AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Palestine Conflict: పాలస్తీనాలో ‘హమాస్’ ఉగ్ర సంస్థ ఎలా ఏర్పడిందో తెలుసా..? దీని వెనుక అసలు కథ ఇదే..

ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య మళ్లీ వివాదం కొనసాగుతోంది. శనివారం (అక్టోబర్ 7) ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్లతో దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఈ రెండు దేశాల మధ్య వైరం గత 100 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. హమాస్ పాలస్తీనాలో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఎలా అవతరించిందో, ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య ఎన్నిసార్లు యుద్ధం జరిగిందో ఈ వివరాలు మీ కోసం.. హమాస్ - ఇజ్రాయెల్ మధ్య పోరాటానికి..

Israel Palestine Conflict: పాలస్తీనాలో 'హమాస్' ఉగ్ర సంస్థ ఎలా ఏర్పడిందో తెలుసా..? దీని వెనుక అసలు కథ ఇదే..
Hamas In Palestine
Srilakshmi C
|

Updated on: Oct 08, 2023 | 5:38 PM

Share

ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య మళ్లీ వివాదం కొనసాగుతోంది. శనివారం (అక్టోబర్ 7) ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్లతో దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఈ రెండు దేశాల మధ్య వైరం గత 100 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. హమాస్ పాలస్తీనాలో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఎలా అవతరించిందో, ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య ఎన్నిసార్లు యుద్ధం జరిగిందో ఈ వివరాలు మీ కోసం.. హమాస్ – ఇజ్రాయెల్ మధ్య పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. మీడియా కథనాల ప్రకారం.. హమాస్ 1980లలో ఓ తీవ్రవాద సంస్థగా మారింది. ఇది ప్రస్తుతం పాలస్తీనాలో అత్యంత శక్తివంతమైన ఉగ్ర సంస్థగా కొనసాగుతోంది. ఇది పాలస్తీనాలోని ఇస్లామిక్ సంస్థలలో అతిపెద్దది, ప్రభావవంతమైనది.

హమాస్ అంటే ఏమిటి?

హమాస్ అంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్. 1980లో షేక్ అహ్మద్ యాసిన్ దీనిని స్థాపించాడు. ఇది ఇజ్రాయెల్‌పై తిరుగుబాటు చేయడానికి స్థాపించబడింది. 1988లో పాలస్తీనా విముక్తి కోసం హమాస్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో హమాస్ ఇజ్రాయెల్‌పై ఇప్పటివరకు అనేకసార్లు దాడి చేసింది. ఇందులో అనేక ఆత్మాహుతి దాడులు కూడా ఉన్నాయి.

గాజా స్ట్రిప్‌పై హమాస్ నియంత్రణ

2006లో గాజాలో తిరుగుబాటు చేసి 2007లో గాజాను పూర్తిగా ఆక్రమించిందంటే హమాస్ ఎంత శక్తివంతమైనదో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం గాజా స్ట్రిప్ హమాస్ ఆధీనంలో ఉంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసింది ఇక్కడి నుంచే. ఇజ్రాయెల్ దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే హమాస్‌ కార్యకలాపాలను బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇరాన్, నార్వే, ఖతార్, రష్యాతో సహా అనేక దేశాలు సమర్ధించడం విశేషం. ఈ దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

2014లో 50 రోజుల పాటు జరిగిన యుద్ధం

హమాస్ – ఇజ్రాయెల్ మధ్య అనేక సార్లు యుద్ధాలు జరిగాయి. 2014లో జరిగిన యుద్ధంలో రెండు వేల మందికి పైగా పాలస్తీనియన్లు, దాదాపు 80 మంది ఇజ్రాయెలీయులు మరణించారు. ఈ యుద్ధం 50 రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత 2021లో అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ సైన్యం – హమాస్ మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించారు.

13 ఏళ్లలో నాలుగు సార్లు యుద్ధం

ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య 13 యేళ్లలో నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి. 2008-09, 2012, 2014, 2021లో రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. యుద్ధం కారణంగా పాలస్తీనియన్ల వివాదం మరింత పెరుగుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.