప్పనిసరి. ఏ చేప కూడా నీళ్లు లేకుండా జీవించలేవు. అసలది అసాధ్యం అనుకునే వారికి ఈ చేప గురించి చెప్పాలి. అవును.. ఓ చేప నీళ్లు లేకుండానే నెలలు, సంవత్సరాలు బతికేస్తోంది. నమ్మలేకపోతున్నారా? అయితే మీరీ వీడియో చూడాల్సిందే..

Viral Video: వామ్మో ఈ చేప మహా ముదురు.. నీళ్లు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా బతికేస్తుందట! వీడియో వైరల్
Lung Fish
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 09, 2023 | 4:32 PM

నీళ్లు లేకుండా చేపలు జీవించగలవా..? అసాధ్యం అనే కదా మీ అన్సర్‌. చేపలు వాటి మనుగడ కోసం నీటిపై ఆధారపడతాయనే సత్యాన్ని సైన్స్‌ చెబుతోంది. చేపలు జీవించాలంటే నీళ్లు తప్పనిసరి. ఏ చేప కూడా నీళ్లు లేకుండా జీవించలేవు. అసలది అసాధ్యం అనుకునే వారికి ఈ చేప గురించి చెప్పాలి. అవును.. ఓ చేప నీళ్లు లేకుండానే నెలలు, సంవత్సరాలు బతికేస్తోంది. నమ్మలేకపోతున్నారా? అయితే మీరీ వీడియో చూడాల్సిందే..

ఆఫ్రికన్ లంగ్ ఫిష్ అనే చేప ఆహారం, నీరు లేకుండా ఏళ్ల తరబడి నిద్రాణస్థితిలో ఉంటుందట. ఇది 3 నుంచి ఐదేళ్ల వరకు సజీవంగానే ఉండగలదట. నీళ్ల సదుపాయం పరిసరాల్లో ఉండగలిగినప్పుడే ఈ చేపలు మళ్లీ మేల్కోంటాయి. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యూస్ అడిక్ట్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అ లంగ్ ఫిష్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అంతే అదికాస్తా వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఆఫ్రికన్ లంగ్ ఫిష్ నాలుగు సంవత్సరాల వరకు ఎండిన బురదలో నిద్రాణస్థితిలో ఉండగలదు. ఇవి జీవించడానికి నీరు అవసరం లేదని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో కనిపిస్తున్న చేపను సకర్‌మౌత్ క్యాట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. హైబర్నేషన్ లాంటి మోడ్‌కు మారే అరుదైన జాతుల్లో ఇది కూడా ఒకటి. నీళ్లు లేకుండా నిద్రాణస్థితిలో ఉండే ఈ చేపలు వర్షం వచ్చే వరకు నెలల తరబడి పొడి నేల లేదా గట్టిపడిన బురదలో జీవించగలవంటూ రాసుకొచ్చాడు సదరు వ్యక్తి. ఇలాంటి చేపలు కూడా ఉంటాయని చాలా మందికి తెలియకపోవడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

View this post on Instagram

A post shared by VIEWS (@viewsaddict)

దీంతో మిలియన్లలో వ్యూస్‌, కామెంట్స్‌, లైకులు వచ్చిపడటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి చాలా అద్భుతమైంది. ప్రమాదకర పరిస్థితుల్లో కప్పలు చనిపోకుండా తమను తాము పూర్తిగా స్తంభింపజేసుకుంటాయి. ఎలిగేటర్‌లు కొన్ని అడుగుల ఎండిపోయిన బురదలో నిద్రాణస్థితిలో ఉండగలవు. టాడ్‌పోల్స్ రొయ్యల గుడ్లు వర్షం కురిసే వరకు చాలా ఏళ్లపాటు పూర్తిగా సురక్షితంగా ఉంటాయంటూ ఓ యూజర్‌ కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని వైరల్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.