Temple in Pak: పాకిస్తాన్‌లోని హిందూ దేవాలయం.. 72 ఏళ్ల తరువాత తెరిచారు.. ఏం కనిపించిందో తెలుసా?

దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి చాలా దిగజారింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా మిగలలేదు. చాలా వరకు కూల్చివేసి, కొన్ని అలాగే వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనితో పాటు, పాకిస్తాన్‌లో కొన్ని ప్రత్యేక దేవాలయాలు మూతబడ్డాయి. అలాంటి దేవాలయం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో కొన్ని సంవత్సరాల క్రితం తెరవబడింది.

Temple in Pak: పాకిస్తాన్‌లోని హిందూ దేవాలయం.. 72 ఏళ్ల తరువాత తెరిచారు.. ఏం కనిపించిందో తెలుసా?
Temple In Pakistan
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2023 | 10:13 PM

Temple in Pakistan: దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా మిగలలేదు. చాలా వరకు కూల్చివేసి, కొన్ని అలాగే వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పాటు, పాకిస్తాన్‌లో కొన్ని ప్రత్యేక దేవాలయాలు మూతబడ్డాయి. అలాంటి దేవాలయం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో కొన్ని సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు తెరవడం జరిగింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం గత 72 సంవత్సరాలుగా మూసి ఉంది. మరి ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేక విషయాలను ఇవాళ మనం తెలుసుకుందాం..

గుడి తెరిచినప్పుడు ఏం కనిపించింది?

ఈ ఆలయం ఎంత విశిష్టమైనదో దీని నిర్మాణాన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మితమైన ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇది చిన్న శివాలయం అయినప్పటికీ, దీని గొప్పతనాన్ని చూస్తే.. పెద్ద పెద్ద దేవాలయాలు కూడా చిన్నవిగానే అనిపిస్తాయి. గుడికి సంబంధించి అతి పెద్ద విషయం ఏంటంటే.. ఇన్ని సంవత్సరాలు మూసివేసినా, ఈ ఆలయం చెక్కు చెదరలేదు. ఇలాంటి డ్యామేజీ కూడా జరుగలేదు. ఈ పరిస్థితిని చూస్తుంటే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించబడి ఉంటాయో అంచనా వేయవచ్చు.

ఈ ఆలయాన్ని ఎవరు తెరిచారు?

ఈ ఆలయాన్ని 72 ఏళ్ల తర్వాత 2019లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు . ఈ దేవాలయం పేరు శివాలయ తేజ్ సింగ్ టెంపుల్. ఇప్పుడు మళ్లీ ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజలు చేయడం ప్రారంభించారు. ఆలయాన్ని తెరిచినప్పుడు, అక్కడ ఉన్న ప్రజలందరూ హర హర మహాదేవ్ అంటూ నలు దిక్కులు మారుమోగేలా నినాదాలు చేశారు భక్తులు. భక్తుల పాటలు, ప్రవచనాలు, కీర్తలనతో ఆ గుడి ప్రాంగణం అంతా భక్తిమయం అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..