Snake Bite: పాము కరిస్తే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. తప్పక తెలుసుకోండి..

WHO Directions for Snake Bite: పాము కాటు వేస్తే ఏం చేయాలి? వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోండి. కానీ కొన్నిసార్లు తక్షణ వైద్య సహాయం పొందడం సాధ్యం కాదు. అందుకే.. పాము కాటుకు గురైనప్పుడు ముందుగా ఏం చేయాలి? ఏ తప్పులు చేయకూడదు? అనేది ప్రతి వ్యక్తి తప్పక తెలుసుకోవాలి. ఇది ప్రమాదకర సమయంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో ఎలాంటి పాము కాటుకైనా..

Snake Bite: పాము కరిస్తే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. తప్పక తెలుసుకోండి..
Snake
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 07, 2023 | 8:38 AM

WHO Directions for Snake Bite: పాము కాటు వేస్తే ఏం చేయాలి? వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోండి. కానీ కొన్నిసార్లు తక్షణ వైద్య సహాయం పొందడం సాధ్యం కాదు. అందుకే.. పాము కాటుకు గురైనప్పుడు ముందుగా ఏం చేయాలి? ఏ తప్పులు చేయకూడదు? అనేది ప్రతి వ్యక్తి తప్పక తెలుసుకోవాలి. ఇది ప్రమాదకర సమయంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో ఎలాంటి పాము కాటుకైనా చికిత్స అందుబాటులో ఉంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పాము కాటుకు గురై లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 మిలియన్ల పాము కాటు కేసులు నమోదవుతున్నాయని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. వీరిలో 81,000 నుండి 1,38,000 మంది మరణిస్తున్నారు. దాదాపు 4,00,000 మంది ప్రజలు శాశ్వత వైకల్యం, బలహీనతతో బాధపడుతున్నారు.

ఓ నివేదిక ప్రకారం.. 2019లో భారతదేశంలో పాముకాటు మరణాల సంఖ్య 54,600. మన దేశానికి సంబంధించినంత వరకు, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో 300 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. వాటిలో సుమారు 60 విష జాతులు ఉన్నాయి. చాలా సందర్భాలలో, మరణానికి కారణాలు కోబ్రా, సాధారణ క్రైట్, రస్సెల్స్ వైపర్. అయితే, ఏ పాము కరిచిందో తెలిస్తే.. చికిత్స చేయడం చాలా సులభం అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. పాము కాటుకు గురైనా.. సకాలంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలతో బయటపడొచ్చు.

పాము కాటుకు గురైన వ్యక్తికి భరోసా ఇవ్వాలి. పాము కాటుకు గురైన వ్యక్తులు ముందుగా భయాందోళనకు గురవ్వొద్దు. అవతలి వ్యక్తిని భయపెట్టవద్దు. మిమ్మల్ని కాటు వేసిన పాము.. విషం లేని కూడా కావొచ్చు. కానీ జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. పాము కాటుకు గురైన వ్యక్తికి వైద్య సాయం లభించే వరకు వీలైనంత వరకు కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

దీని ప్రకారం.. పాము కాటుకు గురైన వ్యక్తిని ముందుగా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కరిచిన పామును శరీరానికి అతుక్కొని ఉంటే.. దానిని తొలగించాలి. అయితే, కర్రతొ కొట్టడం వంటివి చేయొద్దు. కరిచిన ప్రదేశంలో వస్త్రాన్ని తొలగించాలి. విషం ప్రవాహం జరుగకుండా.. కరిచిన ప్రదేశానికి కొంచెం పైభాగంలో క్లాత్ గానీ, దారంతో గానీ గట్టిగా కట్టాలి. పాము కాటు వేసిన ప్రదేశంలో ఉంగరాలు, కంకణాలు, కాళ్ల కడియాలు, పట్టీలు ఉంటే తీసేయాలి. ఎంతటి విషపూరితమైన పాము అయినప్పటికీ.. కాటు వేసిన వెంటనే ఎవరూ ప్రాణాలు కోల్పోరు. బాధిత వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్నట్లయితే.. తాత్కాలికంగా పారాసెటమాల్ ఇవ్వొచ్చని డబ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణులు తెలిపారు. పాము కాటుకు గురైన వ్యక్తిని స్ట్రెచర్‌పై ఎడమ వైపున పడుకోబెట్టాలని సూచించారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్